IND VS WI: ఢిల్లీ వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ లో శుభమాన్ గిల్ సేన పట్టు బిగించింది. నిన్న అద్భుతంగా ఆడిన టీమిండియా ఇవాళ కూడా దుమ్ము లేపింది. ఈ మ్యాచ్ లో ఇద్దరు సెంచరీలు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 134.2 ఓవర్లు ఆడిన టీమిండియా 518 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే డిక్లేర్డ్ చేశాడు. దీంతో వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది.
వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య జరుగుతున్న రెండు టెస్టు ఢిల్లీలోని అరుణ్ జెట్లీ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. ఇందులో 134 ఓవర్లు ఆడిన టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 518 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) డిక్లేర్ చేశాడు. ఈ తరుణంలో వెస్టిండీస్ బ్యాటింగ్ కు దిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 9 ఓవర్లు ఆడి 24 పరుగులు చేసింది. ఇప్పటికే ఓపెనర్ వికెట్ కూడా కోల్పోయింది. జాన్ కాంప్‌బెల్ 25 బంతుల్లో 10 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో సాయి సుదర్శన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అటు చంద్రపాల్ అలాగే అలిక్ అథనాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు.
టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ వచ్చిన తర్వాత టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) అదరగొట్టే బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు. మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టుల్లో అద్భుతంగా రాణించిన గిల్ ఇప్పుడు వెస్టిండీస్ పై కూడా మరో సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 196 బంతుల్లో 129 పరుగులు చేసి దుమ్ము లేపాడు. సాధారణ బ్యాటర్ గా ఇప్పటి వరకు 9 సెంచరీలు చేశాడు గిల్. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్ గా ఏడు టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు గిల్. ఇందులో 933 పరుగులు చేసి ఐదు సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. 84.81 యావరేజ్ తో దుమ్ము లేపుతున్నాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) మరో రికార్డు సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు గిల్. వెస్టిండీస్ పై రెండో టెస్టులో సెంచరీ తో దుమ్ము లేపిన గిల్ ఈ రికార్డు సృష్టించాడు. 71 ఇన్నింగ్స్ లలో 2800కు పైగా పరుగులు చేశాడు గిల్. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) తర్వాత రిషబ్ పంత్ 67 ఇన్నింగ్స్ లలో 2731 పరుగులు చేశాడు. అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 69 ఇన్నింగ్స్ లలో 2716 పరుగులు చేసి రఫ్పాడించాడు. విరాట్ కోహ్లీ 79 ఇన్నింగ్స్ లలో 2617 పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 69 ఇన్నింగ్స్ లో 2505 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 48 ఇనింగ్స్ లలో 2420 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు.
SHUBMAN GILL AS CAPTAIN IN TEST CRICKET:
– 7 Tests
– 933 Runs
– 84.81 Average
– 5 Hundreds
– 1 FiftyCaptaincy has bring the best out of Gill in longer format 👌 pic.twitter.com/Q2xwBpIMmz
— Johns. (@CricCrazyJohns) October 11, 2025