Ramayana Teaser Review: రామాయణం చిన్నప్పటి నుంచి కొన్ని వందల సార్లు విని ఉంటాం. చాలా సార్లు చూసి ఉంటాం కానీ మళ్లీ వచ్చినా చూస్తాం.. మళ్లీ చెప్పినా వింటా.. ఎన్నో వేల కథలు ఉన్నా రాముడి కథే మనకు ఎందుకు అంత స్పెషల్ అంటే.. మాట తప్పని వాడు రాముడు.. ధర్మం తెలిసిన వాడు రాముడు.. మానవుడు ఎలా జీవించాలో చెప్పడానికి రాముడి పాత్ర ఇక్కటి సరిపోతుంది. అలాంటి కథే మళ్లీ మరో సారి మన ముందుకు రాబోతుంది.. బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితేష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపిస్తున్న సినిమనే ‘రామాయణ’. ఒక ఇండియన్ రూటెడ్ కథను ప్రపంచ స్థాయిలో ఎలా చూపించాలో అన్న ప్రయత్నమే ఈ సినిమా.. హాలీవుడ్ సినిమాలు సైతం ఆశ్చర్య పడేలా దాదాపు నాలుగు వేల కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
Read also-కొరియన్ అబ్బాయితో ప్రేమలో పడ్డ హీరోయిన్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!
టీజర్ ను చూస్తుంటే.. భారత దేశ సినీ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా వాడని విధంగా తీర్చిదిద్దినట్లుగా తెలుస్తోంది. రాముడి పాత్రలో రణ్‌బీర్ అసలు నిజంగా రాముడు అంటే ఇలానే ఉండాలి అనన్నట్లుగా కనిపించారు. రాముడిని చూపించే విధానం సినిమా ప్రేక్షకులనే కాకుండా ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. విడుదలైన టీజర్ లో కేవలం రాముడిని మాత్రమే పూర్తిగా చూపించారు. సీత, లక్ష్మణుడు కొన్ని ప్రేమ్స్ లో మాత్రమే.. కనిపిస్తారు. రావణాసురుడిగా చేసిన యష్ కూడా పూర్తిగా కనిపించలేదు. కానీ ఈ పాత్రలను చూపించే విధానం నిజనంగా రామాయణ మన కళ్ల ముందే జరిగిందా అని అన్నట్లు గా అనిపిస్తుంది. ప్రతి ప్రేమ్ కూడా రాముడిని ఎలివేట్ చేసేలా ఉంది. దంగల్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించి నితేష్ తివారి ఈ సినిమా కు దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగ పెరిగాయి. దానికి తగ్గట్టు గానే టీజర్ కూడా రూపొందించారు.
ఈ టీజర్ లో వీఎఫ్ ఎక్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది ఒక విజువల్ వండర్ అని చెప్పవచ్చు. ఎనిమిది సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ప్రసిద్ధ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ DNEG ఈ చిత్రానికి పని చేస్తోంది. అలాగే, ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు హన్స్ జిమ్మెర్, ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం విశేషం. టీజర్ లోని సంగీతం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. టీజర్ తోనే ఇంతటి సంచలనం క్రియేట్ చేస్తే ఈ సినిమా విడుదలై మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.