Big Stories

Karnataka : ఎన్నికల అఫిడవిట్ చూస్తే షాకే.. ఆ మంత్రి ఆస్తులు ఎంతో తెలుసా..?

Karnataka News : కర్ణాటకలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మరో 3 వారాల్లో రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ పార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఓ అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ చూసి ఓటర్లే షాక్ అవుతున్నారు. ఆ రాష్ట్ర మంత్రి ఎం.టి.బి.నాగరాజు దాఖలు చేసిన అఫిడవిట్ సంచలనం రేపుతోంది. నాగరాజు పెద్దగా చదువుకోలేదు. ఆయన విద్యార్హత 9వ తరగతి మాత్రమే. స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ఉంటారు.

- Advertisement -

ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరిట రూ.1,609 కోట్ల ఆస్తులున్నాయని నాగరాజు పేర్కొన్నారు. హొసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. సోమవారం నామినేషన్లు సమర్పించారు. నాగరాజుకు భార్య పేరిట రూ.536 కోట్ల చరాస్తులు, రూ.1,073 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీరిద్దరికీ రూ.98.36 కోట్ల రుణాలున్నాయని ప్రకటించారు.

- Advertisement -

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి నాగరాజు గెలిచారు. ఆ సమయంలో రూ.1,120 కోట్ల ఆస్తులు ప్రకటించారు. కర్ణాటకలో జేడీఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత బీజేపీ అధికారం చేపట్టింది. అయితే ఆ సమయంలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారిలో నాగరాజు కూడా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 2020లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లోనూ రూ.1,220 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. ఆ ఎన్నికల్లో నాగరాజు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. మంత్రి నాగరాజు భారీగా ఆస్తులు ఎలా సంపాదించారన్నే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News