E-Paper
Advertisement

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
Advertisement

Mahendragiri varahi Movie Review:అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ (Sumanth) గ్యాప్ తర్వాత మళ్లీ స్పీడ్ పెంచాడు. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సుమంత్, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), సిద్ధు జొన్నలగడ్డ (అతిథి పాత్ర) నటించిన తాజా మిస్టికల్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’.. ‘మురారి’ తరహాలో తెరకెక్కిన ఈ దేవుడి శాపం కాన్సెప్ట్ ఆడియన్స్‌ను భయపెట్టిందా? లేక బోర్ కొట్టించిందా? సుమంత్ కి ఈ సారైనా సాలిడ్ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం!

మహేంద్రగిరి వారాహి సినిమా స్టోరీ..

సినిమా కథలోకి వెళితే.. 200 ఏళ్ల శాపం.. 33 ఏళ్లకే మరణం..మహేంద్రగిరి రాజవంశాన్ని గత 200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం పట్టి పీడిస్తుంటుంది. ఆ వంశంలో పుట్టిన ప్రతి మగవాడికి 33 ఏళ్లు రాగానే.. అమ్మవారే స్వయంగా వచ్చి ప్రాణాలు తీస్తుంటుంది. గతంలో మహేంద్రవర్మ అనే రాజు గుడిలో ఓ అమ్మాయిపై చేసిన అఘాయిత్యమే ఈ శాపానికి కారణం. ఈ క్రమంలో ఈ శాపాన్ని ఎదిరించబోయిన రాజేంద్ర వర్మ (సిద్ధు జొన్నలగడ్డ) ప్రాణాలు కోల్పోతాడు. ఇక కట్ చేస్తే.. దొంగ బాబాల బండారం బయటపెట్టే యూట్యూబర్ సిద్ధార్థ్ (సుమంత్). తన అన్నయ్య (కమల్ కామరాజు) వారాహి గుడిలో దున్నపోతు దాడిలో చనిపోతాడు. అసలు తన అన్నయ్య మరణానికి, మహేంద్రగిరి శాపానికి లింక్ ఏంటి? ఇదంతా నిజంగానే దేవుడి మహిమా లేక మనుషుల కుట్రా? అనేది మిగతా కథ.

సినిమా విశ్లేషణ :

Advertisement

పాయింట్ ఓకే.. కానీ స్క్రీన్ ప్లే లోనే తేడా కొట్టేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ ‘మురారి’ తరహా కథాంశంతోనే డైరెక్టర్ సంతోష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. శాపం, మరణాలు అనే పాయింట్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నా.. దాన్ని తెరపై అంతే ఉత్కంఠగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు.

నటీనటుల పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

సుమంత్ తన పాత్ర పరిధి మేర బాగానే చేశాడు. మూఢ నమ్మకాలను ఛేదించే యూట్యూబర్ గా డీసెంట్ గా నటించాడు. ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అతిథి పాత్రలో మెరిసిన సిద్ధు జొన్నలగడ్డ తన మార్క్ చూపించాడు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు తమ పరిధి మేర నటించారు. సాంకేతికంగా అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం, ఆర్కే ప్రతాప్ కెమెరా వర్క్ ఓకే అనిపిస్తాయి.

Advertisement

also read:నడవలేని స్థితిలో టాలీవుడ్ లేడీ కమెడియన్.. వీడియో వైరల్!

మహేంద్రగిరి వారాహి మూవీ ప్లస్ పాయింట్స్ :

సినిమా ప్రారంభంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ క్యూరియాసిటీ పెంచుతుంది. వారాహి టెంపుల్ కు సంబంధించిన సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ పర్వాలేదనిపిస్తాయి. సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ అప్పియరెన్స్ సినిమాకు కాస్త బూస్ట్ ఇచ్చింది.

మహేంద్రగిరి వారాహి మూవీ మైనస్ పాయింట్స్ :

కథ వర్తమానంలోకి రాగానే అసలు ఎమోషన్ పూర్తిగా మిస్ అయింది. లాజిక్స్ గాలికి వదిలేయడం, సుమంత్ యూట్యూబ్ ఛానెల్ సీన్స్ రొటీన్ గా, చాలా స్లోగా సాగడం సినిమాకు పెద్ద మైనస్. థ్రిల్లర్ కు కావాల్సిన ‘వావ్’ ఫ్యాక్టర్స్ లేకపోవడం ఆడియన్స్ ను నిరాశపరుస్తుంది. సెకండాఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా నత్తనడకన సాగుతుంది.

చివరి మాటగా :

‘మహేంద్రగిరి వారాహి’.. పేపర్ మీద స్ట్రాంగ్ గా ఉన్నా, తెరమీద ప్రెజెంట్ చేయడంలో తేలిపోయింది. మీరు ‘మురారి’, ‘విరూపాక్ష’ తరహా మిస్టికల్ థ్రిల్లర్స్ ను బాగా ఇష్టపడే వారైతే.. ఎలాంటి అంచనాలు లేకుండా ఒకసారి ట్రై చేయొచ్చు!

Mahendragiri varahi Movie Rating : 2/5

Related News

టైటిల్ మాత్రమే ‘ఎపిక్’.. సెకండ్ హాఫ్ అంతా ‘ట్రాఫిక్’!

ఎపిక్ ట్విట్టర్ రివ్యూ… బేబీ జంట హిట్ కొట్టారా?

‘సర్దార్ 2’ మూవీ రివ్యూ: ఇలా చేశావేంటి కార్తి?

సుహాస్ – సూరి మండాడి మూవీ రివ్యూ.. పోరులో నెగ్గిందెవరు?

‘మారెమ్మ’ మూవీ రివ్యూ: మాస్ మహారాజా తమ్ముడి కొడుకు మెప్పించాడా ?

సహా రివ్యూ: గుండు ఛాలెంజ్‌తో వైరల్.. థియేటర్‌లో మాత్రం..

మీర్జాపూర్ మూవీ రివ్యూ.. గద్దె కోసం గ్యాంగ్ వార్.. ఎవరు గెలిచారంటే?

Big Stories

Advertisement
×