EPAPER

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, రెడ్‌మీ, ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్లు వెరీ చీప్ గురూ..!

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, రెడ్‌మీ, ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్లు వెరీ చీప్ గురూ..!

Amazon Great Freedom Festival Sale: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు వినియోగదారులను ఆకట్టుకునేందుకు తరచూ కొత్త కొత్త డీల్‌లు ప్రకటిస్తాయి. ఆ కొత్త డీల్‌ సమయంలో వివిధ ప్రొడక్టులను తక్కువ ధరకే సేల్‌కు ఉంచుతాయి. తాజాగా అలాంటిదే అమెజాన్ కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నేటి నుండి అంటే ఆగస్టు 6, 2024 నుండి ప్రారంభమైంది. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్‌లు, ఇయర్‌బడ్స్, ఇతర గాడ్జెట్‌లపై భారీ తగ్గింపులను అందజేస్తున్నారు. సేల్‌లో ధరల తగ్గింపుతో పాటు, బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే పాత డివైజ్‌లను మార్చుకోవడంలో అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే స్మార్ట్‌ఫోన్లపై లభించే డీల్స్, డిస్కౌంట్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.


OnePlus Nord CE4 Lite 5G

OnePlus Nord CE4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డూపర్ ఆఫర్ ఉంది. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999కి లిస్ట్ చేయబడింది. కూపన్ ఆఫర్ నుండి మీరు రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లో SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ. 17,999కి సొంతం చేసుకోవచ్చు. OnePlus Nord CE4 Lite 5G ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 5500 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14లో పనిచేస్తుంది.


iQOO Z9 5G

Also Read: 108ఎంపీ కెమెరాతో 5జీ ఫోన్ లాంచ్.. ఏంటీ మరీ ఇంత తక్కువా..?

iQOO Z9 5G స్మార్ట్‌ఫోన్ పై కూడా ఆఫర్లు ఉన్నాయి. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999 వద్ద లిస్ట్ చేయబడింది. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ. 18,999 కి కొనుక్కోవచ్చు.

Poco X6 5G

Poco X6 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 18,999కి లిస్ట్ చేయబడింది. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత దీనిని రూ. 17,999 కి సొంతం చేసుకోవచ్చు.

Redmi Note 13 5G

Redmi Note 13 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.18,999కి లిస్ట్ చేయబడింది. అలాగే SBI క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత దీనిని కేవలం రూ. 17,999 కి సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo 70 Pro 5G

Realme Narzo 70 Pro 5G ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.18,999కి లిస్ట్ చేయబడింది. కూపన్ ఆఫర్ నుండి రూ. 2750 తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత ఇది రూ. 16,249కి అందుబాటులో ఉంటుంది. మీరు Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ నుండి రూ. 2,000 వెల్‌కమ్ రివార్డ్‌ను పొందవచ్చు. రియల్‌మీ నార్జో 70 ప్రో 5G ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 2400×1080 పిక్సెల్‌లు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Related News

Realme P2 Pro 5G: ఇచ్చిపడేసిన రియల్‌మి.. కొత్త ఫోన్ లాంచ్, మొదటి సేల్‌లో ఊహించని డిస్కౌంట్!

Amazon Great Indian Festival Sale 2024: అమెజాన్ న్యూ సేల్.. వీటిపై 80 శాతం వరకు డిస్కౌంట్, దంచుడే దంచుడు!

Apple iPhone 16 ప్రీ ఆర్డర్ : యాపిల్ ఐఫోన్ 16 అడ్వాన్స్ బుకింగ్ షురూ.. ఈఎంఐ, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ వివరాలు మీ కోసం..

Samsung Galaxy M05: వెరీ చీప్.. రూ.7,999 లకే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్, సామాన్యులకు పండగే పండగ!

Samsung Galaxy S24 Ultra Price Cut: వారెవ్వా ఆఫర్ సూపర్.. సామ్‌సంగ్ ఫోన్‌పై రూ.20,000 డిస్కౌంట్, కొద్ది రోజులు మాత్రమే!

Infinix Hot 50i: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో హాట్ ఫోన్.. ఈసారి మామూలుగా ఉండదు!

Samsung Galaxy S25 Ultra: లీకైన గెలాక్సీ ఎస్25 అల్ట్రా రెండర్స్.. భయ్యా ఫీచర్స్ మామూలుగా లేవుగా!

Big Stories

×