E-Paper
Advertisement

కేవలం 3.8 గ్రాముల బరువు, 50 గంటల బ్యాటరీ లైఫ్.. వివో కొత్త బడ్స్ భారత్‌లో లాంచ్!

కేవలం 3.8 గ్రాముల బరువు, 50 గంటల బ్యాటరీ లైఫ్.. వివో కొత్త బడ్స్ భారత్‌లో లాంచ్!
Advertisement

Vivo Buds: స్మార్ట్‌ఫోన్లతోనే కాకుండా ఇతర గ్యాడ్జెట్లతోనూ కస్టమర్లను అలరించేందుకు వివో మళ్లీ రంగంలోకి దిగింది. మొన్నటి వరకు కేవలం ఫోన్లకే పరిమితమైన ఈ ప్రముఖ సంస్థ.. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ‘వివో బడ్స్ ట్రూ వైర్‌లెస్’ ఇయర్‌ఫోన్లను భారత్‌లో లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునేవారి కోసం ప్రత్యేకంగా వీటిని తీర్చిదిద్దారు. కేవలం రూ.2,000 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ బడ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ కొత్త బడ్స్‌ చూడటానికి చాలా సింపుల్‌గా, ట్రెండీగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కో ఇయర్ బడ్ బరువు కేవలం 3.8 గ్రాములు మాత్రమే ఉండటం విశేషం. ఇవి చెవుల్లో పెట్టుకున్నట్టే అనిపించదు. అంత తేలికగా ఉంటాయి మరి. ఇక వీటి రంగుల విషయానికి వస్తే.. బసాల్ట్ బ్లాక్, నీలగిరి గ్రీన్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా.. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఇవి ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. అయితే ఈ వాటర్ రెసిస్టెన్స్ కేవలం ఇయర్ బడ్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఛార్జింగ్ కేసుకు కాదని గమనించాలి.

Advertisement

Also Read: iPhone Duoని పక్కన పెట్టేలా iPhone 18 Proలో ఉన్న 5 కీలక ఫీచర్లు ఇవే!

ఇందులో చెప్పుకోదగ్గ ప్రధానమైన ప్లస్ పాయింట్ వీటి బ్యాటరీ బ్యాకప్. ఈ బడ్స్ ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఏకంగా 50 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. కేవలం ఇయర్ బడ్స్ మాత్రమే సింగిల్ ఛార్జ్‌పై 12 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఇస్తాయట. ఒకవేళ అర్జెంట్‌గా బయటకు వెళ్లాల్సి వస్తే.. జస్ట్ 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 4 గంటల పాటు పాటలు వినవచ్చు. కాలింగ్ కోసం అయితే ఒకసారి ఛార్జ్ చేస్తే ఏడు గంటల పాటు మాట్లాడుకోవచ్చు.

Advertisement

ఇందులో 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. డీప్‌ఎక్స్ 4.0 సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా మెగా బాస్, క్లియర్ వాయిస్ వంటి మోడ్స్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల శబ్దం వినిపించకుండా ఉండేందుకు 4 మైక్రోఫోన్లతో కూడిన ఏఐ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని అందించారు. అలాగే గాలి వీచేటప్పుడు శబ్దం రాకుండా ప్రత్యేక చాంబర్ కూడా ఉంది. గేమ్స్ ఆడేవారి కోసం కేవలం 42 మిల్లీ సెకన్ల లో లేటెన్సీ సపోర్ట్ లభిస్తుంది.

భారతదేశంలో వివో బడ్స్ ధర కేవలం రూ.1,999 మాత్రమే. బడ్జెట్ ధరలో మంచి ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా మంచి ఆప్షన్. వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఇవి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వివో లేదా ఐక్యూ స్మార్ట్‌ఫోన్లతో జత చేసినప్పుడు ప్రత్యేకమైన పెట్ థీమ్ యానిమేషన్ కనిపించడం దీనికి మరింత అందాన్ని తెస్తుంది. ఇతర బ్రాండ్ ఫోన్లతో కూడా ఇవి కనెక్ట్ అవుతాయి కానీ, కొన్ని స్పెషల్ ఫీచర్లు మాత్రం వివో ఫోన్లలోనే బాగా పనిచేస్తాయి.

Also Read: 50 గంటల బ్యాటరీ, శాటిలైట్ కమ్యూనికేషన్.. రూ.1.09 లక్షల ధరతో Apple Watch Ultra 4 లాంచ్!

Tags

Related News

Whatsappలో ఇక మెసేజ్ లాగే మనీ ట్రాన్స్‌ఫర్.. ఫోన్‌పే, గూగుల్ పేలకు గట్టిపోటీ ఇవ్వడం ఖాయం!

పీతల పెంకులతో బ్యాటరీనా? శాస్త్రవేత్తల ప్రయోగం చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

రూ. 2,000 కే వాషింగ్ మిషన్.. సైకిల్ పెడల్ తొక్కితే బట్టలు క్లీన్.. ఇదేదో భలే ఉందే!

బెస్ట్ పవర్ బ్యాంక్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

iPhone Duoని పక్కన పెట్టేలా iPhone 18 Proలో ఉన్న 5 కీలక ఫీచర్లు ఇవే!

తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు..ట్రెండింగ్‌లో టాప్ గాడ్జెట్

జియో దుమ్మురేపే ప్లాన్.. రూ.899 కే 90 రోజుల వ్యాలిడిటీ.. 5G డేటా, ఓటీటీ, ఫ్రీ కాల్స్!

Big Stories

Advertisement
×