E-Paper
Advertisement

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ‘మాయ లేడీ’ మూవీ..సినిమా ఎలా ఉందంటే?

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా  ‘మాయ లేడీ’ మూవీ..సినిమా ఎలా ఉందంటే?
Advertisement

Maya Lady Movie Review: రాకేష్ మధుమిత సర్కార్, సత్య, ఇంద్రజ, మైసూర్ సురేష్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మాయలేడి సినిమా నేడు విడుదల అయింది. సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది.. ఈ సినిమా విశేషాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నటీనటులు: రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, సత్య, ఇంద్రజ, సురేష్ తదితరులు
దర్శకత్వం: ప్రశాంకర్
నిర్మాత: రాకేష్ వర్రే
సంగీతం: విశాల్ చంద్రశేఖర్

సినిమా కథేంటంటే:

Advertisement

క్రిష్ (రాకేష్ వర్రే) ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోచ్‌గా పనిచేస్తుంటాడు. అమ్మాయిలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తూ తన జీవితానికి సరిపోయే సరైన భాగస్వామి కోసం ఎదురుచూస్తుంటాడు. ఆ సమయంలో సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఆశా (మధుమిత సర్కార్) పరిచయం కాగా, ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఆశాకు పూర్తిగా భిన్నమైన స్వభావం ఉన్న రూపా (మధుమిత సర్కార్) అనే మరో అమ్మాయి కూడా క్రిష్ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆశా, రూపాల మధ్య అసలు సంబంధం ఏమిటి? ఆ రహస్యం వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి అనేదే ఈ చిత్ర కథాంశం.

సినిమా విశ్లేషణ:

మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను ఎంచుకొని తెరకెక్కించిన రొమాంటిక్ సస్పెన్స్ డ్రామా ఇది. దర్శకుడు ప్రశాంకర్ ఈ పాయింట్‌ను లవ్ స్టోరీతో బ్లెండ్ చేసి కొత్త ప్రయత్నం చేసేందుకు చూశారు. అయితే కథా నేపథ్యం బాగున్నప్పటికీ, దానిని తెరపై ఆకట్టుకునేలా నడిపించడంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. సినిమా మొదటి భాగం చాలావరకు రొటీన్ లవ్ ట్రాక్ మరియు అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లతో సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ పర్వాలేదనిపించినా, ద్వితీయార్థంలో వచ్చే కథనం చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తుంది. స్క్రీన్ ప్లేలో బిగి లేకపోవడం, పాత్రల మధ్య సంఘర్షణ సరిగ్గా పండకపోవడం సినిమాకు ప్రధాన మైనస్‌గా మారాయి. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ, ఓవరాల్‌గా ట్రీట్‌మెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమా నిరాశపరుస్తుంది.

ప్లస్ పాయింట్లు :

Advertisement

* రెండు భిన్నమైన పాత్రల్లో (ఆశా, రూపా) అద్భుతంగా నటించి మెప్పించిన హీరోయిన్ మధుమిత సర్కార్

*విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం (BGM) మరియు మెలోడీ సాంగ్స్

*కొన్ని సన్నివేశాలలో కమెడియన్ సత్య పండించిన కామెడీ

*ఇంటర్వెల్ వద్ద ఇచ్చిన సస్పెన్స్ ట్విస్ట్

మైనస్ పాయింట్లు :

*గందరగోళంగా మరియు సాగదీతగా మారిన ద్వితీయార్థపు కథనం

*బలహీనమైన స్క్రీన్‌ప్లే మరియు ఆకట్టుకోని దర్శకత్వ ప్రతిభ

*కామెడీని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోకపోవడం

*రొటీన్‌గా అనిపించే కొన్ని సన్నివేశాలు

చివరి ఆఖరి మాటగా :

మంచి పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, దానిని ఆసక్తికరంగా మలిచి ఈ ‘మాయ లేడీ’ మంచి  స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పవచ్చు ..

రేటింగ్: 2.5/ 5

Also Read: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీ విద్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అదే నా అర్హత అంటూ!

Related News

కొత్త కథతో వచ్చిన డార్క్ చాక్లెట్.. సినిమా ఎలా ఉందంటే?

మౌళి ‘దొంగ నా కొడుకు’ మూవీ రివ్యూ!

‘ఇట్లు అర్జున’ మూవీ రివ్యూ..

సుడిగాలి సుధీర్ ‘జి.ఓ.ఏ.టి.’ మూవీ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?

‘మహాశక్తి’ మూవీ రివ్యూ..అమ్మవారిగా నయన్ మెప్పించిందా?

సూర్య సీన్ మూవీ రివ్యూ.. హ్యాట్రిక్ కొట్టారా?

‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ.. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందా?

Big Stories

Advertisement
×