Vivo V60e vs Realme 15 Pro 5G vs OnePlus Nord 5| చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో భారత మార్కెట్‌లో ఇటీవలే అద్భుత ఫీచర్లు ఉన్న వివో V60e ఫోన్ విడుదల చేసింది. ఇది రియల్‌మీ 15 ప్రో 5G, వన్‌ప్లస్ నార్డ్ 5 ఫోన్‌లతో పోటీ పడుతోంది. ₹30,000 బడ్జెట్‌లో ఈ మూడు ఫోన్‌లు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ మూడు ఫోన్ల ఫీచర్లు, పనితీరు ధరలను పరిశీలించి.. మీకు ఏ ఫోన్ బెస్ట్ అని నిర్ణయించుకోండి.
వివో V60e ధర ₹29,999 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 8GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. రియల్‌మీ 15 ప్రో 5G కూడా అదే స్టోరేజ్ వేరియంట్ ప్రారంభమవుతుంది. దీని ధర ₹31,999. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ 5 ధర కూడా ₹31,999, కానీ ఇందులో 8GB RAM, 256GB స్టోరేజ్‌ను అందిస్తుంది. స్టోరేజ్ విషయంలో నార్డ్ 5 కొంచెం ముందుంది.
వివో V60eలో 6.77-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రియల్‌మీ 15 ప్రో 5Gలో 6.8-అంగుళాల 4D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. రియల్‌మి ఎండలో కూడా స్పష్టమైన ఫొటోలను చూపిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో 6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే విషయంలో రియల్‌మీ స్వల్ప ఆధిక్యంలో ఉంది.
వివో V60eలో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్ ఉంది, ఇది రోజువారీ పనులు, గేమింగ్‌కు మంచి పనితీరును అందిస్తుంది. రియల్‌మీ 15 ప్రో 5Gలో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్ ఉంది, ఇది మిడ్ రేంజ్ ఫోన్‌లలో బలమైన పనితీరును చూపిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 5లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ఉంది, ఇది దాదాపు ఫ్లాగ్‌షిప్ స్థాయి పనితీరును అందిస్తుంది. పనితీరు విషయంలో నార్డ్ 5 సూపర్.
వివో V60eలో 200MP మెయిన్ కెమెరా (OISతో), 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఇది అద్భుతమైన ఫోటోలను తీస్తుంది. రియల్‌మీ 15 ప్రో 5Gలో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5లో 50MP మెయిన్ కెమెరా (OISతో) 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. కెమెరా క్వాలిటీ విషయంలో వివో V60e ఎంతో ఆధిక్యంలో ఉంది.
మూడు ఫోన్‌లలోనూ 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి, ఇవి స్పష్టమైన ఫోటోలు, వీడియో కాల్స్‌కు అనుకూలంగా ఉంటాయి. వివో V60eలో ఐ ఆటో-ఫోకస్ ఫీచర్ ఉంది. ఇది సెల్ఫీలను మరింత స్పష్టంగా, ఆకర్షణీయంగా చేస్తుంది.
వివో V60eలో 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. రియల్‌మీ 15 ప్రో 5Gలో 7000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5లో 6800mAh బ్యాటరీ మరియు 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యంలో రియల్‌మీ కొంచెం ముందుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో వివో కాస్త ముందుంది.
మూడు ఫోన్‌లు 5G, బ్లూటూత్ 5.4, వై-ఫైని సపోర్ట్ చేస్తాయి. వివో V60e, వన్‌ప్లస్ నార్డ్ 5లో NFC ఉంది, అయితే రియల్‌మీ 15 ప్రో 5Gలో IR బ్లాస్టర్ ఉంది. అన్నీ USB టైప్-C ఛార్జింగ్‌ను కలిగి ఉన్నాయి.
మీకు 200MP కెమెరా ముఖ్యమైతే, వివో V60e బెస్ట్ ఆప్షన్. బెస్ట్ డిస్‌ప్లే కోసం రియల్‌మీ 15 ప్రో 5Gని ఎంచుకోండి. పవర్‌ఫుల్ పనితీరు కోసం వన్‌ప్లస్ నార్డ్ 5 కొనుగోలు చేయండి. మీ అవసరాలను బట్టి ఈ మూడింటిలో ఒక ఫోన్‌ను ఎంచుకోవచ్చు.
Also Read: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్ పేరుతో సైబర్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించండి