E-Paper
Advertisement

ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదే!

ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదే!
Advertisement

Ustaad Bhagat Singh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా శ్రీ లీల , రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 19వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. నిజానికి గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి..కానీ ఆ అంచనాలను అందుకోవడంలో డైరెక్టర్ విఫలం కావడంతో అభిమానులు సైతం హరీష్ శంకర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకి కొంత ఆకర్షణగా నిలిచినా.. ఇవేవీ కూడా సినిమాను నిలబెట్టలేకపోయాయి. దీంతో యాంటీ ఫ్యాన్స్ నుండి భారీగా ట్రోల్స్ వచ్చాయని చెప్పవచ్చు.

ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన ఉస్తాద్..

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబో కోసం మళ్లీ ఎదురు చూసిన అభిమానులకు ఈ సినిమా భారీ నిరాశను మిగిల్చింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ వేదికగా నేటి నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ సినిమా ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేసినా.. ఫ్యామిలీతో కలిసి సినిమాను వీక్షించే అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళ్ , మలయాళం , కన్నడతో పాటు హిందీ భాషలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్.. మొత్తానికి అయితే థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీ లో ఈ సినిమాను చూడవచ్చు. మరి థియేటర్లలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇటు ఓటీటీలో ఏ మేరకు అలరిస్తుంది అనే ప్రశ్న మళ్ళీ మొదలైంది.. మరొకవైపు యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇటు ఓటిటి స్ట్రీమింగ్ లో కూడా మరోసారి ట్రోలింగ్ చేయడానికి సిద్ధం అయిపోయారు. ఏది ఏమైనా ఉస్తాద్ మాత్రం విపరీతమైన ట్రోలింగ్స్ ఎదుర్కొంటోంది అనడంలో సందేహం లేదు.

Advertisement

ALSO READ:విదేశీ యూనివర్సిటీలో తెలుగు సినిమా పాఠాలు.. ఆ మూవీపై మృణాల్ ప్రశంసలు!

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టోరీ..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. నల్లమల అడవుల్లోని ఒక అటవీ ప్రాంతంలోని చిన్న గ్రామానికి ఒక మాస్టర్ వస్తాడు.. అక్కడ కొంతమంది ఎలిఫెంట్ హంటర్స్ ను బాణాలతో చంపేసిన 14 ఏళ్ల కుర్రాడిని చూస్తాడు. తల్లిదండ్రులు లేని అతడిని ఆదరిస్తాడు ఆ మాస్టర్. ఆ కుర్రాడు కూడా అతడిని గురువుగా భావిస్తాడు. అతనిలో రగులుతున్న ఫైర్ ని చూసి భగత్ సింగ్ అని పేరు పెడతారు మాస్టర్ . పెద్దయ్యాక ఈ భగత్ సింగ్ ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా భగవద్గీత శ్లోకం “పరిత్రాణాయ సాధూనం”బ్యాక్ గ్రౌండ్లో ప్రత్యక్షమైపోయి కాపాడేస్తూ ఉంటాడు. ఇక చిన్నప్పుడు ఆ కుర్రాడిని ఆదరించిన మాస్టారు కాలక్రమేనా ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతాడు. ఈ నేపథ్యంలోనే ఒక పదవి వ్యామోహం వల్ల నల్ల నాగప్ప (పార్థిబన్) రకరకాల హత్యలు చేస్తూ ఉంటాడు. అతని కొడుకులు కూడా అంతే… ఇక వారందరికి పవన్ కళ్యాణ్ ఎలా గుణపాఠం చెప్పారు అనేది సినిమా స్టోరీ.. థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఇటు ఓటిటిలోనైనా వ్యూస్ దక్కించుకుంటుందేమో చూడాలి.

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×