VW Visio World 7.5 kg semi automatic washing machine: ప్రస్తుత కాలంలో ప్రతి ఇంటిలోనూ వాషింగ్ మెషీన్ అనేది ఒక తప్పనిసరిగా మారిపోయింది.ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి, మహిళలకు బట్టలు ఉతికే శ్రమను తగ్గించడంలో వాషింగ్ మెషీన్లు ఎంతగానో సహాయ పడుతున్నాయి. అయితే మార్కెట్లో అనేక బ్రాండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో ఎక్కువ కెపాసిటీ, బెస్ట్ క్వాలిటీ అందించే బ్రాండ్ల కోసం కస్టమర్లు ఎక్కువగా వెతుకుతుంటారు. అలాంటి వారి కోసం ‘వీడబ్ల్యూ విజియో వరల్డ్’సంస్థ అత్యంత ఆకర్షణీయమైన ధరలో ఒక అద్భుతమైన వాషింగ్ మెషీన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ..ఈ వాషింగ్ మెషీన్ కేవలం రూ.7,190 ధరకే లభిస్తుండటం విశేషం.ఈ వాషింగ్ మెషీన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వాషింగ్ మెషీన్ డిజైన్ విషయానికి వస్తే..ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ,ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. దీని బ్లాక్ కలర్ వేరియంట్ మీ బాత్రూమ్ లేదా లాండ్రీ ఏరియాకు ఒక మోడర్న్ లుక్‌ను అందిస్తుంది. దీని బాడీ తయారీలో.. ఉపయోగించిన ప్లాస్టిక్ మెటీరియల్ చాలా క్వాలిటీ కలిగి ఉంటుంది. దీని వల్ల తుప్పు పట్టే.. సమస్య ఉండదు. మెషీన్ కూడా చాలా కాలం పాటు పాడవకుండా ఉంటుంది. అలాగే ఇది కాంపాక్ట్ సైజులో.. ఉండటం వల్ల ఇంటిలో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి ఈజీగా జరుపుకోవచ్చు.
ఈ వాషింగ్ మెషీన్ 7.5 కేజీల కెపాసిటీతో వస్తుంది. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు (సుమారు 4 నుంచి 5 మంది సభ్యులున్న ఇళ్లకు) సరిగ్గా సరి పోతుంది. ఒకే సారి ఎక్కువ బట్టలను వేసి ఉతకడానికి ..ఈ కెపాసిటీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో.. ఉన్న పవర్ ఫుల్ మోటార్ బట్టలపై ఉన్న మొండి మరకలను కూడా ఈజీగా తొలగిస్తుంది. బట్టల రకాలను బట్టి ఉతకడానికి వీలుగా.. ఇందులో ప్రత్యేకమైన వాష్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.అందుకే బట్టలు త్వరగా పాడవకుండా ఉంటాయి.
ఈ మెషీన్ మెయిన్ హైలైట్ ఇందులో ఉన్న అక్వా స్పిన్ టెక్నాలజీ . ఇది బట్టలను వేగంగా.. తిప్పడం ద్వారా నీటిని, డిటర్జెంట్‌ను బట్టల లోపలికి సమానంగా చేరేలా చేస్తుంది. దీని వల్ల తక్కువ నీటితోనే.. బట్టలు చాలా శుభ్రంగా ఉతకబడతాయి. అలాగే.. దీనికి 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ లభించింది. దీని అర్థం ఈ వాషింగ్ మెషీన్ చాలా తక్కువ కరెంట్ ఖర్చు చేస్తుంది. కరెంట్ బిల్లు పెరుగుతుందనే టెన్షన్ లేకుండా దీన్ని రోజూ నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.
Also Read: తక్కువ ధరలో..స్టైలిష్ లుక్స్‌తో సరికొత్త స్పీకర్,సౌండ్ నెక్స్ట్ లెవెల్!
ఇది ఒక సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్. ఇందులో వాష్ టబ్ ,స్పిన్ టబ్ వేర్వేరుగా ఉంటాయి. బట్టలు ఉతికిన తర్వాత వాటిని డ్రైయర్ టబ్‌లో.. వేసి త్వరగా ఆరబెట్టుకోవచ్చు. స్పిన్ డ్రైయర్ వేగంగా.. పని చేయడం వల్ల బట్టలలోని నీరు చాలా వరకు తొలగిపోతుంది. దీని వల్ల బట్టలు ఎండలో వేసిన వెంటనే.. త్వరగా ఆరిపోతాయి. వాషింగ్ సైకిల్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోయే ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఈ వాషింగ్ మెషీన్‌ను ఆపరేట్ చేయడం చాలా సింపుల్. దీని పైన ఉండే రొటేటరీ నాబ్స్సహాయంతో వాష్ టైమ్ , మోడ్‌ను ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ షాక్‌లు తగలకుండా తగిన సేఫ్టీ ఫీచర్లు ఇందులో వాడారు. కాబట్టి తక్కువ నీటి సరఫరా ఉన్న ప్రాంతాలలో కూడా దీన్ని మాన్యువల్‌గా నీరు పోసి వాడొచ్చు.