నటీనటులు: శ్రావణ్ (రావణ బ్రహ్మ), మలైకా వాసుపల్, అనుష్కా లుహార్, బ్రహ్మాజీ, ఇంద్రజ, ప్రభావతి తదితరులు
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం – మంగా శ్రీనివాస్; సంగీతం – ప్రిన్స్ హెన్రీ; నిర్మాత – డా. హేమారావు చినతాడ
విడుదల తేదీ: అక్టోబర్ 9, 2026
Chakora Movie Review : తెలుగులో కొత్త సినిమాలకు కొదవలేదు.. ఇటీవల కాలంలో చిన్న స్టోరీతో వచ్చిన సినిమాలు బాక్సాఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి డిఫరెంట్ స్టోరీతో వచ్చిన సినిమానే చకోర.. ఇవాళ భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంది అన్నది కాస్త వివరంగా రివ్యూలో ఒకసారి చూసేద్దాం..
చకోర పక్షి నమ్మకం మరియు స్వభావం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రావణ బ్రహ్మ పాత్రధారి శ్రావణ్ ఒక కేర్‌ఫ్రీ యువకుడిగా కనిపిస్తాడు. తొలి చూపులోనే జూలీ (మలైకా వాసుపల్) పట్ల ఆకర్షితుడై ఆమెను మనసారా ఇష్టపడతాడు. అయితే ఊహించని మలుపు తిరుగుతూ జూలీ సడెన్‌గా అదృశ్యమవుతుంది. ఆ యువతి ఆచూకీ రాబట్టడానికి, ఆమె గతం వెనుక దాగిన రహస్యాలను బయటపెట్టడానికి హీరో సాగించే అన్వేషణే ఈ చిత్ర కథాంశం.. హీరో చుట్టు తిరిగే ఒక మొత్తం స్టోరీ.. హీరో ఎమోషనల్ ఎపిసోడ్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. ప్రతి సీన్ జనాలను కట్టిపడేసేలా కనిపిస్తుంది.
దిగ్దర్శకుడు పూరీ జగన్నాథ్ గారి వద్ద అసోసియేట్‌గా అనుభవం గడించిన మంగా శ్రీనివాస్ ఈ ప్రాజెక్ట్‌తో స్వతంత్ర దర్శకుడిగా పరిచయమయ్యారు. చకోర పక్షి చంద్రుడిపై తపించే లక్షణాన్ని పోలి ఉండేలా హీరోలోని గాఢమైన ప్రేమను తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. మొదటి భాగంలో రొమాంటిక్ ట్రాక్, విజువల్స్ ఆహ్లాదకరంగా సాగుతాయి. అయితే ద్వితీయార్థంలో స్క్రీన్‌ప్లే మరింత బిగువుగా ఉంటే ఫలితం మరింత బలంగా ఉండేది. తొలి ప్రయత్నం అయినప్పటికీ మేకింగ్ పరంగా దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నారు. అక్కడక్కడా కాస్త తడబడినట్లు తెలుస్తుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి. మొత్తానికి సినిమా డిఫరెంట్ స్టోరీ కావడంతో కాస్త ఆసక్తికరంగా ఉంటుంది.
శ్రావణ్ మరియు మలైకా వాసుపల్ మధ్య కుదిరిన అభినయం, కెమిస్ట్రీ
ప్రతి ఫ్రేమ్‌లోనూ రిచ్‌గా కనిపిస్తున్న సినిమాటోగ్రఫీ
ప్రిన్స్ హెన్రీ అందించిన ఆకట్టుకునే నేపథ్య సంగీతం
భిన్నమైన లవ్ అండ్ మిస్టరీ నేపథ్యాన్ని ఎంచుకోవడం
అక్కడక్కడా ఊహకందే సాధారణ కథనం
సెకండాఫ్‌లో వేగం
మరింతగా ఉంటే బాగుండేది
ప్రేమ, ఎమోషన్స్ మేళవింపుతో సాగే ఈ విభిన్నమైన ప్రయత్నం థియేటర్‌లో ఓ మోస్తరుగా అలరిస్తుంది. వీకెండ్‌లో ఒకసారి ప్రశాంతంగా ట్రై చేయవచ్చు.
Also Read :Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. మనోజ్ కు ఏమైంది..రోహిణికి సపోర్ట్ మనోజ్..