E-Paper
Advertisement

Rahul Gandhi: ఆ రాత్రి ఆందోళన చెందా.. ఆ నర్సు ఏం చేశారంటే.. అప్పుడే డిసైడ్ అయ్యా-రాహుల్‌‌గాంధీ

Rahul Gandhi: ఆ రాత్రి ఆందోళన చెందా.. ఆ నర్సు ఏం చేశారంటే.. అప్పుడే డిసైడ్ అయ్యా-రాహుల్‌‌గాంధీ
Advertisement

Rahul Gandhi: కేరళ శాసనసభకు ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈలోగా సోనియాగాంధీ అనారోగ్యానికి గురికావడంతో ఆమెని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. రాత్రి ఆసుపత్రిలో తన కళ్ల ముందు జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు రాహుల్‌గాంధీ.

మంగళవారం రాత్రి తాను ఆసుపత్రిలో మా అమ్మ గదిలో ఉన్న ఓ చిన్న సోఫాలో నిద్రపోతున్నానని తెలిపారు. అందరు కొడుకుల మాదిరిగా తాను కూడా అమ్మ ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందానని వీడియో ద్వారా తెలిపారు. ఆ రాత్రి తనకు ఒకే ఒక్క విషయంలో ఓదార్పు లభించిందన్నారు. ప్రతి గంటకూ మా అమ్మను చూడటానికి కేరళకు చెందిన ఒక నర్సు వల్ల తనకు ఓదార్పు దొరికిందన్నారు.

Advertisement

ప్రతి గంటకూ ఆమె వచ్చి మా అమ్మ ఆరోగ్యం గురించి చెక్ చేసేదని వివరించారు. ఆమె నవ్వి, అమ్మ చేతిని పట్టుకునేదని తెలిపారు. అత్యంత కష్ట సమయాల్లో కేరళకు చెందిన నర్సుల నుండి ఎంత మంది కొడుకులు, కూతుళ్లు, సోదరులు, సోదరీమణులు ఓదార్పు పొంది ఉంటారోనని తాను ఆలోచించడం మొదలుపెట్టానని వివరించారు.

ఉదయాన్ని, తాను ఆమెని పిలిచి మీరు రాత్రి నిద్ర పోతారా, రాత్రంతా పని చేస్తారా? అని అడిగానని, అందుకు ఆమె తాను రాత్రంతా పని చేస్తానని చెప్పిందన్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు కేరళ మహిళలు తమ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఓదారుస్తూ వారి చేతులు పట్టుకుని వారికి మనశ్శాంతిని అందిస్తున్నారని మనసులోని భావాలను వ్యక్తం చేశారు.

Advertisement

 

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×