Hammer Wave 10W Bluetooth Speaker: ప్రస్తుత రోజుల్లో మ్యూజిక్ వినడం అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు లేదా చిన్నపాటి పార్టీలు నిర్వహించే.. సమయంలో మంచి సౌండ్ క్వాలిటీ ఉండే స్పీకర్ ఉంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. మార్కెట్లో.. అనేక రకాల బ్లూటూత్ స్పీకర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్లో ప్రీమియం సౌండ్ అందించే బ్రాండ్ల కోసం యూజర్లు ఎక్కువగా వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ‘హామర్’ సంస్థ అత్యంత చవకైన ధరలో ఒక అద్భుతమైన పోర్టబుల్ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ స్పీకర్ కేవలం రూ.749 ధరకే లభిస్తుండటం విశేషం. ఈ స్పీకర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బ్లూటూత్ స్పీకర్ డిజైన్ విషయానికి వస్తే..ఇది చూడటానికి చాలా కాంపాక్ట్, స్టైలిష్‌గా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. దీని బ్లూ కలర్ వేరియంట్ చూడటానికి.. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. బాడీ పైన ఉపయోగించిన మెటీరియల్.. చాలా గట్టిగా ఉండటం వల్ల కింద పడినా లేదా రఫ్‌గా వాడినప్పటికీ ఈజీగా పాడవదు. తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
రూ.749 ధర కేటగిరీలో.. వస్తున్నప్పటికీ, ఈ స్పీకర్ సౌండ్ విషయంలో.. ఎలాంటి రాజీ పడలేదు. ఇందులో 10W పవర్ఫుల్ ఆడియో అవుట్ పుట్‌ను అందించారు. మోనో ఛానల్ సపోర్ట్‌తో పని చేసే ఈ స్పీకర్ చిన్న రూమ్ లో లేదా అవుట్ డోర్ చిన్న పార్టీల్లో మంచి సౌండ్ అందిస్తుంది. పాటలు.. వినేటప్పుడు వోకల్స్ స్పష్టంగా వినిపిస్తాయి. అంతే కాకుండా బేస్ కూడా ఈ సైజు స్పీకర్‌కు తగినట్లుగా చాలా చక్కగా సెట్ చేయబడింది. సినిమా పాటలు, పాప్ మ్యూజిక్ లవర్స్‌కు ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.
పోర్టబుల్ స్పీకర్ కొనేప్పుడు ప్రతి ఒక్కరూ చూసే.. ముఖ్యమైన ఫీచర్ బ్యాటరీ బ్యాకప్. ఈ హామర్ వేవ్ స్పీకర్ ఒక్క సారి పూర్తి ఛార్జ్ చేస్తే ..సుమారు 8 గంటల పాటు ప్లేటైమ్ అందిస్తుంది. అంటే.. మీరు ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా ఇంట్లో పని చేసుకునేటప్పుడు బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా రోజంతా పాటలు వినొచ్చు. దీనిలోని రీఛార్జబుల్ బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది. అంతే కాకుండా ఇది బెస్ట్ బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది.
ఈ ధరలో లభించే స్పీకర్లలో అరుదుగా కనిపించే అద్భుతమైన ఫీచర్ ట్విన్ పేరింగ్. మీ దగ్గర గనక ఇలాంటి హామర్ వేవ్ స్పీకర్లు రెండు ఉంటే.. ఆ రెండింటిని ఒకదానితో ఒకటి వైర్లెస్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని వల్ల సౌండ్ మరింత పెరిగి, మీకు ట్రూ స్టీరియో సౌండ్ ఫీల్ లభిస్తుంది. చిన్న పాటి గెట్టూగెదర్స్ లేదా బర్త్‌డే పార్టీల సమయంలో ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.
Also Read: బిగ్,బోల్డ్ డిజైన్‌తో శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ లాంచ్..పూర్తి ఫీచర్లివే!
ఈ స్పీకర్ మరో గొప్ప విశేషం ఏంటంటే ఇది ఇండియాలో తయారైంది . ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి తగినట్లుగా దేశీయ టెక్నాలజీతో, మన దేశ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశారు. దీని వల్ల క్వాలిటీ పరంగా ఎలాంటి సందేహం ఉండదు. స్థానిక తయారీకి మద్దతు ఇచ్చినట్లు కూడా అవుతుంది.
ఈ స్పీకర్లో లేటెస్ట్ బ్లూటూత్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్, టాబ్ లేదా ల్యాప్ టాప్కు ఇది క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. బ్లూటూత్ కాకుండా.. ఇతర ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. దీని పైన ఉండే కంట్రోల్ బటన్ల సహాయంతో వాల్యూమ్ పెంచడం, తగ్గించడం, పాటలను మార్చడం, కాల్స్ లిఫ్ట్ చేయడం చాలా ఈజీగా చేయెచ్చు.
కేవలం రూ.749 బడ్జెట్లో 10W పవర్ఫుల్ సౌండ్, 8 గంటల బ్యాటరీ లైఫ్, ట్విన్ పేరింగ్ ఫీచర్ , మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో వస్తున్న ఈ స్పీకర్ నిజంగా ఒక వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. తక్కువ ఖర్చులో మంచి పోర్టబుల్ స్పీకర్ కోరుకునే ప్రతి ఒక్కరికీ ఇది బెస్ట్ చాయిస్.