BigTV English

Amazon Merges India MX Player : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Amazon Merges India MX Player : MX Playerను కొనుగోలు చేసిన అమెజాన్ – అదే లక్ష్యంగా మినీ టీవీలో విలీనం

Amazon Merges India MX Player : ప్రస్తుతం ఓటీటీ కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టాక్‌ షో, క్రికెట్‌ మ్యాచ్‌లు ఒక్కటేంటి? మొత్తం ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం ముఖ చిత్రాన్నే ఈ ఓటీటీలు పూర్తిగా మార్చేశాయి. నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సోనీలివ్‌, జీ5, ఈటీవీ విన్‌, ఆహా సహా వంటి ఓటీటీ వేదికలు ఎప్పటికప్పుడు సరికొత్త ప్రీమియం కంటెంట్​ను నెల, వార్షిక చందాల ద్వారా అందిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయా ఓటీటీ ప్లాట్​ ఫామ్స్​ కొత్త చందాదారులను పెంచుకోవడంతో పాటు, తమ వ్యాపారాన్ని అభివృద్ధి, విసృత్తి చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రతీ మార్గాన్నీ అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్ అప్పుడే తన ప్రయత్నాలు మెుదలు పెట్టేసింది.


ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన వీడియో స్ట్రీమింగ్‌ పోర్ట్‌ ఫోలియోను మరింత విస్తృతం చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే అమెజాన్​కు సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ప్రైమ్‌ వీడియో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తన వీడియో స్ట్రీమింగ్‌ పోర్ట్‌ ఫోలియోను విస్తృతం చేసే దిశగా అడుగులు వేస్తుంది అమెజాన్. అందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ను కొనుగోలు చేసింది.

తమ ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలను అందించి, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మినీటీవీలో విలీనం చేసి, అమెజాన్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌గా తీసుకొచ్చినట్లు ప్రకటించింది. అయితే ఎంతకు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఈ కొనుగోలు సందర్భంగా మాట్లాడిన అమెజాన్​.. భారీ సంఖ్యలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రీమియం కంటెంట్‌ను అందించనున్నట్లు వెల్లడించింది.


ఫ్రీగా చూడొచ్చు – ఎంఎక్స్‌ ప్లేయర్‌ సేవలను ప్రైమ్‌ వీడియో, అమెజాన్‌. ఇన్‌ షాపింగ్‌ యాప్‌, ఫైర్‌ టీవీ కనెక్ట్‌డ్‌ టీవీల్లో వీక్షించొచ్చు. అలానే అమెజాన్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ విలీనం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. దీని కోసం మళ్లీ యాప్‌ను రీ ఇన్‌స్టాల్‌ లేదా అప్‌గ్రేడ్‌ చేయాల్సిన అవసరం లేదు. పైగా భవిష్యత్​లోనూ ఎంఎక్స్‌ ప్లేయర్‌ సేవలు ఉచితంగానే కొనసాగుతాయి. మరింత మందికి ఎంఎక్స్‌ ప్లేయర్‌ను చేరువ చేస్తానని కూడా ఈ కొనుగోలు సందర్భంగా అమెజాన్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్​ హెడ్‌ కరణ్‌ బేడీ తెలిపారు.

ఇక అమెజాన్ ఎంఎక్స్‌ ప్లేయర్‌ను కొనుగోలు చేయటంతో సినీ, వెబ్ సిరీస్ ప్రియుల ఆనందం మిన్నంటింది. ఈ డీల్ తో మరింతగా స్ట్రీమింగ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. హై క్వాలిటీ వీడియోలు, వెబ్ సిరీస్, టాక్ షోలతో పాటు మరిన్నింటిని అమెజాన్ అందిస్తుందని భావిస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఎంఎక్స్‌ ప్లేయర్‌ కొనుగోలుతో వీడియో స్ట్రీమింగ్ లో పెను మార్పులు రానున్నాయన్న మాట నిజమేనని టెక్ వర్గాలు సైతం ఊహిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ALSO READ  : వీవో కొత్త మెుబైల్ కిర్రాక్ బాస్.. హై క్వాలిటీ కెమెరా, లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్ ఇంకా ఏమున్నాయంటే!

 

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

Big Stories

×