E-Paper
Advertisement

ఇందిర‌మ్మ ఇండ్ల ఛాలెంజ్‌..! స్వీక‌రించి స్వీక‌రించన‌ట్టు..! ఔన‌న్న‌ట్టా.. కాద‌న్న‌ట్టా..?? ఎట్టెట్టా..!!

ఇందిర‌మ్మ ఇండ్ల ఛాలెంజ్‌..! స్వీక‌రించి స్వీక‌రించన‌ట్టు..! ఔన‌న్న‌ట్టా.. కాద‌న్న‌ట్టా..?? ఎట్టెట్టా..!!
Advertisement

ఇంత గంద‌ర‌గోళ‌మైన ప్ర‌క‌ట‌న ఎప్పుడూ చూడ‌లేద‌యో కేటీఆర్‌! ఎందుకంత త‌డ‌బాటు. అస‌లు ఆ హౌజింగ్ స్కీమే మీకు అచ్చి రాలేదు. పెద్దాయ‌న ఏదో అధికారంలోకి వ‌చ్చేందుకు డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ని తెలంగాణ జ‌నాన్ని మోసం చేశాడు గానీ..! మ‌ళ్లీ మ‌ళ్లీ దాని గురించి ఎంత త‌క్కువ మాట్లాడితే అంత మంచిది మీకే! ఎందుకంటే ఎంత మాట్లాడాలో.. ఎన్ని చెప్పాలో.. ఎంత‌గా న‌మ్మించాలో.. ! అన్నీ చేసేశారు. ఇక ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం చెప్పినా ఈ విష‌యంలో జ‌నం న‌మ్మేలా లేరు..! మీరు వేరే అంశాలు, ప్ర‌భుత్వ లోపాలు వెతుక్కుంటే బెట‌ర్‌.. అవే మిమ్మ‌ల్ని కాపాడ‌వ‌చ్చు! ఇక అస‌లు విష‌యానికొద్దాం..! నిన్న ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఓ స‌వాల్ విసిరిండు కేటీఆర్‌కు.

ఏమ‌ని? హైద‌రాబాద్‌లో ఒక్క ఇళ్లు కూడా క‌ట్ట‌లేద‌న్నావు క‌దా.. ఈ రెండున్న‌రేండ్ల‌లో మీరెన్ని డ‌బుల్‌బెడ్ రూం ఇండ్లు క‌ట్టారో.. అంత‌కు మించి క‌ట్టిన త‌రువాతే నేను ఎమ్మెల్యేకు పోటీ చేస్తా .. లేదంటే చేయ‌ను అన్నాడు. నువ్వు దీనికి ఒప్పుకుంటే.. నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను అని స‌వాల్ స్వీక‌రించు అన్నాడు. ఇవాళ కేటీఆర్ దీనిపై స్పందించాడు. ముక్కు ఎక్క‌డుంది అంటే.. త‌ల చుట్టూ చేతి తిప్పి చూపిన‌ట్టుగా.. హౌజింగ్ స్కీమ్‌పై మాట్లాడ‌వ‌యా బాబూ.. అంటే.. ప‌ర్స‌నల్ ఆరోప‌ణ‌ల‌న్నీ వెళ్ల‌గ‌క్కాడు. వీటిపై పొంగులేటి అరాచ‌కాలు అని ఓ సెప‌రేట్ ప్రెస్‌మీటే పెట్టుకోవ‌చ్చు క‌దా! ఇందులో అవ‌న్నీ ఎందుకు? ఆ ప్ర‌క‌ట‌నంతా కంగాళీ కంగాళీ.. కేటీఆర్‌లో కంగారు కంగారు అన్న‌ట్టే ఉంది.

Advertisement

ఇంత‌కూ ఇండ్ల స్కీంపై ఏమంటావు? అంటే.. ఒక్క డ‌బుల్ బెడ్ రూం ఇల్లు.. ఏడు ఇందిర‌మ్మ ఇండ్ల‌తో స‌మాన‌మ‌ట‌. ఎట్టెట్టా..? జ‌నం వింటే తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడ‌తారు కేటీఆర్‌! ఎన్ని ఇండ్లు క‌ట్టించావు గ్రామీణ ప్రాంతాల్లో..? ఎంత మంది వాటిల్లో ఉంటున్నారు? వేళ్ల మీద లెక్క‌బెట్ట‌వ‌చ్చు. అట్ట‌ర్ ఫ్లాప్ స్కీం అది.. మీ ఓట‌మిలో అదీ ఓ కీల‌క భూమిక పోషించింది. అది నీకూ తెలుసు. ఇందుకీ సాకులు. ల‌క్ష క‌ట్టాన‌న్నావు హైద‌రాబాద్‌లో. దానికంటే ఎక్కువ క‌ట్టి చూపించు అన్నావు బాగుంది. క‌ట్ట‌క‌పోతే అప్పుడు అడుగుదాం.. నిల‌దీద్దాం.. మేము కూడా నీకు తోడుంటాం..! అంతిమంగా జ‌నానికేగా మేలు జ‌రిగేది. అలా చేయ‌డం మీకు చేత‌కాదు.. కావాలంటే నేనూ స్వీక‌రిస్తున్నా నీ స‌వాల్‌.. ల‌క్ష‌కంటే ఎక్కువ ఇండ్లు క‌ట్టిస్తే.. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను..! అని ఒక్క మాటంటే .. అబ్బ ఎంత నీటుగా ఘాటుగా.. వేటుగా ఉండేది. భ‌య‌ప‌డ్డావా?

పుసుక్కున క‌ట్టినా క‌ట్టేస్తారు.. అని! పిచ్చుక గూళ్ల‌ని నీవే అన్నావుగా. ఆ పిచ్చుక గూళ్లు క‌ట్టుకునేందుకు ఈ స‌ర్కార్ ఇచ్చే ఐదు ల‌క్ష‌లు ఏ మూల‌కూ స‌రిపోవ‌డం లేదు కేటీఆర్‌! దానికి మ‌రో ఐదారు ల‌క్ష‌లు అప్పులు చేస్తున్నారు. నీకు ప్రాక్టికాలిటీ లేదు. జ‌నంలో తిర‌గ‌వు. వారి బాధ‌లు తెలుసుకోవు. ఇండ్లు క‌ట్టించే విష‌యంలో మోసం మీద మోసం చేసి జ‌నం చేత ఛీ కొట్టించుకున్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల స్కీం ఫెయిల్ అయ్యింది. ఆ త‌రువాత సొంతంగా జాగా ఉంటే ఐదు ల‌క్ష‌ల‌న్నారు. గెల‌వగానే లేదు లేదు మూడే ల‌క్ష‌ల‌న్నాం అని అబ‌ద్ద‌మాడారు. మ‌ళ్లా ఐదు ల‌క్ష‌ల‌ని ఎన్నిక‌ల‌కుల పోయారు. చిత్తుగా ఓడిపోయారు. ఇదీ మీ ఇండ్ల స్కీం క‌థా క‌మామీషు.

Advertisement

అంటే హైద‌రాబాద్‌లో నీ లెక్క ప్ర‌కారం ల‌క్ష డుబ‌ల్ బెడ్ రూం ఇండ్ల‌కు ఏడు ల‌క్ష‌ల ఇందిరమ్మ ఇళ్లు క‌ట్టించాలంటావు! అదైనా చ‌క్క‌గా చెప్పొచ్చుగా.. అట్లైతేనే స‌వాల్ స్వీక‌రిస్తాన‌ని. మాట‌కు ముందు రాజ‌కీయ స‌న్యాసం అనే ప‌దం వాడ‌టానికి వెనుకాడ‌క‌పోయేది.. ఈ విష‌యంలో ఇంత భ‌య‌ప‌డుతున్నావెందుకు? కేటీఆర్‌!

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×