E-Paper
Advertisement

Gurram Paapi Reddy Review : ‘గుర్రం పాపిరెడ్డి’ మూవీ రివ్యూ

Gurram Paapi Reddy Review : ‘గుర్రం పాపిరెడ్డి’ మూవీ రివ్యూ
Advertisement

Gurram Paapi Reddy Review : తెలుగు డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటించారు. బ్రహ్మానందం, యోగిబాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జీవన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. చిన్న బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ శవాల మార్పిడి అనే యూనిక్ కాన్సెప్ట్‌తో డార్క్ హ్యూమర్, కాన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందింది. 2 గంటల 40 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకు కృష్ణ సౌరభ్ సురంపల్లి మ్యూజిక్ అందించారు. టీజర్, ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ

గుర్రం పాపిరెడ్డి (నరేష్ అగస్త్య) అనే కుర్రాడు జైలు నుంచి బయటకు వస్తాడు. తర్వాత సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో కలిసి ముగ్గురు స్నేహితులు… మిలటరీ, చిలిపి, గొయ్యి సాయంతో ఒక షాకింగ్ ప్లాన్ వేస్తాడు. శ్రీశైలం అడవుల్లో సమాధి చేసిన ఒక శవాన్ని దొంగతనం చేసి, హైదరాబాద్‌లోని స్మశానవాటికలో మరో శవంతో రీప్లేస్ చేయాలి అనుకుంటారు. ఈ ప్రాసెస్‌లో ఊహించని సమస్యలు, గందరగోళాలు ఎదురవుతాయి. మరోవైపు ఒక రాయల్ ఫ్యామిలీ సభ్యులు (హయగ్రీవ్, నీలగ్రీవ్) పాపిరెడ్డిని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ శవాల మార్పిడి వెనుక ఉన్న రహస్యం ఏంటి? అసలు ఈ గుర్రం పాపిరెడ్డి ఎవరు? రాజకుటుంబం అతన్ని ఎందుకు వెతుకుతోంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలనే మూవీని తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

Advertisement

“గుర్రం పాపిరెడ్డి” మూవీ ఆసక్తికరమైన డార్క్ కామెడీ కాన్సెప్ట్‌తో ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. మొదటి సగం బాగా ఆకట్టుకుంటుంది. పాత్రల డిజైన్ బాగా వర్కౌట్ అయ్యింది. బ్రహ్మానందం కోర్టు సీన్లు, యోగిబాబు ఎంట్రీ హైలైట్స్. శవాలను తవ్వే సీన్లు, శవాల మార్పిడి ప్రాసెస్ చుట్టూ వచ్చే సిచుయేషనల్ హ్యూమర్, పాత్రల ఎక్సెంట్రిక్ డిజైన్ బాగున్నాయి. మధ్యలో వచ్చే కామెడీ సీన్లు నవ్విస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సర్‌ప్రైజ్ ఇస్తుంది. కానీ సెకండ్ హాఫ్‌లో కథను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది, రిపీటిటివ్ సీన్లు, కామెడీ నుంచి థ్రిల్లర్‌కు షిఫ్ట్ అయినప్పుడు కథను దర్శకుడు సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోవడం మైనస్ పాయింట్స్. దర్శకుడు మురళీ మనోహర్ కామెడీ ట్రాక్స్‌ను బాగా హ్యాండిల్ చేశాడు, కానీ స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ మూమెంట్స్ బలంగా లేకపోవడం వల్ల మూవీ ట్రాక్ తప్పినట్టుగా అన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ రస్టిక్ అట్మాస్ఫియర్ క్యాప్చర్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల ఓవర్ అవుతుంది. ఓవరాల్‌గా చిన్న బడ్జెట్ ఫిల్మ్‌గా ఆశించిన దానికంటే కొంచెం ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. కానీ షార్ప్ ఎడిటింగ్ ఉంటే మరింత బెటర్ అయ్యేది. నరేష్ అగస్త్య సహజ నటన, ఎనర్జీ… ఫరియా అబ్దుల్లా కామెడీ టైమింగ్ సూపర్. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

ప్లస్ పాయింట్స్

ఫస్టాఫ్ కామెడీ
నటీనటులు
యూనిక్ కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్

Advertisement

సెకండ్ హాఫ్ సాగదీత
లెంగ్తీ రన్ టైమ్
ఎమోషనల్ డెప్త్ లేకపోవడం

మొత్తంగా

ఓసారి చూడాల్సిన కామెడీ ఎంటర్టైనర్

Gurram Paapi Reddy Rating : 2/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×