E-Paper
Advertisement

The Paradise Review : ‘ది ప్యారడైజ్’.. నాని కొత్త ప్రయోగం ఏమైందంటే?

The Paradise Review : ‘ది ప్యారడైజ్’.. నాని కొత్త ప్రయోగం ఏమైందంటే?
Advertisement

The Paradise Review : నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఇవాళ భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో రివ్యూ లో చూసేద్దాం..

సినిమా కథ :- 

1980ల కాలం నాటి సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏరియా చుట్టూ తిరిగే కథ ఇది. సమాజంలో ఎలాంటి హక్కులు, పౌరసత్వం లేని సంచార (సవారీ) జాతి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆ అణచివేతకు గురైన కమ్యూనిటీ తరఫున పోరాడే కుర్రాడే జడల్ జమానా అలియాస్ ధగడ్ (నాని). ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించే విలన్ల మీద జడల్ ఎలా తిరుగుబాటు చేశాడు? తన జాతి ఆత్మగౌరవం కోసం వ్యవస్థతో ఎలా పోరాడాడు అనేదే ఈ ‘ప్యారడైజ్’ అసలు కథ.. కాకుల కథతో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా సినిమా నుంచి అయినా పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

సినిమా విశ్లేషణ :

Advertisement

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. గతంలో నాని ఎన్నడు కనిపించిన విధంగా ఈ సినిమాలో కనిపించడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అంతేకాదు సినిమాపై అంచనాలను కూడా పెంచేసాయి.  అయితే ఈసారి దర్శకుడు పూర్తిగా రా, రస్టిక్ అండ్ వైలెంట్ యాక్షన్ రూట్‌ను ఎంచుకున్నాడు. సినిమాలో రక్తపాతం, హింస డోస్ చాలా ఎక్కువగానే ఉంది. ఫస్టాఫ్ లో పాత్రల పరిచయం, నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగానే ఉన్నా.. సెకండాఫ్‌లో మాత్రం కథనం నెమ్మదించి సాగదీతగా అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాత్మకంగా తీయాలి అనే ప్రయత్నం మంచిదే అయినా, ఎమోషనల్ కనెక్షన్ కొన్నిచోట్ల మిస్ అయింది.

ప్లస్ పాయింట్స్ :- 

నాని రా అండ్ రస్టిక్ యాక్టింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్.

Advertisement

అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాను చాలా వరకు నిలబెట్టింది.

1980ల నాటి వాతావరణాన్ని రీక్రియేట్ చేసిన ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్.

మైనస్ పాయింట్స్ :- 

మరీ ఎక్కువైపోయిన వయొలెన్స్, బ్లడ్‌షెడ్ (సినిమా చూస్తున్నంతసేపు తలనొప్పి రావడం గ్యారెంటీ).

బలహీనమైన కథనం, రొటీన్ రివెంజ్ డ్రామా ఫార్ములా.

నిడివి ఎక్కువగా ఉండటంతో సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తాయి.

చివరి ఆఖరి మాటగా :- 

నేచురల్ స్టార్ నాని తన క్లాస్ ఇమేజ్‌ను పక్కనపెట్టి ఫుల్ మాస్, వైలెంట్ అవతార్ ఎత్తినా.. ఆ ప్రయోగం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం కష్టమే. కేవలం యాక్షన్ లవర్స్‌ను, రక్తపాతం ఇష్టపడేవాళ్ళను మాత్రమే ఈ ‘ప్యారడైజ్’ కొంతవరకు మెప్పిస్తుంది తప్ప, సాధారణ ఆడియన్స్‌కు మాత్రం ఇది అస్సలు ఎక్కదు.

The Paradise Rating :- 2.25/5

Related News

ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ..నాని ఖాతాలో హిట్టు పడినట్టేనా?

సీక్రెట్ సోల్జర్ మూవీ రివ్యూ…

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

Big Stories

Advertisement
×