E-Paper
Advertisement

Nari Nari Naduma Murari Review : నారీ నారీ నడుమ మురారి రివ్యూ

Nari Nari Naduma Murari Review : నారీ నారీ నడుమ మురారి రివ్యూ
Advertisement

Nari Nari Naduma Murari Movie Review : ఈ 2026 సంక్రాంతి బరిలో ఉన్న చిట్టచివరి మూవీ ఈ నారీ నారీ నడుమ మురారి. హీరో శర్వానంద్ పెద్దగా ప్రమోషన్స్ ఏం చేయలేదు. అయినా.. ఈ సినిమాపై ఎందుకో అందరికీ హోప్స్ క్రియేట్ అయ్యాయి. ట్రైలర్ కట్ కూడా బాగుంది. మరి ఈ సినిమా అందరి హోప్స్‌‌ని నిలబెట్టిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

కార్తిక్ (నరేష్) అనే సింగిల్ ఫాదర్‌కి ఒక్కడే అబ్బాయి గౌతమ్ (శర్వానంద్). కార్తిక్ రెండో పెళ్లికి హెల్ప్ చేస్తూనే తన లవ్‌ను నిత్య (సాక్షి వైద్య)తో సెట్ చేసుకుంటాడు. అయితే.. గౌతమ్‌కు ముందే దియా (సంయుక్త)తో పెళ్లి అవుతుంది. ఆ విషయాన్ని నిత్య దగ్గర దాచిపెడుతాడు. నిత్యతో పెళ్లి జరగాలి అంటే… దియాతో విడాకులు జరగాలి. నిత్యకు దియా గురించి తెలియకుండా గౌతమ్ ఎలా మేనేజ్ చేశాడు. దియాతో విడాకులు తీసుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది సినిమాలో చూపించారు.

విశ్లేషణ :

Advertisement

సామజవరగమన ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైరెక్టర్ అబ్బరాజు ఈ సినిమా చేశాడు. మరి.. సామజవరగమన కంటే ఎక్కువ మార్కులు ఈ నారీ నారీ నడుమ మురారికి పడ్డాయా అంటే.. ఎలాంటి ఆలోచన లేకుండా సింగిల్ వర్డ్‌లో పూర్తి స్థాయిలో పడ్డాయనే చెప్పొచ్చు. సామజవరగమన మూవీకి ఎంతలా నవ్వుకున్నారో… అంతకు మించి ఈ సినిమాకు నవ్వుకుంటారు. అంతలా కామెడీ పండించాడు డైరెక్టర్.

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే.. ముందు డైరెక్టర్ రాసిన కామెడీ డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి.

Advertisement

“నిన్ను రాజులా పెంచాను రా… నువ్వు వెళ్లి రోజా దగ్గర కూర్చుంటావు అని అనుకోలేదు రా…”

“నాకు బి*ట్లు తప్పా బిట్ కాయిన్స్ గురించి తెలీదు.”

“గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి భయం వదిలేయండి అంటే మా ఫ్రెండ్ చున్నీని వదిలేసింది.”

ఇలాంటి డైలాగ్స్ సినిమాలో కోకొల్లలు. అవి కూడా సరైన సందర్భంలో.. సరైన టైంలో ఉండేలా చూసుకున్నాడు డైరెక్టర్ అబ్బరాజు. అదే సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఇంకో విషయం గురించి చెప్పాలి… సినిమా అంటే.. కథ మాత్రమే కాదు. సరైన నటీనటులు కూడా ఉండాలి. ఈ విషయంలో డైరెక్టర్ అబ్బరాజుకు తప్పకుండా వందకు వంద మార్కులు వేయాల్సిందే. సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్, నరేష్, సునీల్.. ఇలా అందరినీ వాడుకున్నవరకు గట్టిగా వాడుకున్నాడు.

సందర్భం లేకుండా సత్య వచ్చి నవ్విస్తాడు.
నాన్ సింక్ లో వెన్నెల కిషోర్ వచ్చి నవ్విస్తాడు.
సీరియస్ టైంలో వచ్చి సునీల్ నవ్విస్తాడు.
హీరో పక్కనే ఉండి ఎప్పుడు పడితే అప్పుడు సుదర్శన్ నవ్విస్తాడు.
ఇక నవ్వించడానికే ఉన్నట్టు ఉంటుంది సీనియర్ యాక్టర్ నరేష్ పాత్ర.

ఇక కథ అంటారా… ఇంత కామెడీ పెట్టిన తర్వాత ఆ కథ గురించి, కథనం గురించి, లాజిక్స్ గురించి అక్కర్లేదు. కామెడీనే మ్యాజిక్ చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఇక్కడ నారీ నారీ నడుమ మురారిలో కూడా అదే జరిగింది. ఫస్టాఫ్ అలా కామెడీతో సాగినా.. కొంత మధ్యలో ల్యాగ్ సీన్స్ అనిపించినా… ఇంటర్వెల్ తో సెట్ అయింది.

ఇంటర్వెల్ తర్వాత డైరెక్టర్ ఎక్కడా తగ్గలేదు. సినిమాలో కనిపించే పాత్రలు ఎక్కడా తగ్గలేదు. నాన్ స్టాప్ కామెడీ సీన్స్… థియేటర్ లో ఉన్న ఆడియన్స్ నుంచి నాన్ స్టాప్ నవ్వులు. లాస్ట్ లో ఎమోషనల్ టచ్ కూడా బానే సెట్ చేశాడు. మొత్తంగా సంక్రాంతికి సరైన సినిమా అనేలా ఉందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి బానే కనెక్ట్ అవుతుంది.

సినిమా చూసి కొన్ని రోజుల క్రితం 12 నిమిషాలు కట్ చేశారట. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మూవీ టీం అండ్ ఎడిటింగ్ టీం ఎంత పక్కాగా ఉన్నారో అర్థమవుతుంది.

హీరో శర్వానంద్ తన ఈజ్‌తో నటించాడు. హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త కూడా బానే చేశారు. మిగితా పాత్రల గురించి పైన ఇప్పటికే చెప్పుకున్నాం..

ప్లస్ పాయింట్స్ :

కామెడీ డైలాగ్స్.
హీరో శర్వానంద్.
నరేష్, సత్య, వెన్నల కిషోర్, సుదర్శన్, సునీల్.
సెకండాఫ్ మొత్తం.

మైనస్ పాయింట్స్ :

బ్రేకప్ సాంగ్

మొత్తంగా… “సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే ‘మురారి’ సందడి.”

Nari Nari Naduma Murari Rating – 3 / 5

Related News

వెంకట్రామయ్యగారి తాలూకా రివ్యూ.. మురళీధర్ గౌడ్ మెప్పించారా?

ఓ సుకుమారి రివ్యూ.. ఐశ్వర్య రాజేష్ సుకుమారిగా మెప్పించిందా.. ప్రేక్షకుడికి అసలైన కరెంట్ షాక్!

The Odyssey Review: ‘ది ఒడిస్సీ’ రివ్యూ. థియేటర్లు బద్దలు.. ప్రపంచాన్నే ఊపేస్తోన్న నోలన్ మూవీ!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

I-Nobody Review :’ఐ నోబడీ’ మూవీ రివ్యూ..

రావు బహదూర్ రివ్యూ.. గెటప్ మార్చిన సత్యదేవ్ సక్సెస్ అయ్యారా?

బేబీ హీరో ‘ గుర్తుకొస్తున్నాయ్ ‘వెబ్ సిరీస్ రివ్యూ.. ఆ రేంజ్ సక్సెస్ లభించిందా?

Nagabandham Review: ‘నాగబంధం’ రివ్యూ.. గ్రాఫిక్స్ గిన్నెలో ఉడకని పప్పు !

Big Stories

Advertisement
×