Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెలుగులో కూడా 9వ సీజన్ మొదలవగా అందులో 6 మంది కామనర్స్ , 9 మంది సెలబ్రిటీస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి అవగా.. ఐదవ వారం కూడా చివరి దశకు చేరుకుంది. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో కూడా నెలకొన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా సాధారణంగా బిగ్ బాస్ లో వీకెండ్స్ అనగానే.. హోస్ట్ నాగార్జున (Nagarjuna) స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ వారంలో చేసిన తప్పులను , కామెడీని ఎత్తిచూపుతూ వారి తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. అంతేకాదు ఆడియన్స్ వారి గురించి ఏమనుకుంటున్నారో కూడా చెప్పి వారిని అలర్ట్ చేస్తూ ఉంటారు. అలా ఈ వారం కూడా హోస్ట్ నాగార్జున వచ్చేసారు. వారాంతంలో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన సంఘటనలను, టాస్క్లలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ కడిగిపారేశారు. ఉదయం విడుదల చేసిన ప్రోమోలో భరణి శంకర్ చూపించిన పార్షియాలిటీ కి మండిపడ్డ నాగార్జున.. ఇప్పుడు రీతూ చౌదరి కారణంగా మిగతా ఇంటి సభ్యులందరూ కూడా ఆట తప్పుగా ఆడారు అంటూ రీతూ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. హోస్ట్ సుమన్ తో మాట్లాడుతూ.. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో నువ్వు నిజంగానే సపోర్ట్ తీసుకున్నావా ? అని అడగగా.. లేదు సార్ నేను అదే చెప్పాను అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు సుమన్. ఇక వీడియో ప్లే చేయగా.. ఫ్లోరా శెట్టి అన్న ఎలిమినేటెడ్ అంటూ చెప్పడం అక్కడ చూపించారు. అయితే సంచాలక్ గా ఉన్న రాము రాథోడ్ మాట్లాడుతూ.. నేను తలవైపు నుంచి చూసాను సార్…నాకైతే టచ్ అయినట్టే కనిపించింది అని చెప్పగా.. నాగార్జున ఆడియన్స్ నిర్ణయం అడగగా వాళ్ళు టచ్ కాలేదని చెప్పారు. ఆడియన్స్ నిర్ణయంతో నాగార్జున మాట్లాడుతూ.. మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ జంట సేఫ్ జోన్ లోకి రాలేదు అంటూ తెలిపారు.
ఇక రీతుతో మాట్లాడుతూ.. బెలూన్ టాస్క్ లో ఎంత బ్రీలియంట్ ఐడియా వచ్చింది రీతూ నీకు. ఊదుతూ బెలూన్ ని గాలిలో ఉంచాలి అని చెబితే.. నువ్వేమో కార్నర్ లో వేసేస్తే అది ఉండిపోతుంది అనుకున్నావా.. నిన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా అదే పద్ధతిలో ఆడారు.. సుమన్ దగ్గరకు వెళ్లి శ్రీజ తో ఎందుకు జోడీ కట్టావు అని అడిగావా.. అని అడగగా.. అదైతే నాకు గుర్తులేదు సార్ అంటూ రీతూ చెప్పింది.. దాంతో నాగార్జున కట్ అయింది నీ హెయిర్ మెమరీ కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు.
also read:Teja Sajja -Karthik : మిరాయ్ కాంబో రిపీట్.. సీక్వెల్ అయితే కాదండోయ్
మీరు ఆటలో ముందుకెళ్లాలంటే.. ఒక పవర్ఫుల్ ఆయుధం కావాలి.. ఆ ఆయుధమే పవర్ అస్త్ర అంటూ పవర్ అస్త్రాను ఇంట్రడ్యూస్ చేశారు నాగార్జున. మొత్తానికైతే ఈవారం ఎపిసోడ్ చాలా హీటెక్కించేలా కనిపిస్తోందని చెప్పవచ్చు