E-Paper
Advertisement

Thriller movie OTT: రాత్రి పూట నరకం చూపించే మిస్టీరియస్ మ్యాన్… ప్రతి నిమిషం ఉత్కంఠతే… కిరాక్ కన్నడ థ్రిల్లర్

Thriller movie OTT: రాత్రి పూట నరకం చూపించే మిస్టీరియస్ మ్యాన్… ప్రతి నిమిషం ఉత్కంఠతే… కిరాక్ కన్నడ థ్రిల్లర్
Advertisement

Thriller movie OTT : థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఇప్పుడు బాగా రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలు ప్రతి భాషలో ట్రెండ్ అవుతున్నాయి కూడా. ఇక ఈ సినిమాలను ఎక్కువగా ఓటీటీలలోనే చూడటానికి ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కన్నడ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలో మెంటలెక్కించే ట్విస్టులు ఉంటాయి. సిద్ధార్థ్ అనే వ్యక్తి ఒక రాత్రి ప్రయాణంలో దారి తప్పి ఒక అడవిలో చిక్కుకుపోతాడు. ఆ తరువాత స్టోరీ మరింత ఇంటెన్స్ గా సాగుతుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ కన్నడ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘వృత్త’ (Vritta). 2025 ఆగస్టు 1న విడుదలైన ఈ సినిమాకు లిఖిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో మాహిర్ మొహియుద్దీన్, చైత్ర జె. ఆచార్, హరిణి సుందరరాజన్, శ్రీనివాస్ ప్రభు ప్రధాన పాత్రలు పోషించారు. టి. శివకుమార్ ఈ చిత్రాన్ని లక్షయ్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించగా, రేవంత్ కులకర్ణి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రస్తుతం ZEE5, Airtel Xstream Play ప్లాట్‌ ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది

స్టోరీ ఏమిటంటే

Advertisement

సిద్ధార్థ్ అనే ఒక యువకుడు ఒక రాత్రి తన కారులో ఒంటరిగా బయలుదేరుతాడు. దారి మధ్యలో అనుకోకుండా ఒక రాంగ్ టర్న్ తీసుకోవడంతో, అతను ఒక దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి ఒక తెలియని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ వల్ల అతను ఒక వింతైన మాయావలయంలో చిక్కుకుపోతాడు. తను ఎంత ప్రయత్నించినా ఆ అడవి నుండి బయటపడలేక, తిరిగి తిరిగి అదే చోటికి వస్తూ మానసిక వేదనకి గురవుతుంటాడు. ఇక ఆ అడవిలో అతనికి ఎదురయ్యే వింత అనుభవాలు అసలైనవా లేక అతని భ్రమలా అనేది సినిమా క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా సాగుతుంది. అసలు సిద్ధార్థ్ కి కాల్ చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? సిద్ధార్థ్ అడవిలో నుంచి బయటకి వచ్చాడా ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుడుకోండి.

Read Also :  గతం మరిచిపోయే భార్య… భర్త ఇచ్చే షాకింగ్ ట్విస్టులు… ఊహించని మలుపులతో చెమటలు పట్టించే స్టోరీ

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×