AI:- భూమిపైనే కాదు అంతరిక్షంలో కూడా ఎప్పుడు ఏ విపత్తు వచ్చి పడుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న టెక్నాలజీ సాయంతో అంతరిక్షంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్ట్రానాట్స్ అలర్ట్‌గా ఉన్నా కూడా తాజాగా సంభవించిన సోలార్ స్టార్మ్ వారికి హెచ్చరికలను అందించింది. అందుకే భవిష్యత్తులో సోలార్ స్టార్మ్స్‌ను గుర్తించడానికి వారు ఏఐ సాయం తీసుకోనున్నారు.
ఏఐ అనేది అన్ని రంగాల్లో ముందుగా ఉన్నా స్పేస్ టెక్నాలజీలో మాత్రం దీని పూర్తిస్థాయి వినియోగం ఇంకా మొదలుకాలేదు. కానీ ఇప్పుడు ఆస్ట్రానాట్స్‌కు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయం అవసరమయ్యింది. సోలార్ స్టార్మ్స్ పెరుగుతున్న ఈ తరుణంలో ఇండియాలోని పలు ఆస్ట్రానాట్స్ నాసాతో కలిసి కొత్త పరిశోధనను ప్రారంభించనున్నారు. వీరంతా కలిసి ఏఐ, శాటిలైట్ డేటాను కలిపే ఒక కొత్త కంప్యూటర్ మోడల్‌ను తయారు చేయనున్నారు. ఇది స్పేస్‌లో జరిగే ప్రమాదాలను ముందుగానే గుర్తించి సమాచారం అందించేలా డిజైన్ చేయబడుతుంది.
సూర్యుడి యాక్టివిటీని బట్టి సోలార్ స్టార్మ్స్ అనేవి సంభవిస్తాయి. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి యాక్టివిటీ తారాస్థాయికి చేరుకుంటుంది. అలాంటి సమయంలోనే సోలార్ స్టార్మ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. 2025లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రానాట్స్ గుర్తించారు. ఒక్కొక్కసారి ఈ సోలార్ స్టార్మ్ కెపాసిటీ అనేది తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. టెక్నాలజీపై ప్రపంచం ఆధారపడడం మొదలయిన తరువాత సోలార్ స్టార్మ్స్ తీవ్రత మరింత పెరిగింది.
ఆస్ట్రానాట్స్ కొత్తగా తయారు చేయనున్న ఏఐ మోడల్ సోలార్ విండ్‌ను గమనిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి సోలార్ స్టార్మ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అనే విషయాలు ఆస్ట్రానాట్స్ ముందుగానే తెలుసుకోవచ్చు. అంతే కాకుండా సోలార్ స్టార్మ్ సమయంలో ఏఐ 30 నిమిషాల ముందే అడ్వాన్స్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఈ సమయంలోనే పవర్ గ్రిడ్స్‌ను కాపాడుకోవడానికి శాస్త్రవేత్తలు సన్నాహాలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ 30 నిమిషాలలో సోలార్ స్టార్మ్ తీవ్రతను తగ్గించడానికి ఆస్ట్రానాట్స్ ప్రయత్నాలు చేస్తారు.
ఇప్పటికే డాగర్ అనే కంప్యూటర్ మోడల్‌ను సోలార్ స్టార్మ్స్ గురించి కనుక్కోవడం కోసం ఆస్ట్రానాట్స్ కనిపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా జియోమ్యాగ్నటిక్ కదలికల గురించి డాగర్ ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉంటుంది. డాగర్ ఇచ్చే సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. దీని సాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రోల్ సెంటర్స్‌లో సోలార్ స్టార్మ్స్ సూచన వచ్చినప్పుడల్లా అలార్మ్ మోగుతుంది. ఇప్పటికే డాగర్ కంప్యూటర్ మోడల్‌పై ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి.
ఢిల్లీలో గాలి కాలుష్యం తగ్గించడానికి కొత్త ప్లాన్..
for more updates follow this link:-Bigtv