E-Paper
Advertisement

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్  మెప్పించారా?
Advertisement

Venkatramaiah Gari Taluka Review: డీజే టిల్లు ఫాదర్ గా అద్భుతమైన కామెడీతో..ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న మురళీధర్ గౌడ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అక్కర్లేదు. ఎంతో కాలంగా ఒక గొప్ప పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకున్న ఆయనకు ఆ తరుణం రానే వచ్చేసింది. ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారుతూ నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం ‘వెంకట్రామయ్యగారి తాలూకా’. జూలై 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్ దివిజ హీరోయిన్గా వెండితెరకు పరిచయమవుతూ వచ్చిన ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించగా.. కోమలి క్రియేషన్స్ బ్యానర్ పై కోమలి మహేందర్ తొట్టె, సోమేశ్ సారిపల్లి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరై సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మురళీధర్ గౌడ్ తన పాత్రతో మెప్పించారా? ప్రభాకర్ కూతురు దివిజ కి మొదటి సినిమా మంచి విజయాన్ని అందించిందా? అనే విషయం రివ్యూలో చూద్దాం..

వెంకట్రామయ్యగారి తాలూకా సినిమా కథ..

Advertisement

కథ విషయానికి వస్తే.. తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో ఈ కథ ప్రారంభమవుతుంది. వెంకట్రామయ్య (మురళీధర్ గౌడ్) ఒక పక్కా మిడిల్ క్లాస్ తండ్రి.. పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు అంటే ప్రాణం ఇస్తాడు. అయితే ఆ కుటుంబంలో కొన్ని ఊహించని ఇబ్బందులు వస్తాయి. ఆ కష్టాలను వెంకట్రామయ్య కుటుంబం ఎలా దాటింది? మధ్యలో హీరో దినేష్ కుమార్ హీరోయిన్ దివిజా లవ్ స్టోరీ ఎలా నడిచింది? చివరికి ఈ తాలూకాలో ఏం జరిగింది? అనేది సినిమా స్టోరీ..

నటీనటుల ఫర్మార్మెన్స్..

Advertisement

ఈ సినిమాలో ఎవరు ఎలా చేశారు అనే విషయానికి వస్తే.. ఈ సినిమాకి మురళీధర్ గౌడ్ పెద్ద దిక్కు అని చెప్పాలి. డీజే టిల్లు చిత్రంలో ఎలా అయితే తన కామెడీతో ఆకట్టుకున్నాడో అందుకు పూర్తి భిన్నంగా ఇందులో సీరియస్ , ఎమోషనల్ క్యారెక్టర్ లో జీవించేశాడు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో గ్లిజరిన్ లేకుండా ఏడ్చాను అని ఆయన ఎందుకు చెప్పాడో థియేటర్లలో ఆయన పాత్రను చూస్తే పబ్లిక్ కి అర్థమవుతుంది. అలాగే దివిజా, దినేష్ పల్లెటూరి అమ్మాయి అబ్బాయి పాత్రలో తమ పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా దివిజ గురించి చెప్పుకోవాలి . ఈమె నటనకు కొత్తే అయినా ఎక్కడ భయపడకుండా చాలా అద్భుతంగా నటించింది. సుధా, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ సత్య శ్రీ లాంటివాళ్ళు తమ అనుభవాన్ని మొత్తం తమ పాత్రలలో రంగరించారు అని చెప్పవచ్చు.

టెక్నికల్ టీమ్..

దర్శకుడు సతీష్ ఆవాల పాతకాలం నాటి ముత్యాల సుబ్బయ్య సినిమాల లాగే ఈ సినిమాలో సెంటిమెంటు బాగా దట్టించాడు. ఒక నిజ జీవిత కథను తెరమీదకు తీసుకురావడానికి నిర్మాతలు కోమలి, మహేందర్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు .ఇక ఈ సినిమాకి మ్యూజిక్ పల్లెటూరి వాతావరణానికి తగ్గట్టుగా చాలా అద్భుతంగా ఉంది.

ALSO READ:గృహప్రవేశం చేసిన ‘మనసంతా నువ్వే’ సీరియల్ హీరో యష్.. వీడియో వైరల్!

ప్లస్ పాయింట్లు:

నటీనటుల నటన

సహజత్వానికి ఉట్టిపడే కథ

మైనస్ పాయింట్లు:

అద్భుతమైన కథను తీసుకున్నప్పటికీ.. తీసిన విధానం కొంచెం రొటీన్ గా, పాత సినిమాలను చూసిన ఫీలింగ్ కలుగుతుంది.

అక్కడక్కడ కొన్ని సన్నివేశాలలో ఎక్కువగా ల్యాగ్ అనిపించింది.

మాస్ ఆడియన్స్ కి ఫైట్లు, ఫాస్ట్ బీట్లు కోరుకునే వాళ్లకి ఈ సెంటిమెంట్ కొంచెం బోర్ కొట్టవచ్చు.

చివరిగా:

వెంకట్రామయ్యగారి తాలూకా అంటే ఫైట్లు, మాస్ డాన్సులు, ఐటమ్ సాంగ్లు ఉండవు. పక్కా ఫ్యామిలీ సెంటిమెంట్. తల్లిదండ్రుల విలువ, కుటుంబం బంధాలు ఎలా ఉండాలో చెప్పే కథ ఇది. పాతకాలం నాటి సెంటిమెంట్ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా సినిమా చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఒకవేళ మాస్ మసాలా కావాలనుకుంటే మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండటమే మంచిది.

రేటింగ్: 2.75/5

Related News

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×