E-Paper
Advertisement

‘ బైకర్ ‘ ట్విట్టర్ రివ్యూ.. శర్వా హిట్ కొట్టాడా..?

‘ బైకర్ ‘ ట్విట్టర్ రివ్యూ.. శర్వా హిట్ కొట్టాడా..?
Advertisement

Biker Twitter Review: టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కు గత కొన్ని రోజులుగా తన ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈయన రీసెంట్ గా నారి నారి నడుమ మురారి మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటుగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని కూడా సొంతం చేస్తుంది. ఈ ఏడాదిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా.. ప్రస్తుతం ఈయన నటించిన బైకర్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆ షోల ప్రకారం సినిమా టాక్ ఎలా ఉంది అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

బైకర్ మూవీ హీరోకు స్పెషల్ అన్న విషయం తెలిసిందే.. బైక్ రేసింగ్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు.. ఇందులో యాంగ్రీ మెన్ రాజశేఖర్, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్ రెడ్డి, వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా బైకర్ చిత్రాన్ని నిర్మించారు.. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో బైకర్ మూవీపై హైప్ నెలకొంది. ఏప్రిల్ 3న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇవాళ మూవీకి సంబంధించిన ప్రీ షోలు పడ్డాయి. మరి ఈ షోను చూసిన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది.. మూవి పై నెటిజన్లు ఇచ్చిన ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

Advertisement

శర్వా మూవీ బైకర్చాలా బాగుంది.. ఈ సినిమాలో అతని పర్ఫామెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా సినిమాలోని ఫస్ట్ రేస్ అయితే అసలు చెప్పనక్కర్లేదు అంత బాగా ఉంది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత రాజశేఖర్ ఈ సినిమాతో మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.. ఈ సినిమాలోని ప్రీటీ బేబీ సాంగ్ చాలా కొత్తగా బాగుంది. అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.

Advertisement

శర్వానంద్ బైకర్ మూవీ చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో వచ్చే బైక్ రేస్ అందరినీ ఆకట్టుకుంటుంది. రాజశేఖర్ నటన జనాలని బాగా ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చిన ఆయన మరోసారి జనాలను కట్టిపడేసాడు. ఈ సినిమాని బైక్ లవర్స్ చూసేయొచ్చు అని ఓ నెటిజను ట్వీట్ చేశారు..

ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం కామన్.. అంతర్జాతీయ స్థాయి మోటోక్రాస్ ఫిల్మ్‌ని చూసినట్లు ఉంది. స్టంట్ సీక్వెన్స్‌లు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతి సీన్ కూడా ప్రేక్షకులకు ఉత్కంఠ గానే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా శర్వా పర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయింది అని నెటిజను ట్వీట్ చేశారు..

టాలీవుడ్ లో ఇప్పటివరకు ఇలాంటి స్టోరీ సినిమాను ఎవరు నిర్మించలేదు. ఇలాంటి కల్ట్ మూవీని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు.. సినిమా మాత్రం అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

బైకర్ మూవీ ఫస్ట్ హాఫ్ స్మాసింగ్.. స్టంట్ సీక్వెన్స్, ఎమోషన్స్, పెర్ఫార్మన్స్, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ అంతా చాలా చక్కగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే శర్వా వన్ మ్యాన్ షో అని ట్వీట్ చేశారు.

మొదటి షో తో ఈ సినిమాకు పాజిటివ్టాక్ దక్కింది.. నిజానికి ఈ మూవీ కోసం శర్వానంద్ భారీగా బరువు తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెటిజన్ల నుంచి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే అతని కష్టం వృధాగా పోలేదని తెలుస్తుంది.. ఇందులోని బైక్ స్టంట్ రేసింగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటివరకు చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి కలెక్షన్లు ఏ మాత్రం వసూల్ అవుతాయో చూడాలి..

Related News

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

హుషారు పిట్టలు మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Big Stories

Advertisement
×