E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్‌లో ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా? మీ పనులన్నీ చాలా ఈజీ అయిపోతాయి!

ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్‌లో ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా? మీ పనులన్నీ చాలా ఈజీ అయిపోతాయి!
Advertisement

Android Laptop: స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఎన్నో సదుపాయాలు ఇప్పుడు ఆండ్రాయిడ్ ల్యాప్‌టాప్‌లలోనూ అందుబాటులోకి వస్తున్నాయి. సాధారణంగా బ్రౌజింగ్, వీడియోలు చూడటం, మెయిల్స్ పంపడం వరకే ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తుంటాం. కానీ కొన్ని చిన్న ఫీచర్లను ఉపయోగించడం మొదలుపెడితే రోజువారీ పనులను మరింత వేగంగా పూర్తి చేయొచ్చు.

ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయడం:

ఆండ్రాయడ్ ఫోన్‌ను ల్యాప్‌టాప్‌తో అనుసంధానం చేసుకుంటే ఫోన్ నోటిఫికేషన్లు, మెసేజ్‌లను ల్యాప్‌టాప్‌లోనే చూడొచ్చు. ఫొటోలు, డాక్యుమెంట్లు వంటి ఫైళ్లను కూడా సులభంగా పంపుకోవచ్చు. ప్రతిసారీ ఫోన్ చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

స్ల్పిట్ స్క్రీన్‌తో ఒకేసారి రెండు పనులు:

Advertisement

ఒకవైపు బ్రౌజర్‌లో సమాచారం వెతుకుతూ.. మరోవైపు డాక్యుమెంట్‌లో రాసుకోవచ్చు. స్ల్పిట్ స్క్రీన్ ఫీచర్‌తో రెండు యాప్‌లను ఒకేసారి తెరపై ఉంచి పని చేయడం సులభమవుతుంది. తరచూ యాప్‌లు మార్చాల్సిన ఇబ్బంది తగ్గుతుంది.

Also Read: ర్యామ్ ఎక్కువగా వాడే ఆండ్రాయిడ్ యాప్స్‌కు షాక్.. గూగుల్ కొత్త రూల్స్ ఇవే!

కీబోర్డ్ షార్ట్‌కట్స్ అలవాటు చేసుకోండి:

Advertisement

Ctrl+Cతో కాపీ, Ctrl+Vతో పేస్ట్, Ctrl+Fతో వెతకడం వంటి కీబోర్డ్ షార్ట్‌కట్స్ రోజువారీ పనుల్లో చాలా సమయం ఆదా చేస్తాయి. వీటితో పాటు యాప్‌లు, బ్రౌజర్ ట్యాబ్‌ల మధ్య త్వరగా మారే షార్ట్‌కట్‌లను కూడా నేర్చుకుంటే పని మరింత వేగంగా పూర్తవుతుంది.

క్విక్ షేర్‌తో చిటికెలో పని పూర్తి:

USB కేబుల్ లేకుండానే Quick Share ద్వారా ఫోన్ నుంచి ల్యాప్‌టాప్‌కు ఫొటోలు, డాక్యుమెంట్లు పంపుకోవచ్చు. దీని వల్ల ప్రతిసారీ చేతిలో ఫోన్ తీసుకుని ఫొటోలు సెలెక్ట్ చేసుకుని పంపుకునే శ్రమ తగ్గుతుందనే చెప్పాలి.

Voice Typingతో మరింత సౌకర్యం:

అలాగే Voice Typing ఉపయోగించి మాట్లాడిన మాటలను నేరుగా టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. ఎక్కువగా టైప్ చేయాల్సినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సీక్రెట్ ట్రిక్స్ వాడటం వలన బ్రెయిన్ కూడా షార్ప్‌గా పనిచేస్తుంది.

Also Read: ఫోన్ వెనుక కలర్ స్క్రీన్.. ఇదేం కొత్త టెక్నాలజీ.. Hisense A10 సిరీస్ వచ్చేసింది!

Tags

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×