PS5 Ghost Of Yotei Sales| గేమింగ్ రంగంలో PS5 (ప్లే స్టేషన్ 5) గేమ్స్ విపరీతమైన ఆదరణ ఉంది. ఈ PS5 గేమ్స్ లో తాజాగా ఓజీ తరహా ఒక గేమ్ విడుదలైంది. అయితే ఈ గేమ్ విడుదల కాగానే అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేసింది. ఈ గేమ్ పేరు ఘోస్ట్ ఆఫ్ యోటీ. ఈ గేమ్ విడుదల అయిన మొదటి రోజే ఖర్చు పెట్టిన బడ్జెట్ మొత్తం వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది. ఈ ప్లేస్టేషన్ 5 ఎక్స్‌క్లూజివ్ గేమ్ ఒక వారంలోనే 16 లక్షల కాపీలు సేల్స్ చేసింది. పైగా ఈ గేమ్ సేల్స్ బ్లాక్ బస్టర్ తరహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది సోనీ కంపెనీకి ఒక జాక్ పాట్ లాంటిది.
ఘోస్ట్ ఆఫ్ యోటీ తొలి రోజే తన నిర్మాణ ఖర్చును పూర్తిగా వసూలు చేసింది. ఈ గేమ్‌ను తయారు చేయడానికి ఖర్చు చేసిన మొత్తం డబ్బును మొదటి రోజు వచ్చిన $60 మిలియన్ల ఆదాయాన్ని సమం చేసింది. గేమింగ్ పరిశ్రమలో ఇలాంటి వేగవంతమైన ఆర్థిక వసూళ్లు చాలా అరుదు.
ఘోస్ట్ ఆఫ్ యోటీ ఇప్పటివరకు మొత్తం 20 లక్షల యూనిట్లు అమ్ముడు పోయాయి. ఇప్పుటివరకు ఈ గేమ్ ద్వారా $100 మిలియన్ల పైగా ఆదాయం వచ్చింది. సోనీ PS5 గేమ్‌లలో ఇది రెండో అత్యధిక సేల్స్ సాధించిన లాంచ్‌గా నిలిచింది.
ఘోస్ట్ ఆఫ్ యోటీ ఇంతకు ముందు వచ్చిన గేమ్‌తో పోలిస్తే కొంచెం వెనుకబడింది. ఆ మొదటి గేమ్ విడుదలైన మూడు రోజుల్లో 24 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. అయినప్పటికీ, యోటీ పనితీరు చాలా అద్భుతంగా ఉంది. 93% మంది గేమర్స్ ఇప్పటికే మొదటి గేమ్‌ను పూర్తి చేసి ఘోస్ట్ ఆఫ్ యోటీ పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు.
ఈ గేమ్ అమ్మకాలు ‘అస్సాసిన్స్ క్రీడ్ షాడోస్’ కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గేమ్ సేల్స్ అస్సాస్సిన్స్ క్రీడ్ కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ అమ్మకాల్లో 77 శాతం డిజిటల్ కాపీలు, మిగిలినవి ఫిజికల్ కాపీలు.
విమర్శకులు ఈ గేమ్ యొక్క విజువల్ ప్రెజెంటేషన్‌ను ఎంతగానో ప్రశంసించారు. గేమ్‌లోని కాంబాట్ ఫైట్ సిస్టమ్ చాలా ఆలోచనాత్మకంగా రూపొందించబడిందని, ఓపెన్-వరల్డ్ కాన్సెప్ట్ కూడా బాగా ఆకర్షించిందని విమర్శకులు చెప్పారు. ఈ గేమ్ కు అందరూ టాప్ రివ్యూస్ ఇస్తున్నారు.
ఈ సీక్వెల్ గేమ్‌ని సక్కర్ పంచ్ అనే డెవలపర్ కంపెనీ తయారు చేసింది. ఈ కంపెనీకి అభిమానుల్లో గొప్ప ఆదరణ ఉంది. ఈ కంపెనీ గేమ్స్ పట్ల గేమింగ్ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ గేమ్ విజయానికి ఇదే పెద్ద కారణం.
ప్రస్తుతం ఈ గేమ్ కేవలం PS5లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విడుదల గురించి ఇంకా సమాచారం లేదు. భవిష్యత్తులో సోనీ ఈ గేమ్‌ను ఇతర ప్లాట్‌ఫామ్‌లలో, ముఖ్యంగా PCలో కూడా విడుదల చేయవచ్చు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ గేమ్ సేల్స్ భవిష్యత్తులో కూడా బాగా జరిగే అవకాశాలున్నాయి. రాబోయే కొన్ని వారాల్లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ గేమ్ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్