E-Paper
Advertisement

ర్యామ్ ఎక్కువగా వాడే ఆండ్రాయిడ్ యాప్స్‌కు షాక్.. గూగుల్ కొత్త రూల్స్ ఇవే!

ర్యామ్ ఎక్కువగా వాడే ఆండ్రాయిడ్ యాప్స్‌కు షాక్.. గూగుల్ కొత్త రూల్స్ ఇవే!
Advertisement

Android New Rules: ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒకేసారి చాలా యాప్స్ వాడుతున్నప్పుడు ఫోన్ నెమ్మదించడం, యాప్స్ క్లోజ్ అవ్వడం వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. అయితే ఈ సమస్యను తగ్గించేందుకు గూగుల్ కీలక మార్పులు తీసుకొస్తోంది. 2027 నుంచి యాప్స్ పనితీరు, ర్యామ్ వినియోగంపై మరిన్ని కఠినమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

యాప్స్ ర్యామ్ వాడకంపై పరిమితులు:

2027 ప్రారంభం నుంచి ఆండ్రాయిడ్ యాప్స్ ఎంత మెమరీ ఉపయోగిస్తున్నాయనే విషయంపై గూగుల్ కొత్త పరిమితులు విధించనుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నప్పుడు అవసరానికి మించి ర్యామ్ వినియోగించే యాప్స్‌పై చర్యలు ఉండొచ్చు. దీంతో ఫోన్‌లో ఇతర యాప్స్ కూడా సాఫీగా పనిచేసే అవకాశం ఉంటుంది.

Advertisement

Also Read: ఫోన్ వెనుక కలర్ స్క్రీన్.. ఇదేం కొత్త టెక్నాలజీ.. Hisense A10 సిరీస్ వచ్చేసింది!

యాప్స్ పనితీరుపైనా నిఘా:

మెమరీ వినియోగంతో పాటు యాప్స్‌లో ఉండే సమస్యలను కూడా గూగుల్ పరిశీలించనుంది. యాప్స్ త్వరగా ఓపెన్ అవ్వడం, అనవసరంగా క్రాష్ కాకుండా ఉండటం కోసం డెవలపర్లు తమ కోడ్‌ను మరింత మెరుగ్గా తయారు చేయాల్సి ఉంటుంది. నిబంధనలు పాటించని యాప్స్‌కు ప్లే స్టోర్‌లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్ వైటల్స్‌లో కొత్త వివరాలు:

Advertisement

డెవలపర్ల కోసం Android Vitalsలో కొత్త టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ద్వారా యాప్ ఎప్పుడు ఎక్కువ ర్యామ్ తీసుకుంటోంది? ఎక్కడ మెమరీ సమస్యలు వస్తున్నాయి? క్రాష్‌లకు కారణమేంటి? అనే విషయాలను సులభంగా గుర్తించవచ్చు.

కొత్త ఫోన్‌కు మారితే లాగిన్ అక్కర్లేదు:

కొత్త ఫోన్‌కు డేటా మార్చుకునే విధానంలోనూ గూగుల్ మార్పులు చేస్తోంది. ఏప్రిల్ 2027 నుంచి చాలా సాధారణ యాప్స్‌లో Zero Tap Sign In తప్పనిసరి కానుంది. రీస్టోర్ API ద్వారా పాత ఫోన్‌లో ఉన్న యూజర్ సెషన్‌ను కొత్త ఫోన్‌లోకి సురక్షితంగా తీసుకురావచ్చు. దీంతో ప్రతిసారి పాస్‌వర్డ్ టైప్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.

Also Read: ఫోన్ కంటే బిగ్ స్క్రీన్.. ల్యాప్‌టాప్ కంటే పోర్టబుల్.. టాప్-5 గేమింగ్ ట్యాబ్లెట్లు ఇవే!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×