Diwali Train Delay: పండగ పూట కుటుంబంతో కలిసి హాయిగా ప్రయాణించాలనుకున్న ఓ కంపెనీ సీఈఓకు భారతీయ రైల్వే చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీపావళి పండుగను జరుపుకోవడానికి ఇండోర్ నుండి లక్నోకు చేపట్టిన రైలు ప్రయాణం 8 గంటలు ఆలస్యం కావడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇలాంటి ఆలస్యాల మధ్య ఇండియన్ రైల్వేస్ విమానయాన సంస్థలతో ఎలా పోటీ పడుతుందో అర్థం కావడం లేదంటూ సదరు సీఈఓ ప్రశ్నించారు.
వైభవ్ జైన్ అనే సీఈఓ తొలుత విమానంలో పండక్కి వెళ్లాలని భావించాడు. అయితే పండుగ సీజన్ కావడం, విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రత్యామ్నాయంగా తన కుటుంబం కోసం మహాతాల్ ఎక్స్‌ప్రెస్ (20414) లో టికెట్లు బుక్ చేసుకున్నారు. తమ రెండేళ్ల కుమార్తెకు ఈ రైలు ప్రయాణం మరింత సరాదాగా మారుతుందని వైభవ్ జైన్ భావించారు. అయితే అనుకున్నదానికంటే ఎక్కువ సమయం ప్రయాణంలోనే గడపాల్సి రావడంతో జైన్ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.
తనకు ఎదురైన పరిస్థితిని జైన్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. 14 గంటల్లో పూర్తికావాల్సిన ప్రయాణం.. రైలు దాదాపు 7.5 గంటల ఆలస్యంగా నడవడంతో మరింత సుదీర్ఘంగా మారిందని ఆయన తెలిపారు. విమాన ప్రయాణాలకు ప్రత్యామ్నాయంగా ప్రయాణికులు రైలును ఎంచుకోవాలనుకున్నప్పుడు.. వేళాపాళా లేని షెడ్యూళ్లతో రైల్వే శాఖ ఎలా ఆకట్టుకోగలదని ఆయన నిలదీశారు. విమాన చార్జీలను తట్టుకోలేక రైలును ఎంచుకుంటే 8 గంటల ఆలస్యం కావడం తీవ్ర నిరాశకు గురిచేసిందని వాపోయారు. సూపర్ ఫాస్ట్ సేవలు కోరుకునే ఈ రోజుల్లో ఇలాంటి జాప్యాలను అంగీకరించడం కష్టమని పేర్కొన్నారు.
This #Diwali we opted to travel to our home #Lucknow from #indore by train.
Of course, one reason being flights being super expensive.
So we booked our tickets by Mahakal Express (20414).
We had an alternative to drive by car, but thought it would be a good experience for our 2 year old daughter also to travel by train.
But this is already running 7.5 hours late. And we are yet to reach our destination.
In today’s world, 8 hours delay is huge. Total journey time 14 hours and train late 8 hours.
How is Indian #Railways thinking to compete with airlines? Complete management
Regretting the decision now.
@RailMinIndia
— Vaibhav Jain, CFA, CMT (@vaibhavjain_vj) November 7, 2026
జైన్ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. మహాతాల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభ స్టేషన్ నుంచే దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని ఆ తర్వాత ప్రయాణంలో అయిన ఆలస్యం కేవలం 2.5 గంటలు మాత్రమేనని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరొక యూజర్ వ్యంగ్యంగా స్పందిస్తూ.. తరచూ 10 గంటలకు పైగా ఆలస్యంగా నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి చూడాలని సెటైర్లు వేశారు. మరొక నెటిజన్.. రైల్వే పనితీరును, జవాబుదారీతనం లేకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు.
Also Read: కాలేజీ చదువుతో పాటు బిజినెస్.. కేవలం 50 రోజుల్లో రూ.15 లక్షలు సంపాదించిన స్టూడెంట్.. ఎలాగంటే
వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ.. సాధారణ రైళ్లను సమయానికి నడపడంపై రైల్వే శాఖ శ్రద్ధ చూపడం లేదని పలువురు నెటిజన్లు ఆరోపించారు. ప్రాథమిక సమస్యలను, ఆలస్యాలను పరిష్కరించకుండా కేవలం కొత్త రైళ్లను తీసుకురావడం వల్ల ప్రయాణికుల అనుభవంలో మార్పు వస్తుందా? అని ప్రశ్నించారు. పండుగల సమయంలో రైళ్లను ఎంచుకోవడంతో అదో పెద్ద సాహసంగా మారుతోందని పలువురు పేర్కొంటున్నారు. సమయానికి చేరుకుంటామో లేదో తెలియని అనిశ్చితిలోకి చాలా మంది ప్రయాణికులు వెళ్తున్నారని విమర్శించారు. తెచ్చింది.
Also Read: ఇంటికి చుట్టాలొస్తే మష్రూమ్ గలౌటీ కబాబ్ చేసి పెట్టండి.. టేస్ట్ అదిరిపోయిందని మెచ్చుకుంటారు!