E-Paper
Advertisement

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీ విద్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అదే నా అర్హత అంటూ!

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీ విద్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? అదే నా అర్హత అంటూ!
Advertisement

Big TV Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో కమెడియన్స్ అలాగే డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇలా జబర్దస్త్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో బాబు ఒకరు. ఇటీవల ఈయన దర్శకుడిగా మారి లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Least Eligible Bachelor) అనే సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ లో భాగంగా పలువురు జబర్దస్త్ కమెడియన్స్ కూడా పాల్గొన్నారు. ఇలా ఈ సిరీస్ లో భాగమైన వారిలో జబర్దస్త్ లేడీ కమెడియన్ శ్రీవిద్య(Sri Vidya) ఒకరు. తాజాగా జబర్దస్త్ బాబుతో కలిసి శ్రీవిద్య బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big tv kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీ విద్యను ఎందుకు తీసుకున్నావ్…

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవిద్య ఈ సిరీస్ గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ లో శ్రీవిద్యను తీసుకోవడంతో చాలామంది ఎందుకు ఆమెను తీసుకున్నారు అంటూ నాతో మాట్లాడాలని బాబు తెలిపారు. అలాగే షూటింగ్ సమయంలో డిఓపి శ్రీవిద్యను చాలా తిట్టారని కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. అదేవిధంగా ఈ సిరీస్ కోసం శ్రీవిద్య తీసుకున్న రెమ్యూనరేషన్ (Remuneration) కి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి.

నా అర్హత నాకు తెలుసు..

Advertisement

ఈ సిరీస్లో ఈమె పాత్ర చాలా మంచి ఆదరణ సొంతం చేసుకున్నప్పటికీ నువ్వు మాత్రం కేవలం 5000 రెమ్యూనరేషన్ తీసుకున్నావట వాళ్ళు ఎక్కువ ఇస్తానన్న వద్దన్నావట ఎందుకు అంటూ వర్ష ప్రశ్నించారు. ఈ మాటకు శ్రీవిద్య సమాధానం చెబుతూ నా అర్హత ఏంటో నాకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఈ సిరీస్ మొత్తానికి కలిపి 5000 రెమ్యూనరేషన్ తీసుకున్నారా లేదంటే రోజుకు 5000 చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారా అనే విషయం పట్ల క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవిద్య జబర్దస్త్ కమెడియన్స్ గురించి కూడా మాట్లాడారు.

Advertisement

ప్రస్తుతం బిగ్ ఈ హౌస్లో రాంప్రసాద్ నరేష్ ఉన్న సంగతి తెలిసిందే. ఎవరు విజేత అవుతారు అంటూ వర్ష అడగడంతో నాకు తెలిసి బిగ్ బాస్ సీజన్ 10 కప్పు ఈసారి నాగార్జున గారు తీసుకెళ్లిపోతే బాగుంటుందని శ్రీవిద్య కామెడీ చేశారు. ఇక నరేష్ గురించి మాట్లాడుతూ.. నరేష్ తనకు ఎప్పుడు అప్పు ఇస్తూ ఉంటారు అయితే ఆయన అప్పు ఇచ్చిన ఒక గంటకి తిరిగి తన అప్పు తీర్చమని అడిగే వారని నరేష్ గురించి చేసిన ఈ కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో వీరిద్దరూ ఇంకా ఎలాంటి విషయాల గురించి ముచ్చటించారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్… 3 అపార్ట్మెంట్లు కొన్న బాబు?

Related News

లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్… 3 అపార్ట్మెంట్లు కొన్న బాబు?

జబర్దస్త్ లో దర్శనమిచ్చిన ‘అగ్నిపరీక్ష’ రాజకుమారి!

నాగవ్వ పాట..వైష్ణవి సోనీ డ్యాన్స్.. ఫోక్ లవర్స్‌కు పూనకాలే!

బైక్ కాదు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ అడగాల్సింది.. ఒక్క హిట్ కే రేంజ్ మార్చిన జబర్దస్త్ బాబు!

ఒక్క జాతకం చెప్పడానికి వేణుస్వామి ఎంత తీసుకుంటారో తెలుసా?

ఫ్యామిలీ వీక్ లో సెలబ్రిటీ గెస్ట్ లు.. ఎవరి తరఫున ఎవరు రాబోతున్నారో తెలుసా?

డైరెక్టర్ గా కంటే ఆర్టిస్ట్ గా ఉండడమే మంచిది.. కడుపు నిండా తినలేని పరిస్థితి: జబర్దస్త్ బాబు

Big Stories

Advertisement
×