BigTV English

Nobel Prize 2024: ఆ ఇద్దరికి నోబెల్ ప్రైజ్, ఇంతకీ ఎవరు వారు? ప్రైజ్ మనీ ఎంత వస్తుందో తెలిస్తే షాకవుతారు

Nobel Prize 2024: ఆ ఇద్దరికి నోబెల్ ప్రైజ్, ఇంతకీ ఎవరు వారు? ప్రైజ్ మనీ ఎంత వస్తుందో తెలిస్తే షాకవుతారు

2024 Nobel Prize has been awarded to Victor Ambros and Gary Ruvkun: కష్టే ఫలి అని అంటుంటారు. కష్టపడుతూ పోతుంటే గుర్తింపు దానంతటదే వస్తుంది అని పెద్దలు చెబుతుంటారు. ఇది అక్షరాల వీరిద్దరి విషయంలో నిజమయ్యింది. వైద్యరంగంలో వారు చేసిన కృషికి ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు లభించింది. నోబెల్ బహుమతి రావడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీరు నోబెల్ బహుమతికి సెలెక్ట్ అయినట్లు నోబెల్ బృందం తాజాగా ప్రకటించింది. దీంతో ఆ ఇద్దరిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. వారి గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో ఆరా తీస్తున్నారు. వారిది ఎక్కడా..? వీరికే ఎందుకు నోబెల్ ప్రైజ్ దక్కాయి.. వీరి విశిష్టతేమిటి? అనే వివరాలను అందులో వెతుకుతున్నారంటా.


Also Read: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

అయితే, స్వీడన్ స్టాక్ హోంలో ఉన్న కరోలిన్ స్కా ఇనిస్టిట్యూలోని నోబెల్ బృందం సోమవారం నోబెల్ అవార్డులను ప్రకటించింది. మైక్రో ఆర్ఎన్ఏ, జన్యు నియంత్రణలో పరిశోధనలు చేసి విశేష కృషి చేసిన అమెరికాకు చెందిన సైంటిస్టులు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్ కున్ మెడిసిన్ లోకు నోబెల్ బహుమతులు దక్కాయంటూ ప్రకటన చేసింది. దీంతో వైద్య శాశ్త్రంలో ప్రముఖ శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువన్ కున్ లకు అరుదైన గౌరవం దక్కినట్టయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు నోబెల్ పురస్కారం. ఇది వారికి లభించడం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మైక్రో ఆర్ఎన్ఏ, పోస్ట్ ట్రాన్ స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్ లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా వీరికి నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ వ్యాప్తంగా వీరికి ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటివరకు వైద్యశాస్త్రంలో 227 మందికి నోబెల్ బహుమతి లభించింది. ఇందులో 13 మంది మహిళలు ఉన్నారు.


ఇదిలా ఉంటే.. భౌతిక శాస్త్రానికి సంబంధించిన అవార్డులను మంగళవారం ప్రకటించనున్నది. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగం, శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను నోబెల్ బృందం వెల్లడించనున్నది. ఈ బహుమతులను డిసెంబర్ 10న ప్రదానం చేయనున్నారు. గ్రహీతలకు అవార్డుతోపాటు 10 లక్షల డాలర్ల నగదును కూడా ఇవ్వనున్నారు.

Also Read: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన హామాస్-ఇజ్రాయెల్ వార్.. నేటికి ఏడాది పూర్తి

స్వీడన్ కు చెందిన ప్రముఖ సైంటిస్ట్, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ అవార్డును అందజేస్తున్నారు. ప్రపంచంలోని వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఆల్ ఫ్రెడ్ నోబెల్ 1896లో మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా నోబెల్ బహుమతులను ప్రతి సంవత్సరం ఇస్తున్న విషయం తెలిసిందే.

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×