Mohammad Wasim On Fatima Sana And Babar Azam: పాకిస్తాన్ క్రికెట్ జట్టు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎక్కడికి వెళ్లినా… ఈ మ్యాచ్ ఆడినా ఓడిపోతూ వస్తోంది. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం పరువు తీశాడు మాజీ సెలెక్టర్ మహమ్మద్ వసీం (mohammad wasim). పాకిస్తాన్ మహిళల కెప్టెన్ ఫాతిమా సనా ముందు కాలి గోటికి కూడా బాబర్ ఆజం పనికిరాడు అంటూ ఏదైనా చేస్తూ మాట్లాడారు. బాబర్ కంటే ఫాతిమా 200% బెటర్ క్రికెటర్ అంటూ వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి పాపులారిటీ ఉందని గుర్తు చేశారు. బాబర్ ఆజం పేరు వింటేనేే ఛీ కొడుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం గురించి అంతర్జాతీయ సోషల్ మీడియా కూడా తప్పుగా మాట్లాడుతూ రచ్చ చేస్తూ ఉంటుందని గుర్తు చేశారు మాజీ సెలెక్టర్ మహమ్మద్ వసీం. తన ఉద్దేశం ప్రకారం… క్రికెట్ నుంచి తప్పుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ బాబర్ ఆజం పరువు తీశారు. దీంతో మాజీ సెలెక్టర్ మహమ్మద్ వసీం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
క్రికెట్ రంగంలో ప్రదర్శన ఎంత ముఖ్యమో.. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా అంతే అవసరం. విదేశీ టూర్లకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని మహమ్మద్ వసీం గుర్తు చేశారు. అయితే క్రికెట్ లోకి వచ్చిన బాబర్ ఆజం ఇప్పటివరకు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదని పరువు తీశారు. ఎక్కడికి వెళ్లినా, ఇంగ్లీష్ రాదని చెప్పలేక ఏదో ఒకటి వాగి బాబర్ ఆజం వస్తున్నాడని ఫైర్ అయ్యారు. వాడి పొట్ట చీల్చినా ఒక్క ఇంగ్లీష్ ముక్క రాదని పరువు తీశారు. అదే పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మాత్రం ఇంగ్లీష్ ఇరగదీస్తుందని తెలిపారు. ఏ టూర్ వెళ్లినా, ఇంగ్లీష్ మాట్లాడి పాకిస్తాన్ పరువు కాపాడుతోందని వ్యాఖ్యానించారు. ఆ లేడీ క్రికెటర్ కు ఉన్న బుద్ధి బాబర్ ఆజంకు లేదని బాంబు పేల్చారు. అందుకే తనకు బాబర్ ఆజం అంటే అస్సలు నచ్చదు అంటూ చురకలు అంటించారు.
బాబర్ ఆజం ఈమధ్య బ్యాటింగ్ కూడా సరిగ్గా చేయడం లేదని మాజీ సెలెక్టర్ వసీం ఫైర్ అయ్యారు. ఇంగ్లాండ్ గడ్డపై ఏదో పీకుతాడని అనుకుంటే.. పాకిస్తాన్ పరువు గంగలో కలిపాడని సీరియస్ అయ్యారు. బ్యాటింగ్ సరే… మనోడికి బౌలింగ్ కూడా చేతకాదని మండిపడ్డారు. కానీ ఫాతిమా సనా స్టైలే వేరు. ఆమె బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా ఇరగదీస్తుంది. వరల్డ్ నెంబర్వన్ ఆల్ రౌండర్ అని చెప్పవచ్చని తెలిపారు. బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ, బౌలింగ్ లో రాణించే సత్తా మీకు ఉందని.. గతంలో కూడా నిరూపించుకున్నట్లు గుర్తు చేశారు.