E-Paper
Advertisement

కేసీఆర్ మారిన మ‌నిషి కాదు.. ఎన్న‌టికీ మార‌ని మ‌నిషి! క‌విత మాట‌ల మ‌ర్మం వేర‌యా!

కేసీఆర్ మారిన మ‌నిషి కాదు.. ఎన్న‌టికీ మార‌ని మ‌నిషి! క‌విత మాట‌ల మ‌ర్మం వేర‌యా!
Advertisement

క‌విత తొలిసారిగా కేసీఆర్‌ను పేరు పెట్టి విమ‌ర్శించారు. ఇక పార్టీ పెట్టిన త‌రువాత‌.. ల‌క్ష్యం ఎంచుకున్నంక‌.. యుద్దం చేయ‌డ‌మే మిగిలి ఉన్న త‌రుణంలో.. ప‌రోక్ష విమ‌ర్శ‌లుండ‌వు. నేరుగా మాట‌ల దాడులుంటాయి. ఉండాలి కూడా. క‌విత కేసీఆర్‌పై ఎంత‌లా విరుచుకుప‌డ‌తారో? ఏం మాట్లాడుతారో?న‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఆమె మాట్లాడిన మాట‌లు సూటిగా, ఘాటుగానే త‌గిలాయి కేసీఆర్‌కు. కానీ జ‌నం ఆశించినంత‌, అంచ‌నా వేసుకున్నంతగా క‌విత మాట్లాడ‌లేద‌నే కొంచెం అసంతృప్తైతే క‌నిపించింది.

కేసీఆర్ అప్ప‌టి మ‌నిషి కాదు.. మారారు. మ‌ర మ‌నిషిగా అయిపోయాడు. గుంట‌న‌క్క‌లు, పందికొక్కుల వ‌ల‌లో చిక్కుకుపోయి.. వారి బంధీలో ఉండిపోయి. అప్పుడు ఏ చిన్న స‌మ‌స్యున్నా.. జ‌నం కోసం ఆయ‌న వ‌చ్చేవారు.. బాస‌ట‌గా నిల‌చేవారు. పాద‌యాత్ర‌లు చేశారు.. ప‌ట్టించుకున్నారు. కానీ ఇప్పుడు ఇవ‌న్నీ చేయ‌డం లేదు. ఆయ‌న మారిపోయారు.. అని క‌విత అన్నారు. త‌న రాజ‌కీయ వ్యూహంలో భాగంగా ఎంత వ‌ర‌కైతే మాట్లాడాలో అంత‌కే ప‌రిమిత‌మ‌య్యారు క‌విత‌. కానీ ఆమె తెలుసు. చాలా మంది కేసీఆర్‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారికీ తెలుసు. కేసీఆర్ అప్పుడూ ఇప్పుడూ ఒకేలా ఉన్నారు. మార‌లేదు. మార‌రు. మొన్న జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్ వెయ్యి జ‌న్మ‌లెత్తినా నేను చావ‌ను.. అని రేవంత్ నుద్దేశించి అన్న‌ట్టుగా.. వెయ్యి జ‌న్మ‌లైన కేసీఆర్ మార‌రు.

Advertisement

అప్పుడు కేసీఆర్ అప్ప‌టి అవ‌స‌రాల కోసం న‌డిచిన తీరు అంతే. ఆయ‌న ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. నియంత‌లానే వ్య‌వ‌హ‌రిస్తారు. ఎవ‌రేమ‌నుకున్నా డోంట్ కేర్‌. త‌ను రావాల‌నుకున్న‌ప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తారు. ఎవ‌రో చెబితే వినే ర‌కం కాదు. త‌న‌కు న‌చ్చిందే చేస్తారు. త‌న‌కు తోచిందే అమ‌లు చేస్తారు. అప్పుడైనా ఇప్పుడైనా. త‌న‌కు ఎదురు తిరిగిన వారి ముఖం కూడా చూడ‌రు. అది క‌న్న‌బిడ్డైరా సరే. కాన క‌విత ఈ విష‌యంలో త‌న స్ట్రాట‌జీని అనుస‌రించి మాట్లాడారంతే. ఆమెకూ తెలుసు. ఆది నుంచి కేసీఆర్ ఎంత క‌రుడుగట్టిన వాడో. క‌ర్క‌శుడో. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ మొండిత‌నం, ప‌ట్టుద‌ల ప‌నికి వ‌చ్చింది.

రాజ‌కీయంగా తెలంగాణ సాధించ‌డంలో ఆయ‌న నాయ‌క‌త్వం ఉప‌యోగ‌పడింది. అంత వ‌ర‌కే. దీన్ని ఎవ‌రూ కాద‌న‌లేదు. కానీ.. అంతా సేమ్‌. ఇప్ప‌టికీ. కేసీఆర్‌ను న‌మ్ముకున్న వాళ్లు బాగుప‌డ్డ‌వారు లేరు. న‌మ్మ‌కద్రోహం, న‌మ్మించి గొంతు కోయ‌డం… అవ‌స‌ర‌మున్న‌ప్పుడు ఆకాశానికెత్త‌డం.. ఆ త‌రువాత అధః పాతాళంలోకి తొక్కేసి క‌నుమ‌రుగు చేయ‌డం కేసీఆర్‌కు అల‌వాటు. అది ఆయ‌న‌కు పుట్టుక‌తో వ‌చ్చిన విద్య‌. తండ్రి మీద మ‌రీ అంత‌టి మాట‌లు క‌విత అక్క‌డ మాట్లాడ‌క‌పోవ‌చ్చు. కేసీఆర్ అప్పుడు మంచోడే కానీ…ఇప్పుడే చెడిపోయాడ‌నే విధంగా మాట్లాడ‌టం మూలంగా తండ్రిని కాద‌ని అందుకే ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని జ‌నం అర్థం చేసుకుంటార‌నే స్ట్రాట‌జీ అందులో మిలిత‌మై ఉండొచ్చు.

Advertisement

కానీ కేసీఆర్ మార‌లేదు. మార‌డు. ఇంకా అలాగే ఉంటాడు.. అని ఆయ‌న‌ను ద‌గ్గ‌ర‌గా, మొద‌టి నుంచి చూస్తూ వ‌స్తున్న ఉద్య‌మ‌కారులు, బీఆరెస్ నాయ‌కులు ఇప్ప‌టికీ చెబుతూ ఉంటారు. తాజాగా ఆయ‌న జ‌గిత్యాల స‌భ‌లో మాట్లాడిన తీరు కూడా కేసీఆర్‌లో ప‌రివ‌ర్త‌న రాదు.. అని నిరూపించుకున్న‌ట్టైంది. అహంకారం, గ‌ర్వంతో కూడిన న‌డ‌వ‌డిక‌, పాల‌న‌.. వ్య‌వ‌హార శైలి…అన్నింటా కేసీఆర్ అట్ల‌నే ఉన్నాడిప్ప‌టికీ. ఇదీ మ‌నం తెలుసుకోవాల్సింది.

ఇంకో ముచ్చ‌ట‌… ఆయ‌ను గుంట‌న‌క్క‌ల, పందికొక్కుల న‌డుమ ఉండి చెడిపోయాడ‌ని, బంధీ అయ్యాడ‌ని అన్నారు క‌విత‌. కానీ ఆయ‌న‌కు తెల‌వ‌దా? ఎవ‌రు ఎలాంటి వారో..? అంత అమాయ‌కుడా? అస‌లు విల‌న్ కేసీఆర్‌.. ఆ విల‌న్‌కు వంత పాడే భ‌జ‌న బ్యాచ్ వాళ్లు..అంతే. ఎవ‌రో చెబితే కేసీఆర్ మోస‌పోడు. కేసీఆర్ మోసంచేస్తాడు. న‌మ్మించి గొంతు కోస్తాడు. ఇది క‌విత‌కూ తెలుసు.

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

Big Stories

Advertisement
×