E-Paper
Advertisement

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?
Advertisement

Mandaadi Movie Review: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుహాస్.. ఇప్పుడు ఏకంగా తమిళ నాట పవర్‌ఫుల్ విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘మండాడి’ (Mandaadi). కోలీవుడ్ స్టార్ కమెడియన్ సూరి (Soori)హీరోగా, సుహాస్ (Suhas) మెయిన్ విలన్‌గా, దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ఇది. సముద్రంలో పడవ పందెల నేపథ్యంతో భారీ అంచనాల మధ్య నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం!

మండాడి మూవీ కథ..

కళింగపట్నం సముద్ర తీర ప్రాంతంలో పడవ పందెలకు చాలా క్రేజ్ ఉంటుంది. ఆ ఊరిని, అక్కడి పందెలను సట్టపులి (సుహాస్) శాసిస్తుంటాడు. తన ‘సునామి రైడర్స్’ టీమ్‌తో గత 20 ఏళ్లుగా ప్రతి పందెంలోనూ ఎదురులేకుండా గెలుస్తుంటాడు. తన కొడుక్కి కెప్టెన్సీ ఇవ్వాలని సట్టపులి నిర్ణయించుకున్న సమయంలో.. మారి (మిథున్) అనే కుర్రాడు ఆ కొడుకును చంపడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. ప్రాణ భయంతో హైదరాబాద్ పారిపోయి, అక్కడ ఒక వాటర్ పార్క్‌లో పనిచేస్తున్న ముత్తుకాళి (సూరి) దగ్గర ఆశ్రయం పొందుతాడు.

Advertisement

అసలు విషయానికొస్తే.. మారి మరెవరో కాదు, ఒకప్పుడు ముత్తుకాళి ప్రాణంగా ప్రేమించిన ఏంజిల్ (మహిమా నంబియార్) కొడుకు. ఒకప్పటి ప్రాణ స్నేహితులైన ముత్తుకాళి, సట్టపులి బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? ముత్తుకాళికి గతంలో జరిగిన అన్యాయం ఏంటి? 20 ఏళ్లుగా పడవలకు దూరంగా ఉంటున్న ముత్తుకాళి మళ్లీ సముద్రంలోకి ఎందుకు దిగాడు? పడవ పందెంలో సట్టపులిని ఎలా ఓడించాడు? అనేది మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే?..

ఇప్పటి వరకు మనకు గ్రౌండ్‌లో ఆడే ఆటల మీదే స్పోర్ట్స్ డ్రామాలు ఎక్కువగా వచ్చాయి. కానీ, సముద్రం మధ్యలో ప్రాణాలకు తెగించి ఆడే ‘బోట్ రేసింగ్’ నేపథ్యాన్ని దర్శకుడు ఎంచుకోవడం ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్. ఫస్ట్ హాఫ్ అంతా పడవ పందెల చుట్టూ, హీరో-విలన్ల మధ్య వైరాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోతుంది.

Advertisement

కానీ, సెకండాఫ్‌కి వచ్చే సరికి సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా నెమ్మదిస్తుంది. స్నేహితులు శత్రువులుగా మారే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా రొటీన్‌గా అనిపిస్తుంది. పాత్రల మధ్య ఎమోషన్ ప్రేక్షకుడికి బలంగా కనెక్ట్ అవ్వదు. కథనంలో వేగం తగ్గడం, తర్వాత ఏం జరగబోతుందో ముందే ఊహించేలా సీన్స్ ఉండటం మైనస్. క్లైమాక్స్‌లో సముద్రం మధ్య చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ విజువల్‌గా అద్భుతంగా ఉన్నప్పటికీ.. బలమైన భావోద్వేగాలు లోపించడంతో సగటు ప్రేక్షకుడికి కొంత అసంతృప్తి మిగులుతుంది.

ALSO READ:అప్పుడే ఏడాది..క్యూట్ పిక్ తో కొడుకుకి స్పెషల్ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్ !

నటీనటుల పర్ఫార్మెన్స్..

సూరి తన కమెడియన్ ఇమేజ్ నుంచి పూర్తిగా బయటికొచ్చి ఒక ఇంటెన్స్ యాక్షన్ రోల్‌లో జీవించేశాడు. ముఖ్యంగా సముద్రం మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్‌లో ఆయన పడిన కష్టం తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సుహాస్ విషయానికొస్తే.. విలన్‌గా వంద శాతం న్యాయం చేశాడు. సట్టపులి పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, క్రూరత్వం సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ఏంజిల్ పాత్రలో మహిమా నంబియార్ మెప్పించగా, సీనియర్ నటుడు సత్యరాజ్ ఉన్నంతలో తనదైన ముద్ర వేశారు. రవీంద్ర విజయ్, మిథున్ తమ పాత్రల పరిధి మేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు..

సాంకేతికంగా మండాడి టాప్ నాచ్‌లో ఉంటుంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సినిమాకి వెన్నెముక. పడవ పందెల సీన్లలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఎస్.ఆర్.కథిర్ సినిమాటోగ్రఫీ మైండ్ బ్లోయింగ్. ఎలాంటి వీఎఫ్ఎక్స్ లేకుండా సముద్రంలో యాక్షన్‌ను రియలిస్టిక్‌గా క్యాప్చర్ చేసిన తీరు అద్భుతం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు గ్రాండ్‌గా ఉన్నాయి. దర్శకుడు మతిమారన్ పాయింట్ బాగున్నా.. సెకండాఫ్ రైటింగ్‌లో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే రిజల్ట్ వేరే లెవెల్‌లో ఉండేది.

మండాడి మూవీ ప్లస్ పాయింట్స్:

సరికొత్త బోట్ రేసింగ్ నేపథ్యం
సూరి, సుహాస్‌ల పోటాపోటీ నటన
జీవీ ప్రకాష్ సూపర్బ్ బీజీఎమ్ & సముద్రపు విజువల్స్

మండాడి మూవీ మైనస్ పాయింట్స్:

నెమ్మదించిన సెకండాఫ్ స్క్రీన్ ప్లే
రొటీన్‌గా అనిపించే ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ
ఎమోషనల్ డెప్త్ మిస్ అవ్వడం

చివరి మాటగా..

కథ పాతదే అయినా.. సముద్రంలో ఉత్కంఠభరితమైన బోట్ రేసింగ్ విజువల్స్, సుహాస్ విలనిజం, సూరి యాక్షన్ కోసం ‘మండాడి’ చిత్రాన్ని థియేటర్లలో ఓసారి ట్రై చేయొచ్చు!

Mandaadi Movie Rating: 2.75 / 5

Related News

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

‘మారెమ్మ’ మూవీ రివ్యూ: మాస్ మహారాజా తమ్ముడి కొడుకు మెప్పించాడా ?

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

రంభ ఊర్వశి మేనక మూవీ రివ్యూ.. పాత జోనర్ నే నమ్ముకున్న అల్లరి నరేష్ కి కలిసొచ్చిందా?

బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ మూవీ రివ్యూ.. ‘ప్రేమలు’ మూవీ లాంటి సక్సెస్ లభిస్తుందా?

‘ఐయామ్ గేమ్’ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

Advertisement
×