E-Paper
Advertisement

Hey Balwanth Twitter Review: ‘ హే బల్‌వంత్‌’ ట్విట్టర్ రివ్యూ.. సుహాస్ హిట్ కొట్టాడా..?

Hey Balwanth Twitter Review: ‘ హే బల్‌వంత్‌’ ట్విట్టర్ రివ్యూ.. సుహాస్ హిట్ కొట్టాడా..?
Advertisement

Hey Balwanth Twitter Review: చిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోలలో సుహాస్ ఒకడు.. ఒకప్పుడు యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చేస్తుండేవాడు. ఆ తర్వాత వెబ్ సిరీస్, షార్ట్ ఫీలిమ్స్ లలో నటించాడు.. తన నటనతో దర్శకనిర్మాతులను బాగా ఆకట్టుకున్నాడు.. కలర్ ఫోటో సినిమాతో ఒక్కసారిగా హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు ఆయనకు పలకరించాయి.. అలా సుహాసి ఒక్కో సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని సినిమాలతోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ఈయన నటించిన ‘ హే బలవంత్ ‘ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో రిలీజ్ అయింది.. ఈ మూవీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో? నెటీజన్ల అభిప్రాయాలు ఏంటో ఒకసారి ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం..

ఈ మూవీ గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.. శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. ‘హే భగవాన్’ పేరును ‘హే బల్వంత్’గా బలవంతంగా మార్చారు.. కొన్ని కారణాల వల్ల మూవీ టైటిల్ ను చేంజ్ చేశారు. ఇవాళ థియేటర్లలోకి ఈ చిత్రం వచ్చేసింది.. ప్రీమియర్ షోలతో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో ఒకసారి చూసేద్దాం..

Advertisement

హే బల్వంత్ ఊహించని వ్యాపార నేపథ్యం చుట్టూ తిరిగే మంచి స్టోరీతో వచ్చింది. ఇదొక కామెడీ ఎంటర్టైనర్. సుదర్శన్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. వివేక్‌సాగర్ సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. కామెడీ జోనర్లో సినిమా చూడాలని అనుకుని ప్రేక్షకులకు ఈ సినిమా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

సుహాస్ హే బలవంత్ మూవీ చాలా బాగుంది.. కామెడీ పీక్ లో ఉంది. ప్రతి సీన్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఫాదర్ ఎమోషన్స్ సీన్స్ సూపర్ ఉన్నాయి. ఎమోషనల్ డైలాగులతో మూవీ అదుర్స్ అంతే.. సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. అంటూ ట్వీట్ చేశారు.

స్క్రిప్ట్ అదిరిపోయింది. అయితే కత్తి మీద సాము లాంటి పాయింట్ ని చాలా చక్కగా తీశారు దర్శకుడు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా హీరోనే. ఒక పంచ్ డైలాగ్ కి ఇంకో డైలాగ్ కి గ్యాప్ లేకుండా ఉండటంతో కొన్ని సీన్స్ ఫ్లో లో మిస్ అయ్యాయి. డైలాగ్స్ అంత బాగా రాసుకున్నారు.. సుహాస్ ఫ్యామిలీ వ్యాపారాల గురించి ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కామెడీ అంటే డిన్నర్ గా మూవీ సూపర్ ఉంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

హే బలవంత్ మూవీలో శివాని, హీరో సుభాష్ అలాగే సుదర్శన్ తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.. ఇక సీరియల్ నటుడు నరేష్ అయితే చెప్పనక్కర్లేదు. తన కామెడీతో పాటుగా ఎమోషనల్ డైలాగ్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. కాస్త ఎమోషనల్ డైలాగులు ఉన్నా సరే కామెడీ మాత్రం జనాలని బాగా ఆకట్టుకుంటుంది అంటూ మరో నేటిజన్ ట్విట్చే సారు..

మొత్తానికి కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటుగా ఎమోషనల్ డైలాగులతో జనాలని కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. సుహాస్ అలాగే శివాని నగరం, సుదర్శన్ సీనన్నటుడు నరేష్ ఈ సినిమాలో తమ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్విస్తున్నారు.. మొత్తానికి ప్రీమియర్ షోలతో పాజిటివ్ టాక్ ని అందుకుంది ఈ హే బలవంత్ మూవీ… ఇక ఈ మూవీ కలెక్షన్స్ ఏమాత్రం ఉంటాయో తెలియాలంటే సాయంత్రం వరకు వెయిట్ చేయక తప్పదు..

Related News

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Dharmastala Niyojakavargam Movie Review : ‘ధర్మస్థల నియోజకవర్గం’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

Big Stories

Advertisement
×