BigTV English

Champions Trophy 2025: కొహ్లీ, రోహిత్ వన్డే, టెస్ట్ సిరీస్ లో ఆడతారు.. జైషా

Champions Trophy 2025: కొహ్లీ, రోహిత్ వన్డే, టెస్ట్ సిరీస్ లో ఆడతారు.. జైషా

Virat Kohli, Rohit to play in Pakistan-hosted Champions Trophy 2025: టీ 20 ప్రపంచకప్ గెలిచినందుకు సంతోషంగా ఉండాలా? భారత క్రికెట్ లో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన ఇద్దరు లెజండరీ ప్లేయర్లు విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించినందుకు విచారంగా ఉండాలో భారత అభిమానులకు అర్థం కాలేదు.


నిజానికి ఒక క్షణం మెగా టోర్నీ సాధించిన సంతోషంతో చిందులు వేసినా, అదెంతో సేపు నిలవలేదు. వన్ బై వన్ రవీంద్ర జడేజాతో కలిసి ముగ్గురు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆచార్య రాహుల్ ద్రవిడ్ అయితే ఏకంగా క్రికెట్ ప్రపంచానికి దూరమైపోయాడు. మరి ఐపీఎల్ కోచ్ గా లేదా మెంటార్ గా ఏమైనా బాధ్యతలు తీసుకుంటాడేమో తెలీదు.

ఈ సమయంలో బీసీసీఐ కార్యదర్శి జై షా శుభవార్త చెప్పారు. వాళ్లు వన్డే, టెస్ట్ మ్యాచ్ ల్లో ఆడతారని తెలిపారు. పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025, లార్డ్స్‌లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో కోహ్లీ, రోహిత్‌లు పాల్గొంటారని జై షా వెల్లడించారు. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల సమ్మేళనంతో జట్టుకి రూపకల్పన చేస్తామని అన్నారు.


టీ 20 ప్రపంచకప్ అలాగే గెలిచినట్టు గుర్తు చేశారు. జై షా వ్యాఖ్యల నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు మరో రెండు ఐసీసీ టోర్నీలు ఆడే అవకాశాలున్నాయని అంటున్నారు.  ఇదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ ఎంపికపై కూడా మాట్లాడారు. ఒక్కసారిగా అంతా ఖాళీ అయిపోయిందని, మళ్లీ అంతా కొత్తగా ప్రారంభించాలని నవ్వుతూ తెలిపారు.

Also Read: అమ్మాయిలు అదుర్స్.. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ లో విజయభేరీ

శ్రీలంక పర్యటన నుంచి కొత్త కోచ్ బాధ్యతలు చేపడతారని అన్నారు. ప్రస్తుతం జింబాబ్వేలో జరిగే టీ 20 సిరీస్ కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ గా వెళతారని తెలిపారు.  క్రికెట్ సలహా కమిటీ ఇప్పటికే గౌతమ్ గంభీర్, డబ్ల్యూవీ రామన్‌ పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. వారి సూచన మేరకు కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కొత్తగా సెలక్టర్ల నియామకంపై కూడా దృష్టి సారించినట్లు జై షా వెల్లడించారు. ఇక టీమిండియా టీ20 కెప్టెన్ ఎవరు అనేదానిపై త్వరలో సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని జై షా ప్రకటించారు.

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×