E-Paper
Advertisement

The Rip Review : ‘ది రిప్’ నెట్‌ఫ్లిక్స్‌ మూవీ రివ్యూ

The Rip Review : ‘ది రిప్’ నెట్‌ఫ్లిక్స్‌ మూవీ రివ్యూ
Advertisement

The Rip Review : సినిమా ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడే జానర్లలో క్రైమ్ థ్రిల్లర్ కూడా ఒకటి. ఆ జానర్లోనే రూపొందిన ‘ది రిప్’ అనే మూవీ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న దిగ్గజ ద్వయం మాట్ డామన్, బెన్ అఫ్లెక్ నటించారు. మాట్ డామన్ డాన్ డుమార్స్ పాత్రలో, బెన్ అఫ్లెక్ డిటెక్టివ్ సార్జెంట్ జె.డి. బైర్న్ పాత్రలో నటించారు. మరి ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.

కథ

కథ ఒక యువతి హత్యతో మొదలవుతుంది. ఈ విషయం గురించి టిప్ అందుకున్న మయామి పోలీసుల బృందం ఒక బిల్డింగ్ పై దాడి చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళాక లెక్కపెట్టలేనంత డబ్బు కన్పిస్తుంది. అయితే బయటి వ్యక్తులకు ఈ డబ్బు కట్టల విషయం తెలియడంతో పరిస్థితులు దారుణంగా మారతాయి. మరోవైపు పోలీసుల బృందం ఒకరినొకరు అనుమానించడంతో లోపల పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. మయామి పోలీసు దళంలో నమ్మకం కుప్పకూలిపోతుంది. ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా మారతారు. చివరికి ఆ పోలీసులలో ఒకడు దేశద్రోహి అని తెలుస్తుంది. మరి ఆ ద్రోహి ఎవరు ? అన్ని నోట్ల కట్టలు అక్కడికి ఎలా వచ్చి పడ్డాయి ? క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

Advertisement

“ది రిప్” మర్డర్ కేసు నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుతుంది. ఓపెనింగే ఇంటెన్స్ గా ఉండడంతో… మొదటి నుంచే ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చేయగలిగారు మేకర్స్. స్టోరీని అతికొద్ది మంది చుట్టూ బోర్ కొట్టకుండా తిప్పడం అంటే మామూలు విషయం కాదు. అయితే సినిమా ప్రియులకు క్రైమ్ థ్రిల్లర్‌ లు రోలర్ కోస్టర్ రైడ్ లాంటివి, కథను, ముఖ్యంగా సస్పెన్స్‌ ను ఊహించలేము కాబట్టి వాటిని చూడాలని, ఆ కిక్కు కావాలని కోరుకుంటారు. కానీ ముందే ట్విస్టును అంచనా వేయగలిగితే, ఇంక అందులో థ్రిల్ ఏముంటుంది. స్టోరీ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నప్పటికీ క్లైమాక్స్ కూడా కత్తిపడేసే విధంగా ఉండాలి. కానీ ఈ సినిమాలో క్లైమాక్స్ నీరసంగా ఉంది. కథ గందరగోళంగా ఉంది. ఈ సినిమా ఒక కీలకమైన మహిళా పాత్ర హత్యతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత కథ ముందుకు సాగుతున్న కొద్దీ ఆమెను ఎవరు చంపారనే దానిపై పెద్దగా ఉత్కంఠ ఉండదు. హీరోలలో ఒకరే దోషి అన్నట్టుగా సాగుతుంది స్టోరీ. డాన్, మాట్‌లపై అప్పుడప్పుడూ అనుమానం వచ్చేలా కథను తిప్పినప్పటికీ, హీరోలు మాత్రం ఆ పని చేయరన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి విలన్ ఎవరనేది ఈజిగా అర్థం అవుతుంది.

ఈ సినిమాకు మాట్ డామన్, బెన్ అఫ్లెక్ ప్లస్ అయ్యారు. వీరిద్దరూ బ్రో-కోడ్ వైబ్‌ తో తమ నిజ జీవిత స్నేహాన్ని సినిమాలో స్పష్టంగా చూపించారు. ముఖ్యంగా చివరి సన్నివేశంలో భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ థ్రిల్లర్‌లో ఇద్దరూ ఒకరినొకరు పరీక్షిస్తూనే అవినీతిపరులైన పోలీసులను వేటాడతారు. ఆ సీన్స్ కూడా బాగుంటాయి.

ప్లస్ పాయింట్స్

Advertisement

నటీనటులు
ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్

కథ
క్లైమాక్స్

మొత్తానికి 

ఈ మూవీ మాట్ డామన్, బెన్ అఫ్లెక్ అభిమానులకు వన్ టైమ్ వాచ్.

The Rip Rating : 1.5/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×