E-Paper
Advertisement

స్వీట్లకు బదులుగా.. దీపావళికి ఈ 5 గాడ్జెట్లను బహుమతిగా ఇవ్వండి!

స్వీట్లకు బదులుగా.. దీపావళికి ఈ 5 గాడ్జెట్లను బహుమతిగా ఇవ్వండి!
Advertisement

Diwali gadget gift ideas: దీపావళి వచ్చిందంటే చాలు స్వీట్లు, కొత్త బట్టలు బహుమతిగా ఇవ్వడం మన సంప్రదాయం. అయితే కాలంతో పాటు ట్రెండ్ మారుతోంది. ఈ సారి పండగను మరింత స్పెషల్‌గా మార్చడానికి మీ ప్రియమైన.. వారికి కేవలం బట్టలు కాకుండా.. రోజూ వారి జీవితంలో ఎంతో ఉపయోగపడే అద్భుతమైన గాడ్జెట్లను గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆ గిఫ్టును చూసి వారి ముఖంలో వచ్చే ఆనందమే వేరుగా ఉంటుంది. ఈ దీపావళికి బహుమతిగా ఇవ్వడానికి సరిపోయే బెస్ట్, ట్రెండీ అయిన టాప్ 5 గాడ్జెట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పండుగ అంటేనే సంతోషాల పంచడం, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం. ప్రతీ సారీ పాత పద్ధతిలోనే స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి బదులుగా.. ఈ దీపావళికి టెక్నాలజీతో ..కూడిన యూజ్‌ఫుల్ గాడ్జెట్లను గిఫ్ట్ ఇస్తే ..ఎలా ఉంటుంది? ఖచ్చితంగా.. మీ బహుమతి ఎంతో ప్రత్యేకం అనిపిస్తుంది. మార్కెట్లో.. తక్కువ ధరలో లభిస్తూ, అందరినీ ఆకట్టుకునే టాప్ 5 గాడ్జెట్లు..

1. స్మార్ట్ ఫిట్‌నెస్ బ్యాండ్ లేదా స్మార్ట్‌వాచ్:

Advertisement

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే.. వారికి ఇది పర్ఫెక్ట్ దీపావళి గిఫ్ట్. వాకింగ్, హార్ట్ రేట్, నిద్ర వేళలను ట్రాక్.. చేయడానికి స్మార్ట్‌ వాచ్‌లు ఎంతగానో ఉపయోగ పడతాయి. స్టైలిష్ లుక్‌తో.. పాటు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు.. ఉండటం వల్ల అన్ని వయస్సుల వారికీ ఇది నచ్చుతుంది.

ధర: బ్రాండ్ , మోడల్‌ను బట్టి ఇది సుమారు రూ.1,499 నుంచి రూ. 2,999 వరకు లభిస్తుంది.

2. పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్:

Advertisement

మ్యూజిక్ ఇష్టపడే.. వారికి మ్యూజిక్ స్పీకర్ అద్భుతమైన గిస్ట్ అవుతుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ఇంట్లో చిన్నపాటి పార్టీలు.. చేసుకునేటప్పుడు.. ఈ కాంపాక్ట్ స్పీకర్లు గొప్ప ఆడియో ఫీల్ అందిస్తాయి. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉన్న మోడల్స్ మరింత ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.

ధర: మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న బ్లూటూత్ స్పీకర్ సుమారు రూ.1,299 నుంచి రూ. 2,499 ధరలో లభిస్తుంది.

3. వైర్‌లెస్ పవర్ బ్యాంక్ :

ప్రస్తుత బిజీ లైఫ్‌లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్.. అయిపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఎల్లప్పుడూ బయట తిరిగే వారికి లేదా ప్రయాణాలు చేసే వారికి.. ఒక మంచి పవర్ బ్యాంక్ గిఫ్ట్ ఇస్తే వారు ఎంతో సంతోషిస్తారు.ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న వైర్‌లెస్ పవర్ బ్యాంక్స్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉన్నాయి.

ధర: దీని ధర సుమారు రూ.999 నుంచి రూ. 1,999 మధ్య ఉంటుంది.

4. మినీ పోర్టబుల్ ఫోటో ప్రింటర్ లేదా స్మార్ట్‌ఫోన్ స్టాండ్ :

ఫ్యామిలీతో గడిపిన మధురమైన జ్ఞాపకాలను వెంటనే.. ప్రింట్ చేసుకోవడానికి మినీ ఫోటో ప్రింటర్లు గొప్పగా సహాయ పడతాయి. ఒక వేళ బడ్జెట్ తక్కువగా ఉంటే..వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి .. లేదా ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు ఉపయోగపడే అడ్జస్టబుల్ స్మార్ట్‌ఫోన్/ల్యాప్‌టాప్ స్టాండ్ లేదా ఎల్‌ఈడీ రింగ్ లైట్‌ను కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.

ధర: ఇలాంటి యూజ్‌ఫుల్ గాడ్జెట్లు సుమారు రూ.499 నుంచి రూ.1,499 ధరలో లభిస్తాయి.

Also Read: టాప్-నాచ్ డిస్‌ప్లే,అల్ట్రా పెర్ఫార్మెన్స్..అసస్ ప్రోఆర్ట్ P16 రివ్యూ ఇదిగో

5. ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ :

పాటలు వినేటప్పుడు, ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ఇయర్‌ బడ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉంటున్నాయి. వైర్లు లేని ఈ ట్రెండీ గాడ్జెట్ రోజువారీ ప్రయాణాల్లో , ఆఫీసు పనుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ ఉన్న ఇయర్‌ బడ్స్ బహుమతిగా ఇస్తే వారు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

ధర: బ్రాండెడ్ ఇయర్‌బడ్స్ సుమారు రూ.1,299 నుంచి రూ. 2,999 ధరల శ్రేణిలో అందుబాటులో ఉన్నాయి.

ఈ దీపావళికి పాత పద్ధతులకు స్వస్తి పలికి, మీ ప్రియమైన వారికి ఉపయోగపడే ఈ ట్రెండీ గాడ్జెట్లను బహుమతిగా ఇవ్వండి. ఈ చిన్న టెక్నాలజీ.. బహుమతులు వారి జీవితాన్ని మరింత ఈజీ చేయడంతో పాటు, మీపై వారి ప్రేమను మరింత పెంచుతాయి.

Related News

దీపావళికి కొత్త ఫోన్ కొనాలా?పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ పట్టుకెళ్లండి!

యూట్యూబ్ కొత్త లుక్ వచ్చేసిందోచ్..ఈ సారి షార్ట్స్, క్రియేషన్‌కు పెద్ద పీట

ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారు సరే.. పవర్ బిల్లు గురించి ఆలోచించారా? ఈ లెక్కలు చూడు మామ!

టాప్-నాచ్ డిస్‌ప్లే,అల్ట్రా పెర్ఫార్మెన్స్..అసస్ ప్రోఆర్ట్ P16 రివ్యూ ఇదిగో

సామాన్యులకు పండగే.. రూ.6000 లోపే వాషింగ్ మిషన్లు.. ఇక చేత్తో ఉతికే పనేలేదు!

వీఐ సంచలన ఆఫర్.. రూ.35 కే OTT ప్యాక్.. నచ్చిన 2 ఓటీటీలు ఎంచుకోవచ్చు!

రూ.17వేలలోపు ట్యాబ్..అదిరిపోయే ఫీచర్లతో లాంచ్

Big Stories

Advertisement
×