Big Stories

Youtuber Creates Cycle:-స్క్వేర్ చక్రాలతో సైకిల్.. సోషల్ మీడియాలో వైరల్..

Youtuber Creates Cycle:- టెక్నాలజీ మాత్రమే కాదు.. రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంశాలలో పెరుగుతున్న పోటీ కూడా మనిషిని వినూత్నంగా ఆలోచించేలా చేస్తోంది. పెద్దగా చదువులు చదువుకోని మనుషులు కూడా కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరికొందరు ఉన్న వస్తువులనే కొత్త మార్పులు చేర్పులతో ముస్తాబు చేస్తున్నారు. తాజాగా ఒక యూట్యూబర్ చేసిన అలాంటి వినూత్న ప్రయత్నమే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

- Advertisement -

సైకిల్, బైకులు, కార్లు.. ఇవన్నీ తయారు చేసిన రోజు నుండి ఇప్పటివరకు ఎన్నో రకాలుగా మార్పులు చేసుకున్నాయి. ఒకప్పుడు మామూలుగా, ఎక్కువ పెట్రోల్‌తో నడిచే బైకుల నుండి కరెంటుతో నడిచే బైకులు వరకు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. చాలా బరువుతో, పెద్దగా ఉండే కార్ల దగ్గర నుండి గ్యాస్‌తో నడిచే స్టైలిష్, మోడర్న్ కార్ల వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ అభివృద్ధిని సాధించింది. ఇప్పటికీ ఈ ఇండస్ట్రీలో రోజుకొక కొత్త డెవలప్‌మెంట్ జరుగుతూనే ఉంది. అలాంటి ఒక కొత్త డెవలప్‌మెంట్‌నే మిస్టర్ క్యూ అనే యూట్యూబర్ చేసి చూపించాడు.

- Advertisement -

సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా జీవిస్తున్నారు కొందరు. ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్ వంటి వాటిలో అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పటి నుండి వారి ఫాలోవర్స్‌ను ఆకర్షించడం ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడమే వారి టార్గెట్. అందుకే రొటీన్ కంటెంట్ అయితే యూజర్లు అట్రాక్ట్ అవ్వరని, కొత్త మెరుగైన క్రియేటివ్ కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి కష్టపడుతున్నారు. అలాగే మిస్టర్ క్యూ కూడా క్రియేటివ్‌గా ఆలోచించి స్క్వేర్ ఆకారంలో చక్రాలు ఉండే సైకిల్‌ను తయారు చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశాడు.

స్క్వేర్ ఆకారంలోని చక్రాలతో ఉండే సైకిల్‌ను తానే స్వయంగా తయారు చేసిన తర్వాత మిస్టర్ క్యూ దానిని తన ఫాలోవర్స్‌కు పరిచయం చేశాడు. పైగా ఇది టర్న్స్ తీసుకోవడానికి, నడపడానికి కూడా సౌకర్యంగా ఉందంటూ దానిని నడిపి చూపించాడు. వారు చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఇది ఒకటని క్యూ పేర్కొన్నాడు. అంతే కాకుండా ఇది చాలా వినూత్నంగా ఉంటుందని కూడా తెలిపాడు. ఇప్పటికే మిస్టర్ క్యూ అప్లోడ్ చేసిన ఈ వీడియోను 3 మిలియన్ నెటిజన్లు చూశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అయ్యారు.అప్పుడే దీనిపై ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News