Intinti Ramayanam Today Episode November 8th : ఇక అందరూ పూజకు కూర్చోవాలి అని చెప్పగానే ఒక్కొక్కరు జంటలుగా పూజకు కూర్చోడానికి కిందికి వస్తారు ఆ వాళ్ళందరిని చూసిన పార్వతీ చాలా సంతోషంగా ఉంటుంది. జంటలుగా పీటల మీద కూర్చుంటారు. అయితే ఈ క్రమంలో పల్లవి కూడా ఆలా కూర్చోవడంతో బాగుంటుంది అని భానుమతి అనుకుంటుంది.. ఇక పల్లవి నీ రెచ్చగొట్టి కమల్ పక్కన కూర్చోమని చెప్తుంది భానుమతి. కానీ పల్లవి కూర్చోగానే కమల్ ఒక్కసారగా లేచిపోతాడు బావ ఎందుకు బావ నువ్వు లేస్తున్నావు కూర్చో బావా అని పల్లవి ఎంతగా బ్రతిమలాడినా సరే అసలు వినడు. నువ్వు ఎప్పుడో చచ్చిపోయావని గంగలో కలిపేసాను నా పక్కన కూర్చున్నా కూడా నువ్వు ఎవరో పరాయి ఆడదానివి అవుతావు అని అంటాడు.. ఇక భరత్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ పార్వతి బ్రతిమలాడే మళ్లీ తీసుకుని వస్తుంది..
ఇక పంతులుగారు పూజ చేసి మంత్రాలు చదివి మొత్తాన్ని పూజను విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే పూర్తయిన తర్వాత పానకంలో ఇక్కడ పూజ చేసిన పసుపు కుంకుమ ని వేసి పానకం ని మీరు సేవిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది అని పంతులుగారు చెప్పగానే అలానే అని అంటారు. ఇక పల్లవి మాత్రం వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏదో ఒకటి చేసి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలి అని అనుకుంటుంది.. అయితే ఆ పానకంలో ఏదో ఒకటి కలిపి వీళ్ళందరికీ ఏదో ఒకటి జరిగేలా చేయాలి అని ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి. పల్లవి ఏదో ఒక ప్లాన్ తో వచ్చింది అని అటు అవినీతి కంగారు పడిపోతూ ఉంటుంది.
ఇక రమ్య పెద్దింటి వాళ్ళు కాబట్టి మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి అని అవని వాళ్ళ ఇంటికి వెళ్లి ఎందుకు రెడీ అవుతూ ఉంటుంది. అయితే మంచి డ్రెస్ వేసుకొని వెళ్లాలని వెతుకుతూ మొత్తానికి డ్రెస్ వేసుకొని బయటికి వస్తూ ఉండగా వాళ్ళ అన్నయ్య సడన్గా ఎంట్రీ ఇస్తాడు. నువ్వు కూడా నన్ను వదిలేసి లేచిపోతున్నావా ఎవరితో వెళ్తున్నావు అని అవమానించేలా మాట్లాడుతాడు. నేను ఎప్పటికీ ఎవరిని ప్రేమించిన అన్నయ్య నువ్వు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మంచిది అని రమ్య అంటుంది. అయితే పండగే కాబట్టి ప్రసాదం చేశాను అని రమ్య ఎంత చెప్తున్నా సరే వాళ్ళ అన్నయ్య మాత్రం మందులోకి ఎవరైనా మంచి కారంగా తినాలనుకుంటాడు ఇలా తీయగా పాయసం చేయాలనుకుంటాడా అని దాని విసిరి కొట్టేస్తాడు సరే అన్నయ్య నీకోసం నేను ఏదైనా తీసుకొని వస్తానులే అని అంటుంది ఇక మొత్తానికి అబద్దం చెప్పి గుడికి అని అవని వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు రెడీ అవుతుంది.
ఇక అవని వాళ్ళు మొత్తానికి పూజలు పూర్తి చేస్తారు. ఇక పంతులుగారు కూడా పూజ పూర్తయిపోయిందమ్మ మీరు పానకంలో పసుపు కుంకుమలు కలిపి తాగితే చాలా మంచిది. మంచి శుభాలు జరుగుతాయని చెప్పగానే.. పల్లవి వీళ్ళకి శుభాలు కాదు నేను ఉన్నంతవరకు ఆశుభాలు ఎదురవుతాయి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రమ్య అవని అక్క అంటూ లోపలికి రావడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవరి అమ్మాయి ఎందుకు అవని అక్క అని పిలుస్తుంది అని ఆలోచిస్తూ వస్తుంది. రమ్య రాగానే కమల్ చాలా సంతోషంగా తన రిసీవ్ చేసుకోవడం చూసిన పల్లవి చాలా కోపంగా ఉంటుంది. ఎవరి అమ్మాయి ఈ తింగరోడు అమ్మాయికి ఎదురుగా వెళ్లి తీసుకొని వస్తున్నాడేంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. పనికిరాదని పులిహోర పెట్టి సంతోషంగా ఉండడం చూసిన పల్లవి వీళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అనుమానిస్తుంది.
ఇకపోతే రమ్య ఒక సైడ్ నిల్చుని చూస్తూ ఉంటుంది. అయితే అందరూ కూడా అమ్మవారికి పూజలు చేసిన తర్వాత భజన చేస్తూ పాటలకే డాన్సులు వేస్తూ ఉంటారు అప్పుడే రమ్యను కూడా డాన్స్ వేయమని చెప్పగానే తను కూడా చాలా సందడిగా వెళుతూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో కమల్ తో కలిసి రమ్య డాన్స్ చేస్తూ ఉండగా కమల్ కి తగులుతుంది దాంతో రమ్య తనని ఏమైందో ఏంటో అని కంగారు పడిపోతూ అడుగుతుంది అది చూసిన పల్లవి కోపంతో రగిలిపోవడంతో పాటుగా రమ్య దగ్గరకు వచ్చి రమ్య చెంపలు వాయించేస్తుంది. అది చూసే నా ఫ్రెండ్ ఎందుకు నువ్వు నా ఫ్రెండ్ ని కొట్టావు అని అడుగుతాడు. పల్లవి ప్రవర్తన చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..