BigTV English
Advertisement

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 9 – నవంబర్‌ 15)  ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది – నూతన వాహన యోగం 

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (నవంబర్‌ 9 – నవంబర్‌ 15)  ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది – నూతన వాహన యోగం 

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (నవంబర్‌ 9 – నవంబర్‌ 15) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


మేష రాశి:

సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. బంధు మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి: 

నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చాలాకాలంగా ఉన్న సమస్యలను క్రమక్రమంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పాత బాకీలు వసూలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను రాజీ చేసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శివాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.


 మిథున రాశి: 

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో కొంత జాప్యం తప్పదు. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి:

ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుని బాధపడతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభఫలితాలను పొందుతారు.

 సింహారాశి:

చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

 కన్యా రాశి: 

కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. దాయదులతో స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఇంట బయట నూతనోత్సాహంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. రామ రక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి: 

ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా మార్చుకుని ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. పంచముఖ హనుమత్ కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ధనస్సు రాశి:

ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి ఉపశమనం పొందుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి:

 ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున దూరపు బంధువుల ఆగమన ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాలు అందుకుంటారు. ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి: 

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగగైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా బాధిస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మీన రాశి:

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు గృహమున శుభాకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నవగ్రహ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (09/11/2025) ఆ రాశి వారికి ఊహించని మార్పులు – వారికి బంధువులతో గొడవలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (08/11/2025) ఆ రాశి వారికి కుటుంబ సభ్యులతో గొడవలు – వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (07/11/2025) ఆ రాశి వారికి  నూతన వాహన యోగం – ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (06/11/2025) ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – వారికి ఆకస్మిక ప్రయాణాలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (05/11/2025) ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వృత్తి వ్యాపారాలలో నష్టాలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (04/11/2025) ఆ రాశి ఉద్యోగుల సమస్యలు తీరుతాయి – వారికి ఆర్థికపరమైన నష్టాలు   

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (03/11/2025) ఆ రాశి వారికి  ఆకస్మిక ధనలాభం – వారికి నూతన వాహన యోగం

Big Stories

×