E-Paper
Advertisement

OTT Movie : తలలు నరికి చంపే కిల్లర్… పోలీసులకు చెమటలు పట్టించే కేసు… బుర్రపాడు ట్విస్టులు

OTT Movie : తలలు నరికి చంపే కిల్లర్… పోలీసులకు చెమటలు పట్టించే కేసు… బుర్రపాడు ట్విస్టులు
Advertisement

OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా ఈ మధ్య సినిమాల ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి స్టోరీలు ఎక్కువగా క్రైమ్ కేసుల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇవే ట్రెండ్ కూడా అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక బెంగాలీ సినిమా, 2009లో ఢాకాలోని అజింపూర్‌లో జరిగిన నిజమైన నర్సింగ్ స్టూడెంట్ హత్య కేసు ఆధారంగా తెరకెక్కింది. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్, మహిళలపై వైలెన్స్ ను కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి ఇది మంచి రెస్పాన్స్ పొందింది. ముఖ్యంగా థ్రిల్లర్ లవర్స్ బాగా ఆదరించారు. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

‘ఈషా మర్డర్: కర్మఫల్’ (Esha Murder: Karmaphal) 2025లో విడుదలైన బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఇది సన్నీ సన్వార్ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ సినిమా 2025న జూన్ 7న ఈద్-ఉల్-అజ్హా సమయంలో విడుదలైంది. ఇది 2 గంటల 26 నిమిషాల నిడివితో ఐయండిబిలో 6.5/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం బిలిబిలి, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఢాకాలోని అజింపూర్ ప్రాంతంలో నర్సింగ్ స్టూడెంట్ ఈషా తన రూమ్‌లో భయంకరంగా హత్యకు గురవుతుంది. ఆమె తల నరికి వేరు చేయబడి ఉంటుంది. ఈ ఘటన స్థానికులను భయ భ్రాంతులకు గురిచేస్తుంది. కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయిన మహిళా పోలీసు ఆఫీసర్ లీనా ఈ కేసు తీసుకుని దర్యాప్తు మొదలుపెడుతుంది. ఈ దర్యాప్తులో ఈషా జీవితంలో అబ్యూస్, హారస్మెంట్, సీక్రెట్ సంబంధాలు బయటపడతాయి. కాలేజ్ ఫ్రెండ్స్, లవర్‌లను లీనా ప్రశ్నిస్తుంది. పోలీసు హై అధికారులు 12 గంటల్లో కేసు ముగించాలని ఒత్తిడి చేసి, ఒక పేద మహిళను ఫ్రేమ్ చేయడానికి ప్లాన్ చేస్తారు.

Read Also : మానసిక రోగం ఉన్న అమ్మాయిపై మనసు… పెళ్లి చేసుకుందాం అనుకుంటే మెంటలెక్కించే ట్విస్ట్

Advertisement

అయితే లీనా దర్యాప్తులో సీరియల్ కిల్లర్ ఎవరో కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తుంది. కిల్లర్ చాలా తెలివైనవాడు. మహిళలపై వైలెన్స్ చేస్తూ టార్గెట్ చేశాడు. ఆమెను గతంలో వేధించిన వ్యక్తే హత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఇక లీనా 12 గంటల టైమ్ లిమిట్‌లో ఊహించని ట్విస్టులతో ఇన్నోసెంట్ మహిళను కాపాడి, రియల్ కిల్లర్ ను పట్టుకుంటుంది. అతనికి శిక్ష కూడా పడేలా చేస్తుంది. కిల్లర్ ఎవరు ? ఎందుకు చంపాడు ? పోలీసు ఆఫీసర్ లీనా అతన్ని ఎలా పట్టుకుంటుంది ? అనే విషయాలను, బెంగాలీ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×