Instagram Reels Translation| సోషల్ మీడియా కంపెనీ మెటా తన ప్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ తో రీల్స్ ఆటోమెటిక్ గా అనువదించబడి డబ్ అవుతాయి. ఆ డబ్బింగ్ లిప్-సింక్ కూడా అవుతుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే వీడియోలను వారి ఇష్టమైన భాషలో ఆస్వాదించవచ్చు.
ఈ ఫీచర్ గురించి మెటా తొలిసారిగా ఆగస్టులో ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, పోర్చుగీస్ భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఎక్కువ భాషలు త్వరలోనే యాడ్ చేయబడతాయి.
మెటా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ప్రపంచ కంటెంట్, వివిధ దేశాల క్రియేటర్లకు ఎక్కువ రీచ్ తీసుకువస్తుంది. ఈ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఉచితం. పైగా రీల్స్ ఇంటర్ఫేస్ ఎగ్జిట్ చేయకుండానే వీక్షించవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో రీల్స్ అనువాద ఫీచర్‌ను అదనపు భాషలను చేర్చడానికి విస్తరిస్తోంది. క్రియేటర్లు ఇప్పుడు తమ రీల్స్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేయడానికి ముందు హిందీ, పోర్చుగీస్‌లోకి అనువదించవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ వీడియో ప్లాట్‌ఫామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి ఈ ఫీచర్ గురించి వివరించారు. ఆయన మెటా AI ఉపయోగించి ఒక ఇంగ్లీష్ వీడియో ని హిందీ, స్పానిష్, పోర్చుగీస్ భాషలో డబ్ చేయడం ద్వారా కొత్త ఫీచర్‌ను ప్రదర్శించారు.
ఈ ఫీచర్ యాక్టివేట్ చేయగానే క్రియేటర్ వాయిస్‌ను AI అనుకరించింది. నిజమైన వాయిస్‌ను తలపించే సౌండ్, టోన్ కూడా ఉంటుంది. వీడియోలు మరింత సహజంగా కనిపించడానికి, క్రియేటర్లు లిప్ సింక్ ఎంపికను కూడా ప్రారంభించవచ్చు, ఇది అనువదించబడిన ఆడియోను వారి నోటి కదలికలతో ఆటోమేటిక్‌గా సరిచేస్తుంది.
వినియోగదారులు అనువాదాలను ప్రారంభించడానికి లేదా నిలిపివేయడానికి ఎంచుకోవచ్చు, లేదా రీల్ యొక్క అసలు వెర్షన్‌ను చూడవచ్చని మెటా తెలిపింది. ఈ ఎంపికను యాక్సెస్ చేయడానికి, వీక్షకులు మూడు-డాట్స్ ఉన్న మెనూని తెరిచి ఆడియో, భాష సెట్టింగ్‌లకు నావిగేట్ చేయవచ్చు. అసలు భాషలో చూడాలనుకుంటే లేదా అనువాదం నిలిపివేయాలంటే డోన్ట్ ట్రాన్స్లేట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
యూట్యూబ్‌తో పోలిస్తే, ఇన్‌స్టాగ్రామ్ AI డబ్బింగ్ క్రియేటర్లు, వీక్షకులిద్దరికీ స్పష్టమైన లేబల్, వారి సమ్మతి ఆప్షన్లు కలిగి ఉంటుంది. 1,000 కంటే ఎక్కువ ఫాలోయర్లు ఉన్న క్రియేటర్లు, సపోర్ట్ చేయబడిన ప్రాంతాలలోని అన్ని పబ్లిక్ అకౌంట్స్‌కు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని మెటా ప్రకటించింది.
ఈ ఏఐ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ తో యూజర్లు… ఇప్పుడు వారికి నచ్చిన భాషలో కూడా వీడియోలను ఆస్వాదించవచ్చు. ఈ టెక్నాలజి భాషా అవరోధాలను తొలగించడంలో సహాయపడుతుంది.
Also Read: డాన్స్ చేసే సమయంలో గుండెపోటు.. పెరుగుతున్న కేసుల సంఖ్య.. ఇలా నివారించండి