BigTV English

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Airtel Cheap Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వెరీ చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్, 1.5GB డేటా పొందొచ్చు!

Airtel Recharge Plan: ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల తమ రీఛార్జ్ ప్లాన్‌లను అధికంగా పెంచేశాయి. దీంతో చాలా మంది వెరే నెట్‌వర్క్‌కి పోర్ట్ అయిపోయారు. మరికొందరేమో పెరిగిన రీఛార్జ్ ధరలను చూసి షాక్ అయ్యారు. దీని కారణంగా మూడు నెలల రీఛార్జ్ ప్లాన్ చేసుకునే వారు ఈ పెరిగిన ధరలతో కేవలం ఒక్కనెల మాత్రమే రీఛార్జ్ చేసుకునే స్థితికి వచ్చారు. అందువల్ల ఇదే సరైన సమయమని భావించిన ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.


దీంతో చాలా మంది బిఎస్ఎన్‌ఎల్ సిమ్ నెట్‌వర్క్‌కు పోర్ట్ అయ్యారు. మరికొందరేమో కొత్త సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. ఇక అదే సమయంలో తమ నెట్‌వర్క్ యూజర్లు రోజు రోజుకూ తగ్గిపోతుండటంతో జియో, ఎయిర్‌టెల్, విఐ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లను అందించడం మొదలు పెట్టాయి. తరచూ ఆఫర్లను ప్రకటించి తమ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో తన వినియోగదారులకు దీపావళి కానుకగా ఆకర్షణీయమైన ఆఫర్‌లను కూడా అందించింది.

జియో అందిస్తున్న కొత్త ఆఫర్‌తో వినియోగదారులు 1 సంవత్సరం ఉచిత జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్‌ని పొందే సువర్ణావకాశాన్ని పొందుతున్నారు. అలాగే ఇందులో BSNL కూడా ఓ ఆఫర్‌తో వచ్చింది. రూ.797 ధరతో 300 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒకరకంగా చాలా బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే మిగతా టెలికాం కంపెనీల 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ ధరల బట్టి చూసుకుంటే ఇది చాలా తక్కువని చెప్పాలి.


Also Read: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

ఇక ఇప్పుడు ఎయిర్‌టెల్ వంతు వచ్చింది. తాజాగా ఎయిర్‌టెల్ అతి చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం రూ.26 చౌక రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. జూలైలో ధరల పెంపు తర్వాత ఎయిర్‌టెల్ చాలా పాత ప్లాన్‌ల ప్లేస్‌లో కొత్త ప్లాన్‌లు తీసుకొచ్చి ధరలను పెంచింది. ఇప్పుడు కంపెనీ తన వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఇది కోట్లాది మంది వినియోగదారుల కోసం చౌక ప్యాక్‌ను తీసుకొచ్చింది. దీనిలో వినియోగదారులు ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి 1.5GB హై స్పీడ్ డేటా ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ ద్వారా కేవలం రూ.26లతో రీఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. అయితే ఇది ఓన్లీ డేటా ప్యాక్ మాత్రమే. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఒక్కరోజు వ్యాలిడిటీతో 1.5gb డేటా పొందుతారు. అందువల్ల అదనపు డేటా అవసరమయ్యే కస్టమర్ల కోసం ఇది బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. వినియోగదారులు ఇప్పటికే అమలవుతున్న ట్రూలీ అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో పాటు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×