One of the Top most world richest Indian business man Ambani chef salary news viral: భారత్ కు చెందిన ప్రపంచ స్థాయి కుబేరుడాయన. కోట్ల వ్యాపారాలను ఒంటి చేత్తో విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇటీవల తన కొడుకు వివాహ మహోత్సవం ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో జరిపించారు.వచ్చిన అతిధులంతా అంబానీ వైభోగాన్ని వేనోళ్ల పొగిడారు. దాదాపు రూ.5 వేల కోట్లు కేవలం పెళ్లికే ఖర్చుపెట్టిన అంబానీ వచ్చిన అతిధులకు ఏ స్థాయిలో ఫుడ్ ఐటమ్స్ అందించి ఉంటారో ఊహించుకోవచ్చు. అయితే అంబానీ తన వ్యాపార సామ్రాజ్యం అంతలా విస్తరించడానికి ఆయనకుండే కమిట్ మెంట్ టీమ్ సభ్యులే కారణం అంటారు. కష్టపడి పనిచేసే ఉద్యోగికి అతడు ఊహించినదానికి రెట్టింపు జీతాలు ఇవ్వమే అంబానీ స్టయిల్. అయితే అంబానీ ఇంటి పనివాళ్లును కూడా ఆయన బాగా చూసుకుంటారని అంటుంటారు అంతా. పనిచేసేవాళ్లకు కూడా చదువుకుని ఉండాలనే రూల్ ఉందట అక్కడ.
500 మంది పనివాళ్లు
కేవలం ఆయన ఇంటికి సంబంధించిన పనివాళ్లే ఐదు వందలకు పైగా ఉంటారని అంటుంటారు. వాళ్లందరికీ హెల్త్ ఇన్యూరెన్స్, ఇంటి అద్దెలు, వాళ్ల పిల్లల చదువుల వ్యవహారం అన్నీ అలవెన్సుల రూపంలో అందిస్తారు. జీతాలు కాకుండా పనివాళ్ల సంతృప్తే ప్రధానంగా అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి. అయితే రిక్రూట్ మెంట్ సమయంలో వాళ్లను ఆషామాషీగా తీసుకోరు. అతని వ్యక్తిగత ప్రవర్తన, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపికయినవారికి అనేక పరీక్షలు చేస్తారు. అలాంటిది అంబానీ ఇంట్లో పనిచేసేవారంటే అంతకు మించి పరీక్షలు ఉంటాయని అంటున్నారు.
జీతంతో పాటు అలెవన్స్
ఒకసారి పనిలో సెలక్ట్ అయిన ఉద్యోగి ఇక లైఫ్ లాంగ్ అక్కడే ఉండటానికి ఇష్టపడతాడంలే వాళ్లు ఎంతలా వారిని చూసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే చాలా మంది నెటిజనులు అంబానీ ఇంటి వంటవానికి జీతం ఎంతిస్తారో అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే ఎంతైనా సెలబ్రిటీ ఫ్యామిలీ కదా అందుకు..అక్కడ పనిచేసే చెఫ్ కు నెలకు రూ.2 లక్షలు, అలవెన్సులు అదనంగా ఇస్తారట. అంటే సంవత్సరానికి రూ.24 లక్షలన్నమాట.
సాఫ్ట్ వేర్ ఉద్యోగం దండగ
ఇదంతా చూసి నెటిజన్స్ తమకు ఛాన్స్ వస్తే సాఫ్ట్ వేర్ ఉద్యోగం మానేస్తామంటున్నారు. అనవసరంగా ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి చదువులపై ఇన్ వెస్ట్ చేశామని వాపోతున్నారు .ఇలాంటి ఉద్యోగం ఒక్కటి దొరికితే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుందని అంటూ ట్రోలింగులు మొదలెట్టారు. అందుకే గొప్పవారు ఏం చేసినా అది గొప్పగానే ఉంటుందంటారు. అది అంబానీ ఫ్యామిలీ విషయంలో నిరూపణ అయింది. లేకపోతే అంబానీ వంటవానికి ఏ పదివేలో ఇరవై వేలో ఉంటే అది వార్త ఎలా అవుతుంది.