Jailer 2 Movie Review:
నటీనటులు: సూపర్‌స్టార్ రజినీకాంత్, మోహన్‌లాల్, విద్యాబాలన్, విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి తదితరులు
దర్శకత్వం: నెల్సన్ దిలీప్‌కుమార్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సూపర్ హిట్ చిత్రమైన ‘జైలర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) జీవితంలో జరిగే అనూహ్య పరిణామాల నేపథ్యంలో కథ సాగుతుంది. తన కుటుంబాన్ని, చుట్టూ ఉన్న వారిని కాపాడుకోవడం కోసం ముత్తువేల్ పాండియన్ మరోసారి ఎలాంటి ప్రమాదకరమైన సాహసాలు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన కొత్త శత్రువులు ఎవరు? వారిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం ఏ రీతిలో అయితే మాస్ ప్రేక్షకులను అలరించిందో, అదే జోరును ఈ సీక్వెల్లో కూడా కొనసాగించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా కామెడీగా, నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, రజినీకాంత్ ఎలివేషన్ సీన్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్తాయి. నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటాయి. అయితే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినప్పటికీ, స్టార్ క్యాస్టింగ్ హడావుడి సినిమాను నిలబెడుతుంది.
రజనీకాంత్ ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో అదరగొట్టేశారు. వయసుకు తగ్గ పాత్రలో సెటిల్డ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు..కొన్నిచోట్ల కళ్ళతోనే హావభావాలు పలికించి అందరిని ఆకట్టుకున్నారు. ఎస్ జె సూర్య విలనిజం మాత్రం కాస్త రొటీన్ గానే అనిపించింది. యోగి బాబు కామెడీ ఆకట్టుకుంది. మూర్తి పాత్రలో నటించిన నటుడు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక హృతిక్ రోషన్, శివ రాజ్ కుమార్ , విజయ్ సేతుపతి, మోహన్ లాల్ వంటి దిగ్గజాలు కనిపించింది ఒకటి రెండు సీన్లే అయినా విజిల్స్ వేయించారు. మిథున్ చక్రవర్తి చాలా కాలం తర్వాత కొంత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించి అభిమానులను మెప్పించారు. విద్యాబాలన్ నటన ఆకట్టుకునేలా ఉంది . రమ్యకృష్ణ పాత్ర ఎప్పటిలాగే రొటీన్ అనిపించింది. మిగతా పాత్రలు తమ పాత్రల మేరకు బాగానే ఆకట్టుకున్నారు.
also read: ఆ ఒక్క క్షణమే పునీత్ ప్రాణం తీసిందా..ఇన్నేళ్ళకి బయటపడ్డ నిజం!
సూపర్‌స్టార్ రజినీకాంత్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాక్షన్ స్టంట్స్
మోహన్‌లాల్, విద్యాబాలన్ మరియు ఇతర నటీనటుల కీలక పాత్రలు
అనిరుధ్ రవిచందర్ అందించిన అద్రేకకరమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM)
నెల్సన్ మార్క్ కామెడీ టైమింగ్ మరియు ఎలివేషన్ సీన్స్
ఇంటర్వెల్ బ్యాంగ్
మైనస్ పాయింట్లు:
సెకండాఫ్‌లో అక్కడక్కడా సాగదీతగా అనిపించే కథనం
రొటీన్‌గా మళ్ళీ అవే పాత కాన్ఫ్లిక్ట్ పాయింట్లు రిపీట్ అవ్వడం
చివరి ఆఖరి మాటగా:
మాస్ ఎంటర్టైనర్లు, రజినీకాంత్ స్టైలిష్ యాక్షన్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ ‘జైలర్ 2’ ఒక మంచి పండగలాంటి విజువల్ ట్రీట్ ఇస్తుంది.