E-Paper
Advertisement

నడవలేని స్థితిలో టాలీవుడ్ లేడీ కమెడియన్.. వీడియో వైరల్!

నడవలేని స్థితిలో టాలీవుడ్ లేడీ కమెడియన్.. వీడియో వైరల్!
Advertisement

Actress Urvashi:మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సీనియర్ నటి ఊర్వశి (Urvashi ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో కూడా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )లాంటి స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించిన ఈమె.. ఆ తర్వాత కాలంలో మలయాళం , తమిళ భాషల్లో వందలాది సినిమాలు చేశారు. ఇక వయసు పెరిగే కొద్దీ ఫిమేల్ యాక్టర్స్ కి వయసుకు తగ్గట్టుగా పాత్రలు లభిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు . ముఖ్యంగా అమ్మ , అమ్మమ్మ, అత్తయ్య ఇలా పలు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఊర్వశి.

నడవలేని స్థితిలో ఊర్వశి..

అలా వరుస సినిమాలతో బిజీగా మారిన ఈమె. తాజాగా ‘ఆశా’ అనే సినిమాలో నటించారు. మొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొన్న ఈమె ఇప్పుడు ఉన్నట్టుండి నడవలేని స్థితిలో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ .. ఎప్పుడూ హుషారుగా తిరిగే ఊర్వశికి ఏమైంది? ఎందుకు నడవలేక పోతోంది ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఆశా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక మాల్ లో జరిగిన ఈవెంట్లో ఊర్వశి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మెట్లు దిగేటప్పుడు ఇద్దరి సహాయం తీసుకోవడం అభిమానులను ఆందోళనలకు గురిచేసింది.

Advertisement

also read:‘స్లమ్ డాగ్’ నుండి సంయుక్త ఆన్ సెట్ పిక్స్.. రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ?

అసలు ఏమైందంటే?

నిరంతరం షూటింగ్స్, వరుస ప్రమోషన్లతో బిజీగా ఉండడం వల్లే ఆమె తీవ్ర అలసట, అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎప్పుడూ చలాకీగా కనిపించే ఊర్వశి ఇలా ఉన్నట్టుండి నడవలేని స్థితిలో కనిపించడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకోవాలని సలహాలిస్తూ.. త్వరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నారు.

ఊర్వశి నటించిన ఆశా మూవీ విడుదల నేడే..

Advertisement

యువ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ సఫర్ సనల్ తెరకెక్కించిన తాజా చిత్రం ఆశా. ఊర్వశి ప్రధాన పాత్రలో జోజు జార్జ్ కీలక పాత్ర పోషిస్తూ.. సెప్టెంబర్ 11 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆశా కూతురు అనఘ పాత్రలో ఐశ్వర్య లక్ష్మి కీలకపాత్ర పోషించగా.. విజయ రాఘవన్ , జోయ్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. అజిత్ వినాయక ఫిలిమ్స్ పతాకంపై వినాయక అజిత్ నిర్మించిన ఈ చిత్రానికి గోవిందు వసంత సంగీతం అందించారు. వివాదం , న్యాయపోరాటం చుట్టూ ఈ మిస్టరీ థ్రిల్లర్ కొనసాగుతుంది.

Related News

‘స్లమ్ డాగ్’ నుండి సంయుక్త ఆన్ సెట్ పిక్స్.. రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ?

మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు.. అసలేం జరిగిందంటే?

నిహారిక నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. బొజ్జ గణపయ్య లుక్ చూశారా?

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

సముద్రం ఒడ్డున బాలయ్య భామ.. ఫొటో చూస్తే చూపు తిప్పుకోలేరు!

సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

Big Stories

Advertisement
×