Brahmamudi serial today Episode: ఇందు, రాజును రూంలోంచి బయటకు తోసేస్తుంది. రాజు డిస్సపాయింట్ అవుతూ బాధగా హాల్లోకి వెళ్తాడు. అప్పటికే హాల్లో కూర్చుని ఉంటాడు శేషు.. రాజు ఈ వేలితోనే కదా నీ మెడలో మూడు వేశాను ఎలా కాల్చాలనిపించింది ఇందు. నేను హర్ట్ అయ్యను నేను నీతో మాట్లాడనుపో అనుకుంటూ హాల్లోకి వెళ్లి కూర్చుంటాడు. శేషు ఆశ్చర్యంగా చూస్తూ.. అల్లుడు వేలికి ఏమైంది..? గోరు చుట్టు కానీ ఏమైనా లేచిందా..? నిమ్మఉప్పు పెట్టుకో తగ్గిపోతుంది అని చెబితే.. రాజు అదేం లేదు మామ అంటాడు. మరి డోర్ మధ్యలో ఏమైనా వేలు పెట్టావా..? అని శేషు అడిగితే.. లేదు మామ అంటాడు రాజు. శేషు అనుమానంగా మరి ఇంకేంటి..? అంటే.. ఇందు నాకోసం ప్రేమగా వేడి వేడి పాలు తీసుకొచ్చింది. అవి వేడిగా ఉన్నాయో లేవోనని చూద్దామని వేలు పెట్టాను.. అంటూ రాజు చెప్పగానే..
ఏంటి ఆ మాత్రం దానికే వేలు కాలిపోయిందా..? ఈ వేలు చూస్తుంటే.. పాలల్లో పెట్టినట్టు అనిపించడం లేదే.. ఎవరో వాత పెట్టినట్టు ఉందే అంటాడు శేషు. దీంతో రాజు షాక్ అవుతూ మామయ్య చెప్పింది విని పక్కకు పోవాలి ఇలా డీటెయిల్‌గా అడగొద్దు అంటాడు రాజు. నువ్వు చెప్పింది వినడానికి నేనేమైనా రేడియో శ్రోతనా..? ఆద్యంతం ఆసక్తికరంగా తిలకించిన ప్రేక్షకుడిని అంటూ శేషు చెప్పగానే.. రాజు చూసేశావా..? అంటే మొత్తం చూసేశా అల్లుడు లోపల ఏం జరిగిందో ఆ సీన్ టూ సీన్ చెప్పమంటావా..? అనగానే.. రాజు కంగారు పడుతూ ఏయ్ చెప్పొద్దు.. నాకే కాదు ఎవ్వరికీ చెప్పొద్దు.. అంటూ రాజు రిక్వెస్ట్ చేస్తే.. కానీ నా దగ్గర ఏ విషయం దాగదే.. సరేలే నువ్వు ఇంతలా బతిమాలుతున్నావు కదా ఈసారికి నువ్వన్నట్టే చేద్దాంలే అంటే థాంక్స్ మావ నీరుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటాడు రాజు. అందుఉ నువ్వేమీ బాధపడక్కర్లేదు అల్లుడు ఇలా తీర్చుకో అంటూ మందు తాగుదాం అన్నట్టు సైగ చేస్తాడు.
అందుకు రాజు అలాగే నేను అరైంజ్ చేస్తాను అంటూ చెప్తుంటే.. అపర్ణ వస్తుంది. రాజు, పంతులు గారు చెప్పింది అంతా గుర్తుంది కదా ఈరోజు నుంచి నువ్వు మూడు రోజులు ఇక్కడే సోపాలో పడుకోవాలి అని చెప్పగానే.. ఏంటి ఈ సోపాలోనా..? నాకు నిద్ర పట్టదు అంటూ రాజు కంగారు పడతాడు. శేషు వెటకారంగా అయితే ఆ సోపాలో పడుకో అల్లుడు మీ అత్త నన్ను తన్ని తరిమేసినప్పుడు నేను చాలా సార్లు వచ్చి ఆ సోపాలోనే పడుకునే వాడిని అని చెబితే.. రాజు కోపంగా నువ్వు ఆగు మామ సోపా అంటే ఈ సోపా ఆ సోపా అని కాదు అసలు సోపాలో పడుకోవడమే నాకు ఇష్టం లేదు అంటాడు. అందుకు శేషు మరి ఇంకెక్కడ పడుకుంటావు.. టెర్రస్‌లో పడుకుంటావా..? బయట గార్డెన్‌లో పడుకుంటావా..? చెప్పు అల్లుడు అంటే చాపా దిండు అవి ఏర్పాటు చేస్తాను అంటాడు.
రాజు కోపంగా శేషును తిట్టి అలా కాదు అమ్మమ్మ నాకు సోపాలో పడుకోవడం అలవాటు లేదు కదా అందుకే అదే రూంలో ఒక మూలన పడుకుంటాను అంటే ఒకే గదిలో పడుకోకూడదు అనే కదా నిన్ను బయట పడుకోమనేది అంటూ శేషు చెబితే.. మామయ్య నీకు మందు కావాలా.. వద్దా అంటూ బెదిరించగానే.. శేషు సైలెంట్ అవుతాడు. అపర్ణ మాత్రం ఈ మూడు రోజులు నువ్వు ఇక్కడే పడుకోవాలి అంటూ వార్నింగ్ ఇస్తుంటే.. మీరు చెప్పారు కదా నేను చూసుకుంటాను మీరు వెళ్లండి అంటాడు శేషు. అపర్ణ వెళ్లిపోతుంది. రాజు కోపంగా శేషును తిడతాడు.
తర్వాత సుభాష్ వాళ్ల అమ్మానాన్నల ఫోటో ఫ్రేమ్ తయారు చేయిస్తాడు. షాప్ అతను ఫోటో ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ ఫోటో చూసి సుభాష్ ఎమోషనల్ అవుతాడు. మా అమ్మ. మా నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంతా గమనించిన రేఖ ఫోటో బాగానే ఉంది కానీ అది ఎక్కడ పెడతావు అని అడుగుతుంది. అందుకు సుభాష్ ఇందు, రాజులను మీరు ఎక్కడ పెట్టాలో చెప్పండి అక్కడే పెడదాం అని అడిగితే.. రేఖ స్టోర్ రూంలో పెడితే సేఫ్‌గా ఉంటుంది అంటుంది. అందుకు రాజు అక్కడ ఉన్న మీ అమ్మ ఫోటో, మీ అన్నయ్య ఫోటో తీసుకెళ్లి స్టోర్ రూంలో సేఫ్‌గా పెట్టుకో లేకపోతే డంపింగ్ యార్డ్‌కు పంపించాల్సి వస్తుంది అంటూ రాజు చెప్తాడు. రాజు మాటలకు రేఖ, ఐశ్వర్య షాక్ అవుతారు. రేఖ కోపంగా రాజును తిడితే రాజు కూడా రేఖకు వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్ అయిపోతుంది.