Youth Movie Review: కన్ కరుణాస్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘యూత్’. టీనేజ్ ప్రేమకథలు, ఆ వయసులో వచ్చే అలజడులు, భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
Read also-Anna Konidela: ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి.. ఫస్ట్ పిక్ ఎంటంటే?
15 ఏళ్ల ప్రవీణ్ (కన్ కరుణాస్) స్కూల్ చదువు పూర్తయ్యేలోపు ‘నిజమైన ప్రేమ’ను కనుగొనాలనే పట్టుదలతో ఉంటాడు. ఈ క్రమంలో అతడు వివిధ అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం, కొన్ని అనుబంధాలు ఏర్పడటం, మరికొన్ని విఫలం కావడం వంటివి జరుగుతుంటాయి. ఈ ప్రయాణంలో ఎదురైన బ్రేకప్స్, అవమానాలు, అనుభవాల ద్వారా ప్రేమ అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదని, అది జీవితం పట్ల పరిణతిని ఎలా నేర్పుతుందనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
దర్శకుడు కన్ కరుణాస్ ఒక సాధారణ టీనేజ్ డ్రామాను ఎంచుకున్నప్పటికీ, దానిని ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా టీనేజ్ మెచ్యూరిటీ అనే అంశాన్ని హృద్యంగా చూపించారు. అడోలెసెన్స్ దశలో యువత ఆలోచనలు ఎలా ఉంటాయి, వారు చేసే చిన్న చిన్న తప్పులు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయాలను సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించారు. కన్ కరుణాస్ నటనలో ఈజ్ ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో అమాయకపు ప్రేమికుడిగా తను బాగా సెట్ అయ్యాడు. అనీష్మా అనిల్‌కుమార్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. దేవదర్శిని చేతన్ వంటి సీనియర్ నటులు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చారు. సినిమాటోగ్రఫీ స్కూల్ వాతావరణాన్ని, టీనేజ్ రంగుల ప్రపంచాన్ని చక్కగా చూపించింది. సంగీతం కథలోని మూడ్‌ను ఫాలో అవుతూ సాగింది. ఎడిటింగ్ పరంగా అక్కడక్కడ కొన్ని సాగదీత సీన్లు ఉన్నట్లు అనిపించినా, కథా గమనానికి అవి పెద్దగా ఆటంకం కలిగించవు.
Read also-Virosh couple: హనీమూన్ కి వెళ్ళిన విరోష్ జంట.. స్పెషల్ వీడియో పంచుకున్న రష్మిక!
మొత్తానికి.. ‘యూత్’ కేవలం ఒక రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు, ఒక కుర్రాడు పరిణతి చెందిన వ్యక్తిగా ఎలా మారాడనే కమింగ్-ఆఫ్-ఏజ్ కథ. టీనేజ్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అనుభూతినిస్తుంది.
రేటింగ్ - 2.25 /5