E-Paper
Advertisement

బయటి శబ్దాలకు చెక్ పెట్టే ఏఎన్‌సీ.. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

బయటి శబ్దాలకు చెక్ పెట్టే ఏఎన్‌సీ.. ఇంతకీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
Advertisement

How ANC Works in Headphones: ఈ రోజుల్లో బస్సులో లేదా ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, కెఫేలో కూర్చుని వర్క్ చేసుకుంటున్నప్పుడు లేదా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు చాలా మంది చెవుల్లో ఇయర్ ఫోన్స్ లేదా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తారు. అయితే చుట్టూ ఉండే ట్రాఫిక్ హోరు, జనాల గోల,  రైలు ఇంజిన్ సౌండ్, మన ప్రశాంతతను పాడుచేస్తుంటాయి. ఇలాంటి సమయంలో మనకు గుర్తుకువచ్చే ఒకే ఒక్క ఫీచర్ ఏఎన్‌సీ. ఈ మధ్యకాలంలో లభించే దాదాపు అన్ని ప్రీమియం ఇయర్ ఫోన్స్, హెడ్‌ఫోన్స్‌లలో ఈ ఏఎన్‌సీ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా మారింది. అసలు ఈ చిన్న హెడ్‌ఫోన్‌లు బయటి శబ్దాన్ని ఎలా మాయం చేస్తాయి? దాని వెనక ఉన్న సైన్స్ ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్‌సీ, పీఎన్‌సీ మధ్య  తేడా:

ముందుగా మనం ఏఎన్‌సీ, పీఎన్‌సీ మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా సింపుల్ విషయంతో.. పని చేస్తుంది. మన చెవుల ఆకారాన్ని బట్టి సరిగ్గా సరిcపోయే సిలికాన్ ఈయర్‌టిప్స్ లేదా హెడ్‌ఫోన్స్ కుషన్లు వాడటం ద్వారా బయటి గాలి, శబ్దం చెవిలోకి వెళ్లకుండా అడ్డుకుంటాయి. మనం చెవుల్లో దూది లేదా వేళ్లు పెట్టుకుంటే.. బయటి శబ్దం తగ్గినట్లే ఇది కూడా పని చేస్తుంది. కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అలా కాదు. ఇది శబ్దాన్ని అడ్డుకోవడమే కాకుండా, ఒక అద్భుతమైన టెక్నాలజీ ద్వారా సౌండ్ వేవ్స్ ను నాశనం చేస్తుంది.

ఏఎన్‌సీ పని తీరు:

Advertisement

ఏఎన్‌సీ టెక్నాలజీ పనిచేసే విధానం.. ఫిజిక్స్ లోని వినాశక వ్యతికరణం అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. శబ్దం అనేది తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ప్రతి శబ్ద తరంగానికి ఎత్తులు , పల్లాలు ఉంటాయి. ఏఎన్‌సీ హెడ్‌ఫోన్స్ బయటి నుంచి వచ్చే శబ్ద తరంగాన్ని మైక్రోఫోన్ ద్వారా గ్రహిస్తాయి. వెంటనే హెడ్‌ఫోన్స్ లోపల ఉండే ఒక ప్రత్యేకమైన చిప్ ఆ శబ్దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉండే మరొక శబ్ద తరంగాన్ని సృష్టిస్తుంది. అంటే బయటి శబ్ద తరంగం ఎత్తులో ఉన్నప్పుడు, హెడ్‌ఫోన్ తయారుచేసిన తరంగం పల్లంలో ఉంటుంది. ఈ రెండు తరంగాలు ఒకదానికొకటి ఎదురైనప్పుడు, అవి రెండూ క్యాన్సిల్ అయిపోతాయి. ఫలితంగా ఎలాంటి శబ్దం మన చెవికి వినపడదు.

Also Read: బయటి శబ్దాలకు చెక్ పెట్టే.. ఏఎన్‌సీ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

Advertisement

హెడ్‌ఫోన్స్‌లో ఈ ప్రక్రియ జరగడానికి ప్రధానంగా మూడు భాగాలు పని చేస్తాయి. మొదటిది మిక్స్/మైక్రోఫోన్లు. ఇవి హెడ్‌ఫోన్స్ బయట , లోపల ఉండి, చుట్టూ ఉన్న నాయిస్‌ను రికార్డ్ చేస్తాయి. రెండవది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఇది మైక్రోఫోన్లు పంపిన శబ్దాన్ని మిల్లీసెకన్ల కాలంలో.. విశ్లేషించి, దానికి వ్యతిరేక శబ్దాన్ని తయారుచేస్తుంది. మూడవది స్పీకర్ డ్రైవర్. ఇది ఆ వ్యతిరేక శబ్దాన్ని నాణ్యంగా ప్లే చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ సెకనులో వెయ్యవ వంతు కాలంలో జరుగుతుంది. అందుకే.. మనం హెడ్‌ఫోన్స్‌లో ఏఎన్‌సీ ఆన్ చేయగానే ఒక్కసారిగా ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

అయితే… ఏఎన్‌సీ టెక్నాలజీ అనేది తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలను అద్భుతంగా అడ్డుకుంటుంది. కానీ హఠాత్తుగా ఎవరో కేకలు వేయడం, పక్కనే ఉన్నవారు గట్టిగా మాట్లాడటం లేదా హారన్ శబ్దాలు వంటి ఫ్రీక్వెన్సీ శబ్దాలను పూర్తిగా అడ్డుకోలేదు. లేటెస్ట్ హెడ్‌ఫోన్స్‌లలో ‘ఆడాప్టివ్ ఏఎన్‌సీ’ లేదా ‘ట్రాన్స్‌పరెన్సీ మోడ్’ వంటి ఆప్షన్లు కూడా ఇస్తున్నారు. దీని వల్ల రోడ్డుపై నడుస్తున్నప్పుడు బయటి శబ్దాలు లేదా అత్యవసర అనౌన్స్‌మెంట్లు వినడానికి హెడ్‌ఫోన్స్ తీయనవసరం లేకుండా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ప్రశాంతమైన మ్యూజిక్ ఫీల్ కోరుకునే వారికి ఏఎన్‌సీ టెక్నాలజీ బెస్ట్.

Related News

ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్‌లో ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా? మీ పనులన్నీ చాలా ఈజీ అయిపోతాయి!

ర్యామ్ ఎక్కువగా వాడే ఆండ్రాయిడ్ యాప్స్‌కు షాక్.. గూగుల్ కొత్త రూల్స్ ఇవే!

ఫోన్ వెనుక కలర్ స్క్రీన్.. ఇదేం కొత్త టెక్నాలజీ.. Hisense A10 సిరీస్ వచ్చేసింది!

మార్కెట్‌లో ట్రెండ్ అవుతున్న ఫోర్ డోర్ ఫ్రిజ్‌లు.. ఫీచర్లు అదిరిపోయాయ్

ఫోన్ కంటే బిగ్ స్క్రీన్.. ల్యాప్‌టాప్ కంటే పోర్టబుల్.. టాప్-5 గేమింగ్ ట్యాబ్లెట్లు ఇవే!

తక్కువ ధరలో పవర్‌ఫుల్ వాషింగ్..అమెజాన్ ఆఫర్‌లో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ !

చిన్న సైజు ఫోన్లకు గుడ్‌బై చెప్పిన యాపిల్.. iPhone Mini ఎందుకు ఆగిపోయింది?

Big Stories

Advertisement
×