Fake Sora Apps| టెక్ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ అంటే సెక్యూరిటీకి మారుపేరు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్లు, డివైజ్‌లు ఆపిల్ తయారు చేసే ఐఫోన్లు, ఐ ప్యాడ్లు. కానీ తాజాగా ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా లక్షల సంఖ్యలో ఐఫోన్ యూజర్లు దోపిడీకి గురయ్యారు. సైబర్ మోసగాళ్లు మిలియన్ల సంఖ్యలో డాలర్లు కొల్లగొట్టారు. ఇదంతా కొత్త ఏఐ సోషల్ మీడియా యాప్ సోరా ద్వారా జరిగింది.
ఆపిల్ యూజర్ల కోసమే చాట్‌జిపిటి కంపెనీ ఓపెన్ఏఐ కొత్తగా సోరా యాప్ ని రూపొందించింది. ఈ యాప్ కోసం ఐఫోన్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ యాప్ అందుబాటులోకి రాగానే కేవలం అయిదు రోజుల్లో 10 లక్షల డౌన్ లోడ్స్ దాటేసింది. డిమాండ్ విపరీతంగా ఉండడంతో అవకాశం చూసి సైబర్ మోసగాళ్లు రంగంలోకి దిగారు. ఏకంగా సోరా యాప్ పేరుతో పదికిపైగా యాప్స్ ఆపిల్ యాప్ స్టోర్ లో కనిపించారు.
ఒక రీసెర్చ్ కంపెనీ డేటా ప్రకారం, కనీసం 12 నకిలీ సోరా యాప్స్.. ఆపిల్ యాప్ స్టోర్ లో కనిపించాయి. వీటి పేర్లలో ‘సోరా’, ‘సోరా 2’ వంటి పేర్లు ఉపయోగించబడ్డాయి.
ఈ నకిలీ యాప్లను డౌన్లోడ్ చేసుకున్నవారి సంఖ్య చాలా ఎక్కువ. ఒక్క యాప్ మాత్రమే 50,000 సార్లు డౌన్లోడ్ అయింది. మొత్తం నకిలీ యాప్లు 3 లక్షల సార్లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఈ 3 లక్షల మంది బ్యాంక్ అకౌంట్ల నుంచి సైబర్ దొంగలు $160,000 కంటే ఎక్కువ ధనాన్ని దోచుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1. కోటి 61 లక్షలకు పైగా.
ఈ సమస్య గురించి తెలియగానే ఆపిల్ కంపెనీ త్వరగా చర్యలు తీసుకుంది. వెంటనే ఈ నకిలీ యాప్లను యాప్ స్టోర్ నుంచి తొలగించేసింది.
నిజమైన ‘సోరా’ టెక్స్ట్ నుండి వీడియోలను సృష్టిస్తుంది. దీని ఇంటర్ఫేస్ చక్కగా, ప్రొఫెషనల్ లాగా ఉంటుంది. ఇది మీ ఫోన్‌లో అనవసరమైన అనుమతులు అడగదు.
Also Read: శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్‌తో డేంజర్.. వాచిపోయిన వేలితో ఆస్పత్రిపాలైన యూజర్