iPhone 17 Pro Alternatives| ఐఫోన్ 17 ప్రో కెమెరా పర్‌ఫామెన్స్ విషయంలో గొప్పగా ఉన్నప్పటికీ, 2025లో దానికంటే బెటర్ కెమెరా గల అండ్రాయిడ్ ఫోన్‌లు ఉన్నాయి. శామ్‌సంగ్, ఓప్పో, వివో, గూగుల్ వంటి బ్రాండ్‌లు అద్భుతమైన కెమెరా ఫోన్‌లను విడుదల చేశాయి. ఈ ఫోన్‌లు ఐఫోన్‌కు పోటీ ఇవ్వడమే కాకుండా మరింత మెరుగైన ఫొటోలు, వీడియోలు తీస్తాయి. ఇక్కడ ఐఫోన్ 17 ప్రోను ఓడించే 5 బెస్ట్ అండ్రాయిడ్ కెమెరా ఫోన్‌లు గురించి వివరాలు చూద్దాం.
గూగుల్ పిక్సెల్ 10 ప్రోలో పవర్‌ఫుల్ ట్రిపుల్ రెర్ కెమెరా సిస్టమ్ ఉంది. 50MP మెయిన్ సెన్సార్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో (5x జూమ్), 48MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. ఇది 8K వీడియో రికార్డింగ్ చేస్తుంది. ముందుభాగంలో ఉన్న 42MP అల్ట్రావైడ్ సెల్ఫీ కెమెరా 4K వీడియోలకు అనుకూలం. ఇది అద్భుతమైన డిటైల్స్‌తో డైనమిక్ రేంజ్‌ను అందిస్తుంది. 2025లో ఐఫోన్ 17 ప్రో కెమెరాను సులభంగా ఓడిస్తుంది. గూగుల్ AI ఫీచర్లు ఫొటోలను మరింత సహజంగా చేస్తాయి.
ఓప్పో ఫైండ్ X8 అల్ట్రాలో అద్భుతమైన క్వాడ్ 50MP కెమెరా సెటప్ ఉంది. డ్యూయెల్ పెరిస్కోప్ లెన్స్‌లు 3x, 6x జూమ్ అందిస్తాయి. 1-ఇంచ్ వైడ్ సెన్సార్ ఉంది. హాసెల్‌బ్లాడ్ కలర్ ట్యూనింగ్, డాల్బీ విజన్ 10-బిట్ వీడియోతో ఈ ఫోన్ కెమెరా చిన్న చిన్న డిటైల్స్ కూడా అందిస్తుంది. ఈ వివరాలు కెమెరా డైనమిక్ రేంజ్ చూపిస్తుంది. భారత్‌లో అధికారికంగా అందుబాటులో లేకపోయినా, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. 2025లో ఐఫోన్ 17 ప్రోకు ఈ ఫోన్ బలమైన పోటీదారుడు. లో-లైట్ కూడా అద్భుతంగా ఫోటోగ్రఫీ చేయగలం.
శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 200MP ప్రైమరీ సెన్సార్‌తో ప్రత్యేకం. 50MP పెరిస్కోప్ లెన్స్ (5x ఆప్టికల్ జూమ్), 10MP 3x టెలిఫోటో, 50MP అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. 8K రికార్డింగ్, HDR10+ సపోర్ట్‌తో ప్రో-లెవెల్ ఫొటోలు, వీడియోలు తీస్తుంది. S పెన్ స్టైలస్‌తో ఎడిటింగ్ చాలా సులభం. 2025లో ఐఫోన్ 17 ప్రోను ఓడించే కెమెరా బీస్ట్. గెలాక్సీ AI ఫీచర్లు ఫొటోలను మెరుగుపరుస్తాయి. టిటానియం బాడీతో ఈ ఫోన్ ఎక్కువ కాలం డ్యూరబులెటీ అందిస్తుంది.
వివో X200 ప్రోలో 50MP ప్రైమరీ లెన్స్, 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. జీస్ ఆప్టిక్స్‌తో మెరుగైన క్లారిటీ, కలర్ కచ్చితత్వం. 8K వీడియో సపోర్ట్ ఉంది. ఇది అద్భుతమైన ఫొటోలు తీస్తుంది. 2025లో ఐఫోన్ 17 ప్రోకు బలమైన రైవల్. కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీతో పోర్ట్రెయిట్‌లు సూపర్. లో బడ్జెట్‌లో హై-ఎండ్ కెమెరా అనుభవం.
ఓప్పో ఫైండ్ X8 ప్రోలో నాలుగు 50MP లెన్స్‌లు ఉన్నాయి. డ్యూయెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌లు 6x ఆప్టికల్ జూమ్ అందిస్తాయి. హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ ఇమేజింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీతో ప్రొఫెషనల్ షాట్‌లు తీస్తుంది. 2025లో ఐఫోన్ 17 ప్రోకు మరో పవర్‌ఫుల్ ప్రత్యామ్నాయం. వైడ్ యాంగిల్, జూమ్ షాట్‌లలో గ్రేట్ పర్‌ఫామెన్స్ అందిస్తుంది. డాల్బీ విజన్ వీడియోలు కూడా అద్భుతంగా ఉంటాయి.
ఈ ఫోన్‌లు ఐఫోన్ 17 ప్రో కెమెరాను బీట్ చేయడానికి 8K వీడియో, హై-రిజల్యూషన్ సెన్సార్‌లు, AI ఎడిటింగ్ వంటి ఫీచర్లతో సిద్ధంగా ఉన్నాయి. మీ అవసరాలకు తగ్గట్టు ఎంచుకోండి. ధరలు ఆఫర్లతో మరింత తక్కువగా ఉండవచ్చు.
Also Read: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే